పెద్దాడ మూర్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పెద్దాడ మూర్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, మే 07, 2019

శృంగార లహరీ..

అక్షయ తృతీయ సంధర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ.. శుభలేఖ+లు చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుభలేఖ+లు (2018)
సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్   
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : సాయి శివాని

శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
  
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..


శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
  
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..

సంగీత భోజానంద
మధు మాధురీ
మద మధుకరీ
మంగళాంగి
మదనారీ
మనోహరీ
మామవ

శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ.. 
ఆఆఆఆఆఆ...

అంగజారి
హృదయాగమ
తరహసితే
అఖిలాగమ
సన్నుతే

శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..
  
శృంగార లహరీ..
శ్రిత జన శుభకరి..
సౌందర్య లహరీ..


ఆదివారం, జనవరి 20, 2019

పద్మనాభ పాహి...

శుభలేఖ+లు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుభలేఖ+లు (2018)
సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : కె.ఎమ్.రాథాకృష్ణన్

పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ....
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...

కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది  
ఎదురయ్యే సమయం
కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది  
ఎదురయ్యే సమయం
మనసు దేనికై పరుగు తీయునో
మదికి నెమ్మదిని ఎచట ఇచ్చునో
అది వెతికిన ప్రతి ఒకరికి దొరికేనా
ఏమో...

పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...

ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
నిన్ను నిన్నుగా ఏది ఉంచునో
నిన్ను రేపులతొ ఊరడించునో
ఆ చెలిమిని మరువకు మరి ఏనాడైనా
తోడే...

పద్మనాభ పాహి
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ... శౌరీ... శౌరీ..
 

సోమవారం, ఆగస్టు 29, 2016

నాలో సగమై...

నా మనసుకేమయింది చిత్రంకోసం ఆర్పీపట్నాయక్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఫ్లాష్ ప్లేయర్ లోడవని వాళ్ళు వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నా మనసుకేమయింది (2007)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : సునీత

నాలో సగమై
నీడల్లొ నిజమై
నువ్వే వున్నావనీ

నాలో వలపే
నీకే తెలిసీ
కలిసేదేనాడనీ

హృదయం గువ్వల్లె సాగి
నా గూడు వీడి
నీ చెంత చేరిందనీ

తగదని బతిమాలుకున్నా
వినిపించుకోదే
నా మనస్సుకేమయింది..

లాలా లలలాలలాలా లాలా లాలా
లాలా లలలాలలాలా లాలా లాలా

 

గురువారం, మార్చి 24, 2016

బుగ్గే బంగారమా...

నచ్చిన అమ్మాయితో పెళ్ళి కుదిరితే ఆ మైమరపులో ఎవరిని చూసినా తనని చూసినట్లే ఉంటుంది కదా అదిగో అలాంటి ఓ అబ్బాయి ఊహల్ని ఈ పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణ
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : రాజేష్

పచ్చిపాల యవ్వనాల గువ్వలాట
పంచుకుంటే.. రాతిరంతా జాతరంట

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
పట్టుచీరల్లో చందమామ
ఏడువన్నెల్లో వెన్నెలమ్మా
కన్నెరుపాన కోనసీమ
కోటితారల్లో ముద్దుగుమ్మా
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా

యాలో యాల యేలో యేలో
యాలో యాలా యేలెలో
యాలో యాల యేలో యేలో
యాలో యాలా యేలెలో

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం.. చెలికే సొంతం.. వసంతం
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు.. కలలో జరిగే విహారం

పుష్యమాసానా మంచునీవో
భోగిమంటల్లో వేడినీవో
పూల గంధాల గాలినీ..వో
పాలనురగల్లో తీపినీవో

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా

హియర్ వీ గో ..

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానె అరుబైట ఎన్నెలింట
సద్దుకున్న కన్నెజంట సద్దులాయెరో.. యో..
నారుమల్ల తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సద్దుకున్న కన్నెజంట సద్దులాయెరో

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం.. జరిగే సరసం.. ఎపుడో

అన్నిపువ్వుల్లో ఆమె నవ్వే..
అన్ని రంగుల్లో ఆమె రూపే..
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే..
నన్ను మొత్తంగా మాయచేసే..

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
పట్టుచీరల్లో చందమామ
ఏడువన్నెల్లో వెన్నెలమ్మా
కన్నెరుపాన కోనసీమ
కోటితారల్లో ముద్దుగుమ్మా



శనివారం, మే 10, 2014

నీవే నీవే నీవే నేనంటా...

చక్రి సంగీత దర్శకత్వంలో చక్కని లిరిక్స్ తో పెద్దాడ మూర్తి రాసిన ఒక చక్కని అమ్మ పాట ఇది. ఈ లిరిక్స్ నాకు చాలా ఇష్టం అలాగే చిత్రీకరణ కూడా. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమ్మానాన్న ఓ తమిళమ్మాయి (2003)
సంగీతం : చక్రి 
సాహిత్యం : పెద్దాడ మూర్తి 
గానం : చక్రి 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా..
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే..
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా.. 
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. 
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.