సత్యం గారి స్వరకల్పనలో ఆరుద్ర గారు రాసిన ఓ కమ్మని పాట. రేడియో నాకు పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. పాట మధ్యలో 'సుజా' అన్న పిలుపు విన్నపుడు నవ్వుకునే వాళ్ళం చాలా ఫీలై పిలుస్తున్నారు బాలు గారు అని :-) అప్పట్లో ఇయర్ ఫోన్స్ లేవు కనుక పాటలన్నీ పైకే పెద్దగా వినాల్సొచ్చేది, సో శ్రద్దగా రేడియో దగ్గరపెట్టుకుని వింటూన్నపుడు ఈపాట వచ్చే టైమ్ లో పక్కన పెద్దవాళ్ళుంటే మొహమాటానికైనా సరే స్టేషన్ మార్చేయాల్సి వచ్చేది. అదే అలమారలో దాని మానాన అది మోగుతున్నపుడు మాత్రం సైలెంట్ గా వినేసేవాడ్ని. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలూ
కురిపించెను ప్రేమలేఖలూ
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
మది వెన్నెల కన్నా హాయి
ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...
సుజా...
నడిరాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీ వలపు
నా ఒడిలో వాలును నీ వలపు
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
మది వెన్నెల కన్నా హాయి
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు
కనువిందులు చేసే శిల్పాలు
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
మది వెన్నెల కన్నా హాయి
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు
కలకాలం నిలిచే కావ్యాలు
కలకాలం నిలిచే కావ్యాలు
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు..ఊఊ..
కురిపించెను ప్రేమలేఖలు..ఊఊ..
ప్రేమలేఖలు..
ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
మది వెన్నెల కన్నా హాయి
2 comments:
ఈ పాట యెప్పుడు విన్నా మనసు మల్లెల తీరం చేరుకుంటుంది..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.