సోమవారం, మార్చి 31, 2014

కొమ్మలో ఒక కోయిల కూసిందీ..

అచ్చంగా జీవితం మనకి చూపించే రకరకాల రుచులకు మల్లే తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు, వగరు ఇత్యాది రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చళ్ళు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే నేటి రోజున నా బ్లాగ్ మిత్రులందరికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా కోటి గారి స్వర సారధ్యంలో వనమాలి గారి రచన "కొమ్మలో ఒక కోయిల కూసిందీ" పాట చూసి విని ఆనందిద్దామా. ఆడియో మాత్రమే వినాలనుకున్న వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : కౌసల్య సుప్రజ రామ (2008)
సంగీతం : కోటి
సాహిత్యం : వనమాలి
గానం : మధుబాలకృష్ణన్, సునీత 

శ్రీశ్రీశ్రీ సర్వధారి నామ సంవత్సరం సుందరం సుమధురం
పంచుకుందాం ఈ సంబరం అందరం మనమందరం

కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది. 
 
కొమ్మలో ఒక కోయిల కూసిందీ
గుండెలో చిరు ఆశలు రేపిందీ
అనురాగమె దానికి పల్లవిగా
అనుబంధమె వీడని చరణంలా
మధుమాసమె అందరి మనసులు మీటెనులే..

ఉగాది ఉగాది ఉగాది ఉగాది 
మనసైన మాటొకటె బహుతీపిగా 
ఎడబాటు ఎదురైతే అది చేదుగా 
ఎదలోని పులకింతె ఆ పులుపుగా 
అనలేని  భావాలె ఈ వగరుగా 
చుర చుర చూపుల మంటలు చల్లితే కారమయే కళ ఇదికాదా 
బ్రతుకున కమ్మని రుచులను చేర్చగ లవణమనే సాయం లేదా
అభిరుచులను కలిపిన బ్రతుకే పండుగలే..

కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది. 
 
కొమ్మలో ఒక కోయిల కూసిందీ
గుండెలో చిరు ఆశలు రేపిందీ..ఈఈఈ..

ధిరన ధిరన ధిరన ధిరన ధిరనన
ధిరన ధిరన ధిరన ధిరన ధిరనన 
తతోంత ధిరనన తోం తధిరన  
తతోంత ధిరనన తోం  
ధిరన ధిరన ధిరన ధిరన ధిరనన 
తతోంత ధిరనన తోం తధిరన  
తతోంత ధిరనన తోం  

పంచాంగ శ్రవణాలు వినిపించనా
ఈ పచ్చడే నీకు తినిపించనా 
ఆ రాశి ఫలితాలు అందించనా 
ఏం రాసినా మన కథ మారునా 
మమతలు నిండిన చల్లని కోవెల మనసులనే జతగా కలిపే 
వెనుకటి జన్మల తీరని ఋణమో చివరికిలా మీతో నిలిపే 
ఏ సిరులకు దొరకని చెలిమే చాలునులే..  హా..

కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది.  
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది.

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఉగాది ప్రాసస్త్యాన్ని వివరిస్తూ చక్కని వ్యాఖ్యానంతో తెలుగువన్ వారు రూపొందించిన ఈ వీడియోని ఈ సంధర్బంగా మీ ఇంట్లోని పిల్లలకి ఒక సారి చూపించండి. 

ఆదివారం, మార్చి 30, 2014

దీవాలీ దీపాన్ని..

