సోమవారం, జూన్ 30, 2014

శ్రీరస్తూ శుభమస్తూ..

ఈ సినిమా విడుదలయిన తర్వాత నుండీ హైందవ సంప్రదాయంలో వివాహం చేసుకునే ప్రతి ఒక్కరి పెళ్ళి వీడియో క్యాసెట్ లోనూ ఈ పాట చెరగని చోటు సంపాదించుకుంది. ఆ చోటును ఇంకా పదికాలాలపాటు నిలుపుకుంటుంది కూడా, అంత చక్కని సంగీత సాహిత్యాలీ పాట సొంతం. వాటికి తగ్గట్లు వధూవరుల క్లోజప్ షాట్స్ తో వాళ్ళ చిలిపి అల్లర్లతో ఇంత అందంగా ఈ పాట చిత్రీకరించడం బాపురమణ గార్లకే చెల్లింది. ఈ అందమైన పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం 
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
 
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మణికి నింపుకో

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం 
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

ఆదివారం, జూన్ 29, 2014

సఖీ హే కేశి మథన...

ఈ రోజు పూరీ జగన్నాధుని రథయాత్ర సందర్బంగా స్వర్ణకమలం సినిమాకోసం విశ్వనాథ్ గారు చిత్రీకరించిన ఈ జయదేవుని అష్టపదిని తలుచుకుందాం. ఈ పాటలో విదేశీ నర్తకి షరాన్ లోవెన్ చేసిన చక్కని ఒడిస్సీ నృత్యం కన్నుల విందుగా ఉంటుంది. వేదిక పై జగన్నాధుని విగ్రహాలు పూరీ నేపథ్యంతో అలంకరించడం ఓ ప్రత్యేకం. ఈ అష్టపదికి ప్రతిపదార్ధాలతో కూడిన చక్కని వ్యాఖ్యానం ఇక్కడ చదవవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : స్వర్ణకమలం (1988) 
సంగీతం : భువనేశ్వర్ మిశ్రా (ఈ పాటకు మాత్రమే)
సాహిత్యం : జయదేవ (అష్టపది)
గానం : తృప్తిదాస్ 

సఖి! హే కేశిమథన ముదారం
సఖి! హే కేశిమథన ముదారం 
రమయ మయా సహ మదన మనోరథ
రమయ మయా సహ మదన మనోరథ
భావితయా స వి కారమ్‌
భావి తయా సవికారమ్‌

సఖి! హే కేశిమథన ముదారం

నిభృత నికుంజ గృహం గతయా నిశి 
రహసి నిలీయ వసంతం 
చకిత విలోకిత సకల దిశా
రతి రభస భరేణ హసంతమ్‌

సఖి! హే...
ప్రథమ సమాగమ లజ్జితయా పటు 
చాటు శతైరనుకూలం...
మృదు మధురా స్మిత భాషితయా
శిథిలీకృత జఘన దుకూలమ్‌
 
కేశిమథన ముదారం 

చరణ రణిత మణి నూపురయా పరి
పూరిత సురత వితానం 
ముఖర విశృంఖలా.ఆఆ..
ముఖర విశృంఖల మేఖలయా
సకచ గ్రహ చుంబన దానమ్‌

కేశిమథన ముదారం
సఖి! హే... హే..హే...
కేశిమథన ముదారం


శనివారం, జూన్ 28, 2014

ఎదలో తొలి వలపే...

70's, 80's లో బాలు గారు జానకి గారు కలిసి పాడిన కొన్ని పాటలు వింటూంటే పాట పాడినట్లుగా కాక వాళ్ళిద్దరూ పోటా పోటీగా ఆటాడుకున్నట్లుగా అనిపిస్తుంటుంది, అలాంటి ఓ అందమైన పాట ఎర్రగులాబీలు లోని ఈ పాట. ఇళయరాజా గారి సంగీతానికి ఇద్దరూ వందశాతం న్యాయం చేశారనడంలో ఏ సందేహంలేదు. మీరూ ఆనందించండి ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఎర్ర గులాబీలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి

లలలలల లా..
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

రోజాలతో పూజించనీ.. 
విరి తెనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ.. 
అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ..
కధలే నడిపిందీ..ఈ..ఈ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

పయనించనా నీ బాటలో.. 
మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని.. 
కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే..
సాగే చేలరేగే..ఏ..ఏ..

