ఆదివారం, జూన్ 01, 2014

మేఘాలలో తేలి పొమ్మన్నది...

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మొదటి చిత్రం 'గులాబి' సినిమా కోసం శశిప్రీతమ్ సంగీతం సమకూర్చిన ఈ పాట అప్పట్లో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిందనే చెప్పచ్చేమో. బైక్ పై ఇదివరకు కూడా ఒకటీ అరా పాటలు ఉన్నా ఈ పాట బాగా గుర్తుండిపోతుంది, ముఖ్యంగా పాటంతానూ చివర్లోనూ వచ్చే థంపింగ్ హార్ట్ బీట్ చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గులాబి (1995)
సంగీతం : శశిప్రీతమ్
రచన : సిరివెన్నెల
గానం : మనో, గాయత్రి

మేఘాలలో తేలి పొమ్మన్నది
తుఫానులా రేగి పొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ


బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ 

 
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తువుంటే స్వాగతాల సంగీతాలు
ఆడదా నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని

ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి
మారద వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
 

ఓం నమః వచ్చిపడు ఊహలకు
ఓం నమః కళ్ళువీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికి


నచ్చినట్టే ఉంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటు చిందె ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనమే ఎటుపోతుంది

కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగ బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది

నీ తరహా కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది


బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది
హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది
ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ
బీట్ ఇన్ మై హార్ట్... బీట్ ఇన్ మై హార్ట్... ఓ మై గాడ్...


2 comments:

ఇదే మూవీ లోని క్లాస్ రూంలొ తపస్సు చేయుట పోస్ట్ చేయగలరా..అది నాకు చాలా ఇష్టమైన పాట..ముఖ్యం గా ఆ పాట మొదటిలో వచ్చే ఆలాప్..

అలాగే శాంతి గారు తప్పకుండా పోస్ట్ చేస్తాను :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.