మడిసన్నాక కూసింత కలాపోషణ ఉండాలన్నారుకదా అని ఎప్పుడూ కళాపోషణే చేస్తే బోరుకొట్టదూ... అందుకే ఈ బ్లాగులో తరచూ కనిపించే మెలొడీల మధ్యలో అపుడపుడూ ఇలాంటి కాస్త హుషారున్న పాటలు కూడా అనమాట :-) దేవీశ్రీ సంగీతానికి రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట నాకు పెప్పీ మూడ్ లో ఉన్నపుడు వినడం ఇష్టం మీరూ ఆస్వాదించండి.ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు ఆడియో ఇక్కడ వినవచ్చు.చిత్రం : దడ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఆండ్రియా, కళ్యాణ్

చక్కెర చిన్నోడ.. ఆలే
కత్తెర కళ్లోడా.. ఆలే
చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని
ఒంటరి పిల్లోడ.. ఆలే
తుంటరి పిల్లోడా.. ఆలే
వద్దకు లాగెయ్‌రా.. ఆలే.. వజ్రాన్ని

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

చక్కెర చిన్నోడ.. ఆలే
కత్తెర కళ్లోడా.. ఆలే
చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని

ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని
నెత్తురు లోతుకు
హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని
అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు
రాసిన గ్రంథాన్ని

చక్కెర చిన్నోడ.. ఆలే
కత్తెర కళ్లోడా.. ఆలే
చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీపక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఓ.. నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయికా
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఉప్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం 

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

శనివారం, మార్చి 29, 2014

నీవే అమర స్వరమే...

ఇళయరాజా గారి మరో ఆణిముత్యం, ఒకప్పుడు డబ్బింగ్ పాటలకు సైతం రాజశ్రీ గారు ఎంత చక్కని లిరిక్స్ రాసేవారో తెలియాలంటే ఈ పాట ఒక మంచి ఉదాహరణ. అప్పట్లో ఈ పాట చిత్రీకరణ మణిరత్నం చేసిన మరో సాహసం అని చెప్పచ్చేమో. నాకు చాలా ఇష్టమైన పాట తరచుగా వినేపాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఘర్షణ(1988)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర 

నీవే అమరస్వరమే..  సాగే.. శ్రుతిని నేనే..
నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శ్రుతిని నేనే

పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
మల్లె పూల బంధమీవు ఓ చెలి
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే
నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
నీలో సర్వం నా సొంతం 

నీవే అమరస్వరమే..  సాగే.. శ్రుతిని నేనే..

మెరిసే వన్నెల లోకం చిందే చల్లని గానం
తీయనైన ఆశలన్నీ నీ వరం
తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
భావ రాగ భాష్యమే ఈ జీవితం
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలపించెనే
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలాపించెనే
నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోనా నిండాలి నేనే
నీలో సర్వం నా సొంతం

నీవే అమరస్వరమే సాగే శ్రుతిని నేనే
నీ మనసు నీ మమత వేలిసేనే నీకోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శ్రుతిని నేనే

శుక్రవారం, మార్చి 28, 2014

ఒంపుల వైఖరీ...

ఒక హాస్య ప్రధానమైన సినిమాకి రాసే అల్లరి పాటకి ఇంత చక్కని సొగసైన సాహిత్యం ఒక్క సిరివెన్నెల గారు మాత్రమే రాయగలరేమో... వంశీ, ఇళయరాజా, సిరివెన్నెల ల కలయికలో జనించిన ఒక మేలి ముత్యమిది, నాకు ఎంతో ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991) 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు, చిత్ర
 
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ

మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా 
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం

లాలిలాలిలాలి ...
లాలిలాలిలాలి 
లాలీ లాలీ ... లాలీ లాలీ

కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా 

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ

నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
 
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
హాఆఆఅ...

గురువారం, మార్చి 27, 2014

నీ జతే నేననీ నా జతే నీవనీ..

దేవా సంగీత సారధ్యంలో వెన్నెలకంటి గారి ఈ పాట వినడానికి బాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : భామనే సత్యభామనే (1996) 
సంగీతం : దేవ
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం : బాలు, చిత్ర 

నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ.. 
నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ.. 

నాలోని తాళం పాడింది నీకై ఆవేదనా స్వరం..
ఆలాపనాయే నాలోని ఆశే ఆ జ్ఞాపకం వరం 
చెంత చేరరాక చింత తీరనీక  
జంటలేని చినుకా కంటి మంట వెనుక
దాగలేదు ప్రాణ బంధమే.. 

నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 

గుండెల్లొ తాపం ఓ తేనె దాహం కోరింది నీ స్నేహం.. 
ఓ నాటి రాగం ఈ నాటి పాటే పాలించె నా ప్రాణం 
జరిగినదంతా కల ఆయెనంటా 
వలపును మనసే మరిచినదంట 
జన్మ బంధం వీడిపోవునో.. 
 
నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..
నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..

బుధవారం, మార్చి 26, 2014

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

తెలుగు శ్రోతలకు పరిచయం చేయాల్సిన అవసరంలేని అద్భుతమైన పాట, ఇళయరాజా, బాలు, ఆత్రేయల అపురూప సృష్టి, నాకు చాలా చాలా ఇష్టమైన పాట.. మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : మంచిమనసులు (1986) 
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ

గానం : యస్.పి.బాలు 
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
 
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పూవ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండీ లేక ఉన్నది నువ్వే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

మంగళవారం, మార్చి 25, 2014

నాదం నీ దీవనే...

ఇళయరాజా గారి మరో మధురమైన కంపొజిషన్... జానకమ్మగారి స్వరంలో వేటూరి గారి అక్షరాలు ఆ అమ్మాయి ప్రేమని ఆరాధనని మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. తెలుగు వీడియో దొరకలేదు తమిళ్ వీడియో ఎంబెడ్ చేశాను. భారతీరాజ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాధ చాలా చక్కగా ఉంటుంది ఇందులో. ఈ పాట తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రాగమాలిక (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

అమృతగానం ఈ అనురాగం నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై ఎగసి ముగిసిపోదునే
కన్నుల మౌనమా కలకే రూపమా
దాచకే మెరుపులే పన్నీర్ మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే

నాదం నీ దీవనే

కోయిలల్లే నాద మధువే పొందకోరే దీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే
కోవెల బాటలో పువ్వుల తోరణం
ఎంతకూ మాయని తియ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

సోమవారం, మార్చి 24, 2014

వీణ వేణువైన సరిగమ

రాజన్-నాగేంద్ర గారి మరో అద్భుత సృష్టి... వేటురి గారు బాలు, జానకి గార్లతో కలిసి.. మీరూ ఆస్వాదించండి.. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ పాటగురించి బ్లాగ్ మిత్రులు బ్లాగాడిస్తా రవిగారి విశ్లేషణ వేటూరి సైట్ లో ఇక్కడ చదవచ్చు. చిత్రం : ఇంటింటి రామాయణం (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, జానకి

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళా.. నే వంపులు తిరిగిన వేళా
నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళా ఆ చుక్కలు వెలిగిన వేళా
నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఎదలో అందం ఎదుటా.. ఎదుటే వలచిన వనితా
నీ రాకతో నా తోటలో.. వెలసే వనదేవతా
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవితా.. అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో నీ పల్లవే.. నవతా నవ్య మమతా

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఆదివారం, మార్చి 23, 2014

ఊరుకో ఊరుకో బంగారుకొండా..

ఆత్మబంధం సినిమాలోనిదే మరో చక్కనిపాట. ఏడ్చే బుజ్జాయిని బుజ్జగించే పాట. చాలాబాగుంది మీరూ వినండి. ఈ పాటని ఈ క్రింది ఎంబెడ్ చేసిన యూట్యూబ్ ఫైల్ లో 8:45 వరకూ ఫార్వార్డ్ చేసికానీ లేదా ఇక్కడ క్లిక్ చేసి కానీ వినవచ్చు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఆత్మబంధం (1991)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల    
గానం : బాలు, చిత్ర

ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేజారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా

ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా
చల్లబడకుంది ఎడారి ఎదలో..
జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా
మొండి ఊపిరింకా మిగిలుందీ... 
 చల్లని నీ కళ్ళలో కమ్మనీకలనేను
చెమ్మగిల్లనీయకుమా కరిగిపోతానూ

దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేజారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా

గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమనీ
తప్పుపట్టి తిట్టేవారేరీ... తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా
అంటూ ఊరడించే నాన్నేరీ

చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేననీ
జన్మలెన్ని దాటైనా చేరుకుంటాననీ
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయిజారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా

ఊ...రుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయిజారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా
...