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ

ఎదలో తొలి వలపే..

శుక్రవారం, జూన్ 27, 2014

ఇది తీయని వెన్నెల రేయి...

సత్యం గారి స్వరకల్పనలో ఆరుద్ర గారు రాసిన ఓ కమ్మని పాట. రేడియో నాకు పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. పాట మధ్యలో 'సుజా' అన్న పిలుపు విన్నపుడు నవ్వుకునే వాళ్ళం చాలా ఫీలై పిలుస్తున్నారు బాలు గారు అని :-) అప్పట్లో ఇయర్ ఫోన్స్ లేవు కనుక పాటలన్నీ పైకే పెద్దగా వినాల్సొచ్చేది, సో శ్రద్దగా రేడియో దగ్గరపెట్టుకుని వింటూన్నపుడు ఈపాట వచ్చే టైమ్ లో పక్కన పెద్దవాళ్ళుంటే మొహమాటానికైనా సరే స్టేషన్ మార్చేయాల్సి వచ్చేది. అదే అలమారలో దాని మానాన అది మోగుతున్నపుడు మాత్రం సైలెంట్ గా వినేసేవాడ్ని. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలూ
ఇది తీయని వెన్నెల రేయి 
మది వెన్నెల కన్నా హాయి

ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
సుజా...
నడిరాతిరి వేళ నీ పిలుపు 
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు 
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి 
నా ఒడిలో వాలును నీ వలపు

ఇది తీయని వెన్నెల రేయి 
మది వెన్నెల కన్నా హాయి

నా మనసే కోవెల చేసితిని 
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని 
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు 
కనువిందులు చేసే శిల్పాలు

ఇది తీయని వెన్నెల రేయి 
మది వెన్నెల కన్నా హాయి

నీ పెదవులు చిలికే మధురిమలు 
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు 
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు 
కలకాలం నిలిచే కావ్యాలు

ఇది తీయని వెన్నెల రేయి 
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు 
కురిపించెను ప్రేమలేఖలు..ఊఊ..
ప్రేమలేఖలు..
ఇది తీయని వెన్నెల రేయి 
మది వెన్నెల కన్నా హాయి


గురువారం, జూన్ 26, 2014

తీయ తీయని కలలను...

బోంబే జయశ్రీ గారు పాడిన మరో మంచి పాట ఇది, చాలా బాగుంటుంది. ఇలాంటి చక్కని సంగీతాన్ని కంపోజ్ చేయగలిగిన ఆర్పీ పట్నాయక్ తన ట్యూన్స్ ఒకేలా కాకుండా జాగ్రత్తపడుతూ వైవిధ్యమైన సంగీతాన్నిచ్చి మ్యూజిక్ కెరీర్ పై మరికొంత శ్రద్దపెట్టి ఉంటే మరిన్ని మంచి పాటలు అందించగలిగి ఉండేవాడేమో. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శ్రీరామ్ (2002)
సంగీతం : ఆర్పీ పట్నాయక్ 
సాహిత్యం : ఆర్పీ పట్నాయక్, కులశేఖర్ 
గానం : బోంబే జయశ్రీ

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలొ

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే
తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే

చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో
నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటొ

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్లలో

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
 

బుధవారం, జూన్ 25, 2014

తళ తళ తారక లాగా...

ఒక చక్కని రిథమ్ తో హాయిగా సాగిపోయే ఓ మధురమైన పాట "ప్రేమకు వేళాయెరా" సినిమా కోసం ఎస్వీకృష్ణారెడ్డి గారు స్వరపరచిన ఈ 'తళ తళ తారకలాగా' పాట. క్యాసెట్ ఇన్ లే కార్డ్ పై రచయిత పేరులేకపోవడం వల్ల ఈ పాట రాసినది సిరివెన్నెలగారో చంద్రబోస్ గారో తెలియలేదు. ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ప్రెమకువేళాయెరా (1999)
సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్, హరిణి

ఆఆఆఅ..ఆఆఆ.ఆ..ఆఆఅ..ఆఆఆ...
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక.. 
పంచదారల ప్రేమచినుకా...అఆ...

