ఆదివారం, జూన్ 08, 2014

పువ్వూ నవ్వే గువ్వానవ్వే...

కీరవాణి స్వరపరచిన సినారె రచన విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఇలా కనులకింపుగా రూపుదిద్దుకుంది... ఈ సినిమాలో మీనాక్షీ శేషాద్రి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం. ఈ చక్కని పాటని మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా ఇక్కడ వినవచ్చు.



చిత్రం : ఆపద్బాంధవుడు (1992)
సంగీతం : ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం : సినారె
గానం : బాలు, చిత్ర, కోరస్

పువ్వూ నవ్వే..అఆ.. గువ్వానవ్వే..అఆ
పువ్వూ నవ్వే గువ్వానవ్వే 
మువ్వనవ్వే గవ్వా నవ్వే
రవ్వల బొమ్మ నవ్వదేమే...అఆ..

మానూ నవ్వే మబ్బూ నవ్వే
మాటా నవ్వే మనసూ నవ్వే
మాలచ్చిమీ నవ్వదేమే...
ఆరారారరా...అరారారారార...

చిలుకకు చీరే కడితే హైలెస్సో...
మొలకకు చిగురే పుడితే హైలెస్సో...
అది ఎవరెవరెవమ్మా.. ఇదిగిదిగోమ్మా..
అది ఎవరెవరెవమ్మా.. ఇదిగిదిగోమ్మా..
పువ్వు గువ్వా సువ్వీ అంటే 
మానూ మబ్బూ రివ్వూ మంటే 
రవ్వలబొమ్మా నవ్వాలమ్మా 
రాచనిమ్మా నవ్వాలమ్మా
అరారరరరరరరా..

హైలెస్సో హైలెస్సో..
హైలెస్సో హైలెస్సో..

కోయిలాలో.. కూయవేమే..
కొండగాలో.. వీచవేమే.. 
అరారరరరరరా... 
కుహూ కుహూ తప్ప కోయిలమ్మకేం తెలుసు.. అ.ఆ..
ఓహోం.. ఓహోం తప్ప కొండగాలికేం తెలుసు.. అ.ఆ..
గజ్జకట్టుకోకున్నా ఘల్లు ఘల్లు మంటుంది ఏం అడుగు.. 
నువ్వే అడుగు.. 
ఎవరిదా అడుగు.. నాకేం తెలుసు.. 
ఎవరిదా అడుగు.. నాకేం తెలుసు.. 
పోనీ.. 
గొంతు దాటిరాకున్నా గుండె ఊసు చెబుతుందీ.. 
ఏ పలుకు.. అమ్మా పలుకు.. 
నీ పలుకు.. ఊహు నీ పలుకు.. 
ఊహు నీఈఈ పలుకు.. 

కామాక్షమ్మ కరుణించిందో మీనాక్షమ్మ వరమిచ్చిందో 
రవ్వలబొమ్మ నవ్విందమ్మా రాచనిమ్మ నవ్విందమ్మా 
ఆరరరరరరరరరా...

హోయ్..హోయ్..హోయ్..హోయ్.. ఆఆఆఅ...
నవ్వులేమో దివ్వెలాయే... నడకలేమో మువ్వలాయే... 
ఆరారారారారారాఅ... 
ఆలమందలు కాసిన వాడేనా.. అ.ఆ..
పాలబిందెలు మోసినవాడేనా.. అ.ఆ..
ఏమి కవితలల్లాడమ్మా.. ఎన్ని కళలు నేర్చాడమ్మా.. 
ఏమి కవితలల్లాడమ్మా.. ఎన్ని కళలు నేర్చాడమ్మా.. 
కనులముందు నీవుంటే కవిత పొంగి పారిందమ్మా.. 
మాటా నీదే పాటా నీదే మనసూరించే ఆటా నీదే.. 
పున్నమిరెమ్మా పుట్టినరోజు వెన్నెల చిందూ నాదే నాదే 

ఆరారారారారాఅ... 
ఆఆ..ఆఆఆఆఆ..అ.ఆ.. రారారారారారా.అ.ఆ..
ఓహోహో..ఓఓఓఓ...అ.ఆ 

చిలుకకు చీరే కడితే..

4 comments:

Nice Post, Plz read my stories @ http://sadikaamar.blogspot.in/ , if you like it please share in your circle.

అలాగే sadika గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

మరో మూగ మనసులు..ఈ మూవిలో అన్ని పాటలూ చాలా, చాలా బావుంటాయి వేణూజీ..

థాంక్స్ శాంతి గారు.. అవునండీ ఒన్ ఆఫ్ ది బెస్ట్ కంపొజిషన్స్ ఆఫ్ కీరవాణి గారు.. ఇందులోదే ఔరా అమ్మకచెల్లా పాట మరింత బాగుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.