శుక్రవారం, జూన్ 13, 2014

నువ్వు నువ్వు...

సిరివెన్నెల గారి సాహిత్యానికీ, దేవీశ్రీ సంగీతానికీ, కృష్ణవంశీ చిత్రీకరణ తోడైతే ప్రేమికుల మనసును వింత లోకాలలో విహరింప చేస్తుంది కదా మరి... ఇష్టమైన అబ్బాయి మీద ఇష్టాన్ని మరింత ఇష్టంగా వ్యక్తీకరించే ఈ పాట వచ్చి అప్పుడే పన్నెండేళ్ళైనా ఇంకా కొత్తగానే ఉంటుంది. మీరూ ఆస్వాదించండి. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఖడ్గం (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సుమంగళి

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ

నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతినిమిషం నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా వయసుని వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బయట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వూ
మెత్తని ముళ్ళే గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకొనే కోరికవే నువ్వు
మునిపంటి తో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వూ
తియ్యని గాయం చేసే అన్యాయం నువ్వు
ఐనా ఇష్టం నువ్వు నువ్వూ ఊ నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరుజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వూ ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వూ నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వూ


3 comments:

ఖడ్గం లాంటి సీరియస్ మూవీ లో మనసుని మెత్తగా హత్తుకుపోయే మల్లె పూవంటి ఈ పాట..కనురెప్పలలో మెరిసే కలలనీ, కంటి ముందు నిజాలనీ సమానం గా ప్రేమించే భావకుడేమె కృష్ణవంశీ అనిపిస్తుంటుందండీ..

కృష్ణవంశీ గారి గురించి ఒక్క లైన్ లో బాగా చెప్పారండీ.. కాకపోతే ఈ మధ్య తీసే సినిమాలతోనే కాస్త భయపెడుతున్నారాయన :-)

శాచ్యురేషన్ పాయింట్ యే డైరెక్టర్ కేనా తప్పదేమోనండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.