గురువారం, ఏప్రిల్ 01, 2021

లాహే లాహే లాహే...

ఆచార్య సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆచార్య (2021)
సంగీతం : మణిశర్మ   
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హారిక నారాయణ్, సాహితి చాగంటి

లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లే..  

కొండల రాజు బంగరు కొండ
కొండా జాతికి అండా దండా
మధ్యే రాతిరి లేచి
మంగళగౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా 
మంచూకొండల సామిని తలసిందే

లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లే..  
 
మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరి పడంగా
ఒంటి ఇభూది జలజల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విలవిల నలిగిండే
 
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లే..  

కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబూసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు
ఎన్నెల కాసిందే
పెనివిటి రాకను తెలిసీ
సీమాతంగీ సిగ్గులు పూసిందే
 
ఉబలాటంగా ముందటికురికి
అయ్యవతారం చూసిన కలికి 
ఏందా శంఖం శూలం భైరాగేశం 
ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటయినా రాలేవా 
అని సనువుగా కసిరిందే

లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లే..  
 
లోకాలేలే ఎంతోడైనా 
లోకువ మడిసే సొంతింట్లోనా
అమ్మోరి గడ్డం పట్టి
బతిమాలినవీ అడ్డాల నామాలు
ఆలు మగలా నడుమన
అడ్డం రావులే ఇట్టాంటి నియమాలు
ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకు ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం
కుదిరే ఏలకి మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి 
గుళ్ళో గంటలు మొదలాయే
 
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లే..  

లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లాహే  
లాహే లాహే లాహే లే..  

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమెకమయ్యీ ఏకం అవడం
అనాది అలవాటీళ్ళకి
అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు
అనుబంధాలు కడతేరే పాఠం 
 

 

2 comments:

చాలా రోజుల తరువాత మణిశర్మ,చిరంజీవి గారి కలయికలో పాటా విడుదలయింది మరియు పాటా చాలా బాగుంది

అవును శ్రవణ్ గారు.. పాట చాలా చాల నచ్చేసింది నాక్కూడా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.