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ తాకింది నాజన్మ పొంగింది

పంచవన్నెల రామచిలుక 
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక.. 
పంచదారల ప్రేమచినుకా...అఆ...

నాతేనె విందువు నువ్వే నాలంకె బిందెవు నువ్వే
నాగుండె గంపలోనా ఒంపుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న ఒద్దికైన ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నాచెంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది

పంచవన్నెల రామచిలుక 
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా 

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుకా.ఆఅ..
ఓ పంచదారల ప్రేమచినుకా..ఆఆఆ...


మంగళవారం, జూన్ 24, 2014

శంభో శివ శంభో...

బాలచందర్ గారు తీసిన చిత్రాలలో విశిష్టమైన స్థానం సంపాదించుకునే చిత్రం అందమైన అనుభవం. ఇందులో విశ్వనాథన్ గారు స్వరపరచిన పాటలన్నీ సూపర్ హిట్సే... వాటిలో ఫాస్ట్ గా సాగే ఈ పాట అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం, ఆత్రేయ గారి సాహిత్యం బాగుంటుంది ఇంతటి ఫాస్ట్ పాటలో లైఫ్ ఫిలాసఫీ భలే చెప్పారనిపించింది. రజనీకాంత్ భలే ఉంటారు ఈ పాటలో. మీరూ చూసి వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

శంభో శివ శంభో.. శివ శంభో.. శివ శంభో..ఓ..
వినరా ఓరన్నా ..అనెరా వేమన్న...
జగమే మాయన్నా... శివ శంభో...
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..

వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న ..నేడే నీదన్న ...శివ శంభో..ఓ..

అందాన్ని కాదన్న.. ఆనందం లేదన్న..
బంధాలు వలదన్న... బ్రతుకంతా చేదన్న..
సిరులున్నా.. లేకున్నా.. చెలితోడు నీకున్నా..
అడవిలో నువ్వున్నా.. అది నీకు నగరన్నా...ఆ..ఆ..ఆ

వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..

ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న..
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న..
నీదన్న నాదన్న.. వాదాలు వలదన్న..
ఏదైనా మనదన్న.. వేదాన్నే చదువన్న..ఓ..ఓ...
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న..ఆ..
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న..
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న..
ఈనాడు సుఖమన్న.. ఎవడబ్బ సొమ్మన్నా..

వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..

సోమవారం, జూన్ 23, 2014

ప్రియతమా.. ప్రియతమా...

బసవపున్నమ్మగా భానుమతమ్మ గారు అంత పెద్ద వయసులో కూడా తన నటనా విశ్వరూపం చూపించిన సినిమా పెద్దరికం. ఇందులోనే పరశురామయ్య పాత్ర పోషించిన పిళ్ళై గారి నటన కూడా చాలా బాగుంటుంది ఇద్దరికిద్దరూ సమఉజ్జీలుగా నటించారు. ఈ సినిమాలో కథా, కామెడీ, పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఇందులోనిదే ఓ మంచి మెలోడీ ఈ పాట, మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
రచన : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. ఓఓ తరలిరా

నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా


ఆదివారం, జూన్ 22, 2014

ఓ చిన్నదాన నన్ను విడిచి...

