ఆదివారం, ఏప్రిల్ 03, 2016

నీ కోసం యవ్వనమంతా...

మూడు ముళ్ళు చిత్రంలోని ఓ మంచి మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఇది నాకు రేడియో పరిచయం చేసిన పాటే అయినా సినిమా చూశాక వీడియో కనుల ముందు మెదిలి నవ్విస్తూనే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మూడుముళ్ళు (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా
లాలాలాల..లాలా...

అటు చూడకు జాబిలి వైపు
కరుగుతుంది చుక్కలుగా
చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో
అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా
నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో
నా హృదయం టూ-లెటు కాదు 
మన జంటకి డ్యూయెటు లేదు
ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

అటు చూడకు లోకం వైపు 
గుచ్చుతుంది చూపులతో
ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో
అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో
విరి శయ్యల వేడి లోనే పరువాలను పంచుకో
నా కొద్దీ కసి కాలేజీ మానేస్తా నే మ్యారేజి
మరులన్నీ మనవీ అన్న మనవే చేసుకున్నా

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా



1 comments:

Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.