మంగళవారం, ఏప్రిల్ 05, 2016

మధువొలకబోసే...

కన్నవారి కలలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కన్నవారి కలలు (1974)
సంగీతం : వి.కుమార్
సాహిత్యం : రాజశ్రీ
గానం : రామకృష్ణ, పి.సుశీల

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ
అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ
తలవకనే కలిగినచో అది ప్రేమబంధమూ
బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ
మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

గగమముతో కడలి చెలి తెలిపినది ఏమనీ 
తలపులకూ వలపులకూ సరిహద్దు లేదనీ
కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ
జగమునకూ మన చెలిమీ ఆదర్శమౌననీ
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే హా ఈ చిలిపి కళ్ళూ హా..ఆ
అవి నాకు వేసే ఆఆ.ఆఅ.. బంగారు సంకెళ్ళూ 

 


1 comments:


మధువొలక బోయు నీ చిరు
పెదవుల తడిలో విరిసెను ప్రేమయు జూడన్ !
సుధయును జిలేబి నేడే
విధిగా గంటి మదిలోన విరహపు వేళన్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.