కృష్ణ గారి పాటలు చూడడమొక ట్రీట్ అన్న విషయం మనలో చాలామంది అంగీకరిస్తారు అలాంటి పాటలలో తప్పక చూడవలసిన పాట ఇది. కొసరాజు గారి సాహిత్యానికి కోదండపాణి గారి సంగీతం మాంచి హుషారుగా సాగుతుంది దానికి తగ్గట్లే బాలు గారి గాత్రమూ జోరుగా సాగుతుంది. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నేనంటే నేనే (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఓ చిన్నదానా
ఓ..చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటుచూడూ..పిల్లా..
మనసువిప్పి మాటాడూ..బుల్లీ..
ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
ఓహోహో....  ఓహోహో
నే చూడని జాణ లేదు భూలోకంలో పిల్లా..
నను మెచ్చని రాణి లేదు పై లోకంలో
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే..
కంటికి నచ్చావే చెంతకు వచ్చానే..
నిలవకుండ పరుగుతీస్తే నీవే చింత పడతావే హెహే...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..
బెదిరి బెదిరి లేడిలాగా గంతులేయకే..
చేయిబట్టి అడిగినపుడు బిగువు చేయకే..
రంగు చీరలిస్తానే...ఏఏఏ....
రంగు చీరలిస్తానే ...రవ్వల కమ్మలేస్తానే..
దాగుడుమూతలు వదిలి కౌగిలి యిమ్మంటానే పిల్లా..

గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మాఆఆ..

నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా.. ఒహోహో ఆహాహా
నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా..
నీ కౌగిటిలో గుంగుమ్ముగ రాగం తీస్తా..
కారులోన ఎక్కిస్తా.. పోయ్..పోయ్..
జోరు జోరుగ నడిపేస్తా..
కారులోన ఎక్కిస్తా.. జోరు జోరుగ నడిపేస్తా..
చెంప చెంప రాసుకుంటూ జల్సాగా గడిపేస్తా..
పిప్పిరి పిప్పిరి పిపిపి
పిప్పిరి పిప్పిరి పిపిపి

ఓ..చిన్నదానఆఅ...
ఓ..చిన్నదాన నన్ను విడిచి పోతావటే
పక్కనున్నవాడిమీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటుచూడూ..మనసువిప్పి మాటాడూ
నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు...

అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
అహ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మాఆఆ..శనివారం, జూన్ 21, 2014

దాసోహం.. దాసోహం.. దాసోహం

రేడియో నాకు పరిచయం చేసిన మరో చక్కని పాట ఇది. మహదేవన్ గారు, ఆత్రేయ గారు, బాలు గారు, సుశీల గారు అందరూ కలిసి చేసిన మ్యాజిక్ ని మీరూ ఆస్వాదించి ఎలా ఉందో చెప్పండి. ఈ సినిమా తాలూకు వీడియో నాకు లభించలేదు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

 
చిత్రం : పెళ్ళి చూపులు (1983)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు, సుశీల

దాసోహం.. దాసోహం.. దాసోహం ...
దాసోహం.. దాసోహం.. దాసోహం

మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు
చలువలోని చెలిమికి .. దాసోహం
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు
చలువలోని చెలిమికి .. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం.. 
దాసోహం దాసోహం దాసోహం

వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు .. దాసోహం
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు .. దాసోహం

దాసోహం.. దాసోహం.. దాసోహం
దాసోహం.. దాసోహం.. దాసోహం

నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు
నేల పరిచింది ఈ పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు
ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు
ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు
కలిసి నడిచింది.. కబురులాడింది.. 
కడకు చేర్చింది నీ నీడకు

మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు..
చలువలోని చెలిమికి.. దాసోహం
వెల్లువంటి మనిషికి.. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు.. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం 
దాసోహం దాసోహం దాసోహం

నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి..
తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి..
అడుగు పెట్టింది.. దీపమెట్టింది.. 
దేవతయ్యింది నా ఇంటికి

వెల్లువంటి మనిషికి.. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు.. దాసోహం
మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు ..
చలువలోని చెలిమికి.. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం
దాసోహం దాసోహం దాసోహం

శుక్రవారం, జూన్ 20, 2014

మెరిసేటి పువ్వా...

