గురువారం, ఏప్రిల్ 14, 2016

ఎంత ఘాటు ప్రేమయో...

పాతాళ భైరవి చిత్రంలోని ఒ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పాతాళ భైరవి (1951)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, లీల

ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...

ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
యెంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పి జెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో..


 

1 comments:


ఓ జాబిలి ఓ వెన్నెల
మా జానకి నిటు జిలేబి మధురము యనగన్
రాజుగ మా రాముడు గాం
చెన్! జో హారులి డరమ్ము ! జేజే యనుమా !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.