సోమవారం, జూన్ 16, 2014

నీ ఎదుట నేను...

అందాల చందమామ అని అందరూ ఎంతగా పొగుడుతారో విరహంలో వేగే జంటలు అంతే ఇదిగా నిందిస్తారా జాబిల్లిని. ఈ అమ్మాయిని చూడండి కొత్తగా పెళ్ళై దూరదేశంలో ఉన్న భర్తను తలుచుకుంటూ జాబిల్లిని వయసుకు వైరివని ఎలా నిందిస్తూందో. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఇద్దరి ఎదుట నువ్వు ఎప్పుడుంటావు అంటూ సాగే పల్లవి నాకు చాలా ఇష్టం విరహ గీతానికి ఇంత చక్కని పల్లవిని మనసు కవి గారు తప్ప ఇంకెవరు రాయగలరు. అలాగే జాబిల్లిని గురించి సాగే చివరి చరణం కూడా నాకు ఇష్టం, మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : తేనె మనసులు (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి.సుశీల

చందమామా ..అందాలమామా..
నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూసా
పెళ్ళిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ చూసా
వల్లమాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా
కన్నులుపోక
మగసిరి ఎడదని చూసాను
మగసిరి ఎడదని చూసాను
తలదాచుకొనుటకది చాలన్నాను... 

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
 
పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి
చదువేమి ప్రేమిస్తావా వయసెంత
పెళ్ళిచూపులలో బిగుసుకొని పేరేమి
నీ చదువేమి నను ప్రేమిస్తావా వయసెంత
అని అడిగారా.. అసలొచ్చారా..
నాలో వారు ఏం చూసారో నావారయ్యారు
నాలో వారు ఏం చూసారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా.. 

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు

చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
చల్లని వెన్నెల దొరవంటారు
తీయని నవ్వుల సిరి వంటారు
ఆ వెన్నెలలోని వేడి గాడ్పులు
నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను.. 

నీ ఎదుట నేను
వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
చందమామా ..అందాల మామా...


3 comments:

Promote your Website or Blog for free and increase traffic to your site at http://forum.telugushortfilmz.com/

దూర దూరం గా వున్న ఇద్దరం జంటగా నిన్ను చూసెదెన్నడో అని చందమామతో తన విరహాన్ని పంచుకుంటున్న అమ్మాయి..యెంత అందమైన భావన..అందుకేనేమో ఆయన మనసుకవి అయ్యారు..

అలాగే విజేందర్ గారూ.. థాంక్స్..

థాంక్స్ శాంతి గారు.. కరెక్ట్ అండీ చాలా చక్కగారాశారు ఆత్రేయ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.