అప్పటి వరకూ రెహ్మాన్ పాటలు ఉండే శైలికి పూర్తి విరుద్దంగా క్లాసిక్ టచ్ తో విడుదలైన ఆడియో 'నరసింహ' సినిమా ఆడియో. రహ్మాన్ రజనీకాంత్ ఫస్ట్ కాంబినేషన్ అంటూ క్రియేట్ చేసిన హైప్ కి తగినట్లు ఆడియో లేదని విని కాస్త నిరుత్సాహపడ్డాను కానీ పాటలు విన్నాక మాత్రం వీటికి అభిమానిని అయిపోయాను. ఈ సినిమాలో నాకిష్టమైన పాట ఇది. ఈ పాటలోని స్వర జతులను టైప్ చేసిచ్చి, అలాగే పాటకు తగినట్లుగా వివిధ నాట్య భంగిమల ఫోటోలతో అందమైన ప్రజెంటేషన్ తయారు చేసిన శాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ వీడియో ఇక్కడ ఎంబెడ్ చేశాను. సినిమాలోని ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

 

చిత్రం : నరసింహా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివగణేష్
గానం : శ్రీనివాస్, నిత్యశ్రీ, శ్రీరామ్

తకధిమి తకఝుణు తకధిమి తకఝుణు
తకధిమి తకఝుణు తకధిమి తకఝుణు
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా 
నాతోడురావా నా ఆశ భాష వినవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా 
నాతోడురావా నా ఆశ భాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా.. 
సఖియా సఖియా సఖియా...
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ

శృంగారవీర... శృంగారవీర
రణధీర నా ఆజ్ఞ తోటి నావెంటరార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా...
మదనా మదనా మదనా..
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా...

సఖీ..ఈఈ..ఏఏ...

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా రిర్రీరి సస్సాస నిన్నీని 
రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
గా.. రి స్సా నీ ద 
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా నీ స దామగనిస
నా పైట కొంగును మోయా 
నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నే తాగ మిగిలిన పాలు 
నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకె కదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా...ఆఆ....

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా 
నాతోడురావా నా ఆశ భాష వినవా 

వీరా..ఆఆఆ... వీరా..ఆఆఆఅ...  
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్ని తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు

శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి 
నా వెంటరార నా ఆశ ఘోష వినరా

తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా-
తధీంకిటక తోంగ..తధీంకిటక తోంగ.తధీకిటక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తాత్తకిట తాత్తకిట తోం..ధీం తకిట ధీం తకిట తోం..
ఆ.ఆ..ఆ.ఆ..ఆ..
తోంత తకిట తతక తకిట..తతక తకిట తతక తకిట..
తక్కిట తోంగ్..త క్కి ట..తోంగ్..తా క్కి ట..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తకధిద్ది త్తత్తోం..తరికిటధిద్దితత్తోం..తకధిద్దిత్తత్తోం..

తకధీం..తరికిటధీం..కిరకిటధీం..
తకధిద్ది త్తత్తోం..తరికిటధిద్దితత్తోం..తకధిద్దిత్తత్తోం..

తకధీం..తరికిటధీం..కిరకిటధీం..
తకధీం..తరికిటధీం..కిరికిటధీం..
తకధీం..తరికిటధీం..కిరికిటధీం..
తకధీం..తరికిటధీం..కిరికిటధీం..
తరికిటధీం..తరికిటధీం..తరికిటధీం..
తోంత తకిట..తరికిడతక..తరికిడతక..
తోంత తకిట..తరికిడతక..తరికిడతక..
తోంత తకిట..తరికిడతక..తరికిడతక..
తాకిటతక..తరికిడతక..తాకిటతక..తరికిడతక..
తాకిటతక..తరికిడతక..తాకిటతక..తరికిడతక..
తరికిటతక తోంగ..తరికిటతక తోంగ..
తరికిటతక తోంగ..తరికిటతక తోంగ..
తరికిడతక తరికిడతక తోంత..తరికిడతక తరికిడతక తోంత..

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తరికిడతక తరికిడతక తోంత..తరికిడతక తరికిడతక తోంత..
తోంగిడతక తరికిడతక..తోంగిడతక తరికిడతక..

