ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగా ఉన్న రోజుల్లో తన సినిమాకోసం మంచి మంచి పాటలు ఎన్నుకునేవాడు. అదే టాలెంట్ తో తను స్వయంగా స్వరపరచిన ఉగాది సినిమాలో కూడా కొన్ని పాటలు బాగానే ఉంటాయి. వాటిలో ఈ పాట హుషారుగా చక్కగా సాగిపోతుంది. మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఉగాది (1997)
సంగీతం : ఎస్వీ. కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఉన్నికృష్ణన్ , బృందం
ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
ఇవ్వాళే చూశా నిన్ను బాగున్నావా
వెన్నెల గువ్వా...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ
నడపమందువా
కాచుకుంది పూవుల తోవ
చూపిస్తా నాతో రావా
ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వేచి ఉంది నవ్వుల నావ
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కళ్లు మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో
వాటి వెంట పోతూ రోజూ చూస్తానే నీ కోట
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కళ్లు తెరుచుకోగానే దారి మరిచిపోతానే
కోటి చుక్కలన్నిటి మధ్య నీకోసం చూస్తుంటా
కరిగేటి కలవో నిజంగానే కలవో
అనుమానం తీర్చేయాలని కళ్లారా కనిపించేవా
ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ ...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ
ఊసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో
పాడుకుంటు ఉంటే నువ్వా రాగాలే విన్నావా
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
చుక్కలూరి వీధుల్లో ఒక్కదానివై ఉంటే
తోచుబాటు ఏమీ లేక ఈ వైపు వాలేవా
నువు రాక మునుపే నీ రూపు తెలుసే
ఎలాగంటే నాకేం తెలుసు
నా మనస్సుకి కబురంపేవా
ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ ...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ
2 comments:
నవరసాల్లో నవ్వు రసాన్ని మాత్రమే సంపూర్ణం గా అర్ధం చేసుకున్న లైలా కి తగ్గ పాట..
హహహహ బహుశా ఎవరో ఈవిడ్ని తెగపొగిడేసుంటారండీ ఆ నవ్వుగురించి అందుకే ఆ ఒక్కదానిమీదే ఫోకస్ చేసినట్టున్నారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.