సోమవారం, ఏప్రిల్ 04, 2016

చినుకు చినుకు పడుతూ వుంటే...

సత్యం గారు స్వరపరచిన ఒక మంచి వాన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

చినుకు చినుకు పడుతూ వుంటే
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ
ఒకరికొకరు చలిమంటైతే..
అయితే!
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

చినుకు చినుకు పడుతూ వుంటే
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ
ఒకరికొకరు చలిమంటైతే
అయితే!
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

ఆహా హా హహ.. హ హ హ .. హ హ హ..

చేయ్యి నడుము చుట్టేస్తుంటే
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా..ఆ..ఆ...
చేయ్యి నడుము చుట్టేస్తుంటే
చెంప చెంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా
ఆఆ.. ఆఆ..ఆఆ
ఊపిరాడలేదని నువ్వు
ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకు
ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే..ఆ.. ఆఆ
తడిసి తడిసి ముద్దవుతుంటే..ఆ.. ఆఆ
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.. ఆఆ
ఒకరికొకరు చలిమంటైతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

సొంపులన్నీ దాచే మేర
ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా
సొంపులన్నీ దాచే మేర
ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా
ఆఆ.. ఆఆ..ఆఆ..
గుట్టుగున్న నిను చూస్తుంటే
కోంటె కోర్కె నాకొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకు
పగ్గాలు లేవింక జంకెందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే..ఆ.. హా
తడిసి తడిసి ముద్దవుతుంటే..ఆ.. హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..స్స్..ఆ.. హా
ఒకరికొకరు చలిమంటైతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.