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తోంగిడతక తరికిడతక..తోంగిడతక తరికిడతక..
తొంగిట తరికిడతోం..తొంగిట తరికిడతోం..
తొంగిట తరికిడతోం..తొంగిట తరికిడతోం..త..

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తోంగిట తరికిట..తోంగిట తరికిడతోం..
తోంగిట తరికిట..తోంగిట తరికిడతోం..
తోంగిట తరికిట..తోంగిట తరికిడ
తోంగిట తరికిడతోం..

గురువారం, జూన్ 19, 2014

నేనే నానీ నే...

ఈగ సినిమా కోసం కీరవాణి రాసి స్వరపరచిన ఒక అందమైన పాట ఇది. నాకు ఆడియోలో విన్నవెంటనే నచ్చేసిన పాట కానీ సినిమాలో ఒక్క చరణమే ఉపయోగించుకున్నారు. ఇదే సినిమాలోని "కొంచెము కొంచెము" పాటలోని క్లిప్పింగ్స్ తో ఎడిట్ చేసిన వీడియో క్లిప్ యూట్యూబ్ లో ఉంది అది ఇక్కడ ఎంబెడ్ చేస్తున్నాను.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఈగ (2012)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, జి.సాహితి

నేనే నాని నే, నే నీ నాని నే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
కళ్ళకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నానే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
మాటల్లొ ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా ఉలికించవా
కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ

కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె

నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవుననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా

కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె ఓ 


బుధవారం, జూన్ 18, 2014

గోరంత దీపం కొండంత వెలుగు..

జీవితంలో వచ్చే ఆటుపోటులను ఎలా ఎదుర్కోవాలో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించే ఈ చక్కని పాట సినారే గారు రాసినది. బాపు గారి అభిరుచికి అద్దం పట్టే ఈ పాటకి కె.వి.మహదేవన్ గారు స్వరపరచిన బాణి మృదువుగా సాగుతూ ఆ భావాలను మనసుకు హత్తుకునేలా చేస్తుంది. ఈ చక్కని పాటని మీరూ వినండి. ఈ పాట సినిమాలో టైటిల్స్ కి నేపధ్యగీతంగా వస్తుంది అది ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


 
చిత్రం : గోరంత దీపం (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, పి.సుశీల

గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..

కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
దహియించే బాధల మద్యన సహనమే వెలుగు!!
ఆహాఆఆఆఆ ఆఆఆఆఅ

గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..

కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి..
కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి..
నీళ్ళు లేని ఎడారిలో..ఓఓఓఓఓఓ
నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ్ళైనా తాగి బతకాలి..
నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ్ళైనా తాగి బతకాలి..
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
జగమంతా దగాచేసినా.. 
చిగురంత ఆశను చూడు..

చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు.. 


మంగళవారం, జూన్ 17, 2014

రెప్పలపై రెప్పలపై...

ఢమరుకం సినిమా కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన రామజోగయ్య శాస్త్రి రచన ఇది ఒక రిథమ్ లో సాగి ఆకట్టుకుంటుంది. ఈ పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఢమరుకం (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిహరన్ , చిత్ర

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
నెమ్మది నెమ్మదిగా ఝుంఝుం ఝుమ్మని తుమ్మెదగా
ముచ్చటగా ఓ మూడో ముద్దుకు చోటిమ్మంటున్నా
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా
తీయని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా


రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
 
జరిగి జరిగి దరికి జరిగి కలికి విరహాలు కరగని
కరిగి కరిగి కలలు మరిగి తగిన మర్యాద జరగని
సొంపుల రంపంతో నాపై చప్పున దూకావే
చుక్కల రెక్కల సీతాకొకై నొరూరించావే
పువ్వుల ప్రాయంలొ గుప్పున నిప్పులు పోసావే
నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా

హా..చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో
ఓ పులకరింతే మరొక వింతై అణువు అణువంత రగిలిపో
గోపురమే నువ్వు నీపై పావురమై నేను
గుప్పెడు గుండెల ప్రాంగణమంత నాదని అంటాలె
గోపికవే నువ్వు నాలో కోరికవే నువ్వు
నీ పున్నమి వెన్నెలనేలే పురుషుడు నేనేలే

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా


సోమవారం, జూన్ 16, 2014

నీ ఎదుట నేను...

