ఢమరుకం సినిమా కోసం దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన రామజోగయ్య శాస్త్రి రచన ఇది ఒక రిథమ్ లో సాగి ఆకట్టుకుంటుంది. ఈ పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఢమరుకం (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిహరన్ , చిత్ర
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
నెమ్మది నెమ్మదిగా ఝుంఝుం ఝుమ్మని తుమ్మెదగా
ముచ్చటగా ఓ మూడో ముద్దుకు చోటిమ్మంటున్నా
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా
తీయని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా
ముచ్చటగా ఓ మూడో ముద్దుకు చోటిమ్మంటున్నా
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా
తీయని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
జరిగి జరిగి దరికి జరిగి కలికి విరహాలు కరగని
కరిగి కరిగి కలలు మరిగి తగిన మర్యాద జరగని
సొంపుల రంపంతో నాపై చప్పున దూకావే
చుక్కల రెక్కల సీతాకొకై నొరూరించావే
పువ్వుల ప్రాయంలొ గుప్పున నిప్పులు పోసావే
నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
హా..చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో
ఓ పులకరింతే మరొక వింతై అణువు అణువంత రగిలిపో
గోపురమే నువ్వు నీపై పావురమై నేను
గుప్పెడు గుండెల ప్రాంగణమంత నాదని అంటాలె
గోపికవే నువ్వు నాలో కోరికవే నువ్వు
నీ పున్నమి వెన్నెలనేలే పురుషుడు నేనేలే
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై
మరో ముద్దిమ్మంటూ వద్దకు వస్తున్నా
2 comments:
మెలోడీయస్ టంగ్ ట్విస్టర్ లా వుందీ పాట వేణూజీ..
థాంక్స్ శాంతి గారు.. హహహ టంగ్ ట్విస్టరా :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.