గురువారం, జూన్ 19, 2014

నేనే నానీ నే...

ఈగ సినిమా కోసం కీరవాణి రాసి స్వరపరచిన ఒక అందమైన పాట ఇది. నాకు ఆడియోలో విన్నవెంటనే నచ్చేసిన పాట కానీ సినిమాలో ఒక్క చరణమే ఉపయోగించుకున్నారు. ఇదే సినిమాలోని "కొంచెము కొంచెము" పాటలోని క్లిప్పింగ్స్ తో ఎడిట్ చేసిన వీడియో క్లిప్ యూట్యూబ్ లో ఉంది అది ఇక్కడ ఎంబెడ్ చేస్తున్నాను.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఈగ (2012)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, జి.సాహితి

నేనే నాని నే, నే నీ నాని నే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
కళ్ళకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నానే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
మాటల్లొ ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా ఉలికించవా
కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ

కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె

నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవుననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా

కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె ఓ 


2 comments:

ఇలాంటి మూవీ తీసి ఒప్పించాలంటే కేవలం రాజమౌళి కే సాధ్యమేమో కదా వేణూజీ..

నిస్సందేహంగా శాంతి గారు.. ఇలాంటి ప్రయోగాలు చేసే సత్తా ఉన్న వ్యక్తి కనుక ఇలాంటివే చేస్తుంటే బాగుంటుంది నా అభిప్రాయం కూడా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.