అందాల చందమామ అని అందరూ ఎంతగా పొగుడుతారో విరహంలో వేగే జంటలు అంతే ఇదిగా నిందిస్తారా జాబిల్లిని. ఈ అమ్మాయిని చూడండి కొత్తగా పెళ్ళై దూరదేశంలో ఉన్న భర్తను తలుచుకుంటూ జాబిల్లిని వయసుకు వైరివని ఎలా నిందిస్తూందో. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఇద్దరి ఎదుట నువ్వు ఎప్పుడుంటావు అంటూ సాగే పల్లవి నాకు చాలా ఇష్టం విరహ గీతానికి ఇంత చక్కని పల్లవిని మనసు కవి గారు తప్ప ఇంకెవరు రాయగలరు. అలాగే జాబిల్లిని గురించి సాగే చివరి చరణం కూడా నాకు ఇష్టం, మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : తేనె మనసులు (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి.సుశీల

చందమామా ..అందాలమామా..
నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూసా
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూసా
వల్లమాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా
కన్నులుపోక
మగసిరి ఎడదని చూసాను
మగసిరి ఎడదని చూసాను
తలదాచుకొనుటకది చాలన్నాను... 

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
 
పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి
చదువేమి ప్రేమిస్తావా వయసెంత
పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి
నీ చదువేమి నను ప్రేమిస్తావా వయసెంత
అని అడిగారా.. అసలొచ్చారా..
నాలో వారు ఏం చూసారో నావారయ్యారు
నాలో వారు ఏం చూసారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా.. 

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
ఆ వెన్నెలలోని వేడి గాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను.. 

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
చందమామా ..అందాల మామా...


ఆదివారం, జూన్ 15, 2014

సోషల్ నెట్వర్కండి బాబు..

ఆధునిక ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న సోషల్ నెట్వర్కింగ్ గురించిన వాస్తవాలను చెప్తూ కొత్త సినిమా "లేడీస్ & జెంటిల్మెన్" కోసం సిద్దం చేసిన ఓ సరదా అయిన బుర్రకథ ఇది... మీరూ ఆలకించండి. రఘుకుంచే సంగీత గాత్రాలతో ఆకట్టుకుంటే సిరాశ్రీ సాహిత్యం వాస్తవాలను ప్రతిబింభిస్తూ చాలా చక్కగా ఉంది. ఈ సినిమా ఇంకా విడుదలవలేదు ఈ పాట సినిమా ప్రమోషన్ కోసం రూపొందించినది. పూర్తి వీడియో ఈ ఎంబెడ్ లింక్ లో చూడవచ్చు. ఆడియో రిలీజవలేదు కనుక లింక్స్ లేవు.   చిత్రం : లేడీస్ & జెంటిల్మెన్ 
సంగీతం : రఘుకుంచే
సాహిత్యం : సిరాశ్రీ
గానం : రఘుకుంచే, బృందం

వినరా సోదర వీరకుమారా ఇంటర్నెట్టు గాథా.. 
తందాన తానా 
కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా.. 
తందాన తానా.. తరికిట ఝుంతరి తా..

అసలీ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే.. 
పావురాలతో కబురుపంపే కాలం దాటిపోయే..
తందాన తానా 
ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే.. 
తందాన తానా 
టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే... 
తందాన తానా
ఎస్టీడీ బూతులు కాయిను బాక్సులు కనుమరుగైపోయే 
తందాన తానా... తరికిట ఝుంతరి తా..

మరి ఇలాగైతే ఎలాగా ?
మనిషికి మనిషికి మధ్య సంబంధాలు తెగిపోవా.. 
మనసుకీ మనసుకీ మధ్య దూరం పెరిగిపోదా.. 

