బసవపున్నమ్మగా భానుమతమ్మ గారు అంత పెద్ద వయసులో కూడా తన నటనా విశ్వరూపం చూపించిన సినిమా పెద్దరికం. ఇందులోనే పరశురామయ్య పాత్ర పోషించిన పిళ్ళై గారి నటన కూడా చాలా బాగుంటుంది ఇద్దరికిద్దరూ సమఉజ్జీలుగా నటించారు. ఈ సినిమాలో కథా, కామెడీ, పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఇందులోనిదే ఓ మంచి మెలోడీ ఈ పాట, మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
రచన : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. ఓఓ తరలిరా
నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా !
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో !
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే !
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
2 comments:
భానుమతి గారికి వీర అభిమానినైనా ఈ మూవీలో నా ఫుల్ సపోర్ట్ పిళ్ళై గారికే వేణూజీ..
కరెక్టేనండి పిళ్ళైగారి నటన కూడా చాలా బాగుంటుంది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.