మంగళవారం, జూన్ 03, 2014

గాలికదుపు లేదు...

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇదికథకాదు సినిమా కోసం ఎం.ఎస్.విశ్వనాథన్ గారి సంగీతంలో వచ్చిన ఆత్రేయ గారి పాట ఇది చాలా బాగుంటుంది. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు, క్వాలిటీ సరిగా లేనందున ఇక్కడ ఎంబెడ్ చేయలేక పోతున్నాను. కింద ఎంబెడ్ చేసినది ఆడియో మాత్రమే. యూట్యూబ్ పని చేయని వాళ్ళు ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఇది కథ కాదు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 
గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

సారీసా సరిసరిసరిగ రీసాగ
సారీసా సరిసరిసరిగ రీసాగ
సారీసా సరిసరిసరిగ రీసాగ
సారీసా సరిసరిసరిగ రీసాగ

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ
ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పూవు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


2 comments:

కొడుకు శాడిస్ట్ అని తెలిసిన ఓ తల్లి కోడలి ఇంట్లో పనిమనిషి గా చేరి ఆమెని కంటికి రెప్ప లా చూసుకోవడం..గుడి కోనేరులో స్నానం చెయ్యమని కోడలి మెడలో తాళి తనే తీసేసి భగవత్ నిర్ణయంగా చూపడం..ఆమెని వేరే పెళ్ళి చేసుకొమ్మని ప్రోత్సహించడం..అసలు ఇటువంటి సీన్స్ కన్సీవ్ చేయాలన్నా, ఆ సీన్స్ ని కన్విన్సింగ్ గా హృదయానికి హత్తుకునేలా చూపాలన్నా..ద వన్ ఎండ్ ఓన్లీ బాలచందర్ గారికే సాధ్యం. దానికి రిలేటెడ్ గా ఈ పాటలో 'గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమదనైతె తప్పేముంది" అని రాసిన ఆత్రేయ గారికి హేట్సాఫ్.

నిజమండీ శాంతి గారు.. బాలచందర్ గారి గురించి చాలా బాగా చెప్పారు.. అలాగే సినిమా గురించి కూడా భలే గుర్తుచేశారు. ఆత్రేయ గారి లైన్స్ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే... థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.