గిటార్ తో ఇళయరాజా చేసిన మ్యాజిక్ చూడాలంటే ఈ పాట వినాల్సిందే... తెలుగులో కన్నా తమిళంలో (ఇళయ నిలా) ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఈ పాటలోని గిటార్ ఇంటర్ల్యూడ్స్ చాలా మంది కుర్రకారుని గిటార్ నేర్చుకునేందుకు ప్రోత్సహించి ఉంటాయి ఆ రోజుల్లో. ఈ పాట ప్రేరణతోనే హిందీలో "నీలెనీలె అంబర్ పర్ " పాట కూడా కంపోజ్ చేశారు.
ఇప్పటికీ ఈ చక్కని మెలోడీ వింటూంటే మనసును ఊయలలూపేస్తుంది. నాకు ఈ పాట ఎంత ఇష్టమంటే ఎప్పుడు ఏ భాషలో వినిపించినా పూర్తిగా విని కానీ ముందుకు కదలలేను. ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఇప్పటికీ ఈ చక్కని మెలోడీ వింటూంటే మనసును ఊయలలూపేస్తుంది. నాకు ఈ పాట ఎంత ఇష్టమంటే ఎప్పుడు ఏ భాషలో వినిపించినా పూర్తిగా విని కానీ ముందుకు కదలలేను. ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అమరగీతం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
నెలరాజా పరుగిడకు
చెలివేచే నాకొరకు
ఒక్కమారు పోయి
చెలినిగాంచుమా
నివేదించుమా విరహమే
నెలరాజా పరుగిడకు
చెలివేచే నాకొరకు
ఒక్కమారు పోయి
చెలినిగాంచుమా
నివేదించుమా విరహమే
నెలరాజా పరుగిడకు
చెలివేచే నాకొరకు
మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి పరువం
మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి పరువం
వాడిపోనిదీ వనిత యవ్వనం
ఆడిపాడితే కనుల నందనం
అణువణువు విరిసేలే లావణ్యం
నెలరాజా పరుగిడకు
ఒక్కమారు పోయి
చెలినిగాంచుమా
నివేదించుమా విరహమే
నెలరాజా పరుగిడకు
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము
మురిపెంగా తమ రాకా నా చెలితో తెలిపేనూ
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము
మురిపెంగా తమ రాకా నా చెలితో తెలిపేనూ
కొండవాగులా మల్లెతీగలా
పులకరించినా సన్నజాజిలా
విరహిణిలా వేచేను జవరాలే
నెలరాజా పరుగిడకు
చెలివేచే నాకొరకు
ఒక్కమారు పోయి
చెలినిగాంచుమా
నివేదించుమా విరహమే
నెలరాజా పరుగిడకు
2 comments:
మెలొడీ పరంగా రెండు సాంగ్స్ చలా బావున్నా, పర్సనల్ గా నాకు "నీలె నీల్ అంబర్ పర్" పాట చాలా ఇష్టం వేణూజీ..
థాంక్స్ శాంతి గారు నాకు తమిళ్/తెలుగు వర్షన్సే ఎక్కువిష్టం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.