శనివారం, ఏప్రిల్ 16, 2016

వస్తావు కలలోకీ...

చక్రవర్తి గారు స్వరపరచిన ఒక చక్కని యుగళ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : ఎం.రమేష్, పి.సుశీల

వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ
వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ తీరేది ఎన్నటికీ

వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
నువు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ

పెదవి పైనా పెదవికి గుబులు.. 
పడుచుదనమే తీయటి దిగులు
కుర్రవాడికి తీరదు మోజు.. 
చిన్నదానికి బిడియం పోదు
హ .. చూపూ చూపూ కలిసిన చాలు
కొంగూ కొంగు కలిపిన మేలు
నన్ను దరిచేరనీ.. ముందు వాటాడనీ..
ముద్దు నెరవేరనీ.. ముందు జతకూడనీ..

వస్తావు కలలోకీ.. రానంటాను కౌగిలికీ
నే కన్న కలలన్నీ.. చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ.. సగపాలు ఇద్దరికీ

చిన్నదాన్ని నిన్నటి వరకూ.. 
కన్నెనైనది ఎవ్వరి కొరకూ
నాకు తెలుసూ నాకోసమనీ.. 
నీకె తెలియదు ఇది విరహమనీ
నేనూ నువ్వు మనమైపోయే వేళ
ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏల
వలచి వలపించనా.. కరిగి కరిగించనా
నవ్వి నవ్వించనా.. గెలిచి గెలిపించనా
 
వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
నువు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ

హేహహహ..వస్తావు కలలోకీ.. 
లాలలాలాలల రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ లాలాలలలల
ఆ ముద్దు మురిపాలూ లాలలలా 
తీరేది ఎన్నటికీ లలాలాలా


1 comments:పెదవికి పెదవికి గుబులుగ
అధరము బెదిరెను కుదురక అణువణు వయ్యెన్ !
పదనిస సరిగమ పదముల
చెదురక మనసున రమణిని చెకుముకి జేసెన్ !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.