ఆ ముచ్చటా చెప్తాను వినవయ్యా.. 
సెల్ ఫోను చేతికొచ్చే.. భళి భళి 
సొల్లు ఊసులెన్నొ తెచ్చే.. భళి భళి 
మనిషి ఉన్న లోకం విడిచే.. హరి హరి 
కొత్తలోకంలోకి నడిచే.. హరి హరి
చుట్టూ ఉన్నవాటినన్ని వదిలి పెట్టి 
ఇంటర్నెట్టు లోకి నెట్టుకు పోయే... 

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 
సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి  

ఫేసు బుక్కంటారు.. ట్విట్టరూ అంటారు.. 
వాట్సాపు అంటారు.. బిబిఎం అంటారు.. 
డ్రాప్ బాక్సు అంటారు.. జిడ్డూ అంటారు.. 
స్కైపులు అంటారు.. వైబరు అంటారు..
బాతు రూముల్లో బెడ్డు రూముల్లో 
ఆఫీసు రూముల్లో క్లాసు రూముల్లో.. 

ఎస్సెమ్మెస్ ఫ్లర్టింగూ.. హరి హరి.. 
పగలు రాత్రి ఛాటింగూ.. హరి హరి..  

సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 
సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

ఇదంతా చెప్పావ్ బానే ఉందయ్యా.. వీటన్నిటి వల్ల ఉపయోగమేంటో ముందది చెప్పూ.... 

యాపిలంటే తినే పండేమి కాదు.. 
అరచేతిలోని చేస్తాది జాదూ.. ఓర్దీని తస్సాదియ్యా.. 
పంచె గట్టే ఓడు పెద్దరాయిడూ.. 
ప్రెపంచాన్నేలేది ఆండ్రాయిడూ.. 
హహహ భలే భలే.. 
సోషల్ నెట్వర్కూ చేతిలో ఉంటే 
ఎవడి డప్పు వాడే తందాన తానా..  ఆహా..ఆ
పెట్టిన పోస్టుకు లైకు రాకపోతే 
పరువు బోయినట్టు ఫీలవుతారన్నా.. 
జుట్టు ఊడినా..ఆఆఆ...
జుట్టు ఊడినా జబ్బు చేసినా..
గూగుల్ డాట్ కామ్ ఏ కొడుతున్నారన్నా..

ఇంటర్నెట్టు లోకమండీ.. భళి భళి 
ఇంటర్నెట్టు లోకమండీ.. భళి భళి 

మరింకేమయ్యా.. దీనివల్ల ప్రపంచమంతా మన కాళ్ళదగ్గరకొచ్చేసి మహా సౌకర్యంగా ఉంది కదా.. 
ఆఆఅ.. సౌకర్యంతో పాటు కూసింత కామెడీ కూడా ఉందయ్యా... 

చావుకబురైనా సినిమా కబురైనా పోటీలు పడుతూ అప్డేటులన్నా.. 
రిప్ లూ సినిమా రివ్యూలూనా.. 
వంటగదిలో చేసె ముచ్చట్లు అన్నీ పోస్టులు పెట్టి చంపుతారన్నా.. 
కాఫీలు పెట్టడం ఉప్మాలు చేయడం లాంటివా.. 
వెబ్ సైటుల్లో గాసిప్పులు చూసీ పన్లుమానేసి పంచాయితీలన్నా.. 
పెళ్ళిళ్ళూ అయినా పెటాకులైనా ఆన్ లైను లోనే అవుతున్నాయన్నా.. 
మరి సంసారం??.. 
దూరమున్నోళ్ళూ...ఓఓఓఓఓ..
దూరమున్నోళ్ళూ దగ్గరవుతున్నారు.. 
దగ్గరున్నోళ్ళూ దూరమవుతున్నారు.. 
 
సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 
సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 
సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 
సోషల్ నెట్వర్కండీ బాబు.. భళి భళి 

ఐతే ఇంటర్నెట్టు వల్ల మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారనమాట.. 
అదేగదయ్యా.. ఎక్కడికెళ్తున్నారో తెలియక ఎటో వెళ్ళిపోతున్నారు..
తరికిట ఝుంతరి తా..


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.