శనివారం, మార్చి 22, 2014

మనసా వాచా...

వేటూరి గారు, శేఖర్ కమ్ముల, రాధాకృష్ణ కలిస్తే సంగీతాభిమానులకు సంబరమే కదా.. నాకెంతో ఇష్టమైన పాట. మీరుకూడా తనివితీరా ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా 
నడిచా నేనే నీడలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆఆఅ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా.. 
మూగైపోయా నేనిలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆఆఆఅ... 
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా 
రాముని కోసం సీతలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

శుక్రవారం, మార్చి 21, 2014

పున్నమిలాగా వచ్చిపొమ్మని...

కె.వి.మహదేవన్ గారి అసిస్టెంట్ గా అందరికీ తెలిసిన పుహళేంది గారు స్వరపరచిన పాట ఇది. పాట చాలా సార్లే విన్నాను కానీ సంగీతం పుహళేంది గారని ఇప్పటివరకూ తెలియదు. మీరూ వినండి. ఈ పాట చిమటాలో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ లింక్ కూడా కేవలం ఆడియో మాత్రమే.చిత్రం : జడగంటలు (1984)
సంగీతం : పుహళేంది
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆ..ఆ...ఆ...
లలలలలలలల.. లాలాలా... లాలాలా...

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

నువ్వు రావాలా... పువ్వు పూయాలా... రావేలా?
జడ గంటమ్మా... రతనాలమ్మా... జానకమ్మా...

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

లలల ఆ..
లలలలల లాలలలా..

పాపికొండలా... పండువెన్నెలా... పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా.. ఆఆఆ..
పాపికొండలా... పండువెన్నెలా... పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా... గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా..
నే కుంగిపోవాలా..

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

లలలల లాలాలా... లలలల లాలాలా

పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా..ఆఆఆ..
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండు ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా..ఆ..
నే కుంగిపోవాలా..

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా... పువ్వు పూయాలా.. రావేలా?
జడ గంటమ్మా... రతనాలమ్మా... జానకమ్మా...

ఆ... ఆ... ఆ...

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది...

గురువారం, మార్చి 20, 2014

ఎడారిలో కోయిలా తెల్లారనీ

బాలుగారి కోసం ఈ పాట ఎన్నివందల సార్లు అయినా వినవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : పంతులమ్మ (1977)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా..
తెల్లారనీ రేయిలా...
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే..

ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన
మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత
విధిరాత చేత నా స్వర్ణ సీత

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాట... ఒక చేదు పాట

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

బుధవారం, మార్చి 19, 2014

ఓహో లైలా ఓ చారుశీలా...

బాలు గారు ఒక మాంచి స్టైల్ తో పాడిన పాట ఈ పాట. సినిమాకూడా అప్పట్లో వైవిధ్యంగా కార్ రేసుల నేపధ్యంతో తీసిన సినిమా బాగుంటుంది కాకపోతే కాన్సెప్ట్ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయినట్లు లేరు బహుశా ఏదైనా ఇంగ్లీష్ సినిమా నుండి డైరెక్ట్ లిఫ్ట్ ఏమో కూడా తెలీదు. ఇళయరాజా గారు స్వరపరచిన ఈ సినిమాలో పాటలన్నీ కూడా బాగానే ఉంటాయి. మీరూ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. చిత్రం : చైతన్య (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళా


విశాఖలో నువ్వు నేనూ వసంతమే ఆడాలా
ఉషారుగా చిన్నాపెద్దా షికారులే చెయ్యాలా
వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాలా
వరించినా వలపుల్లోనే విరించిలా రాయాలా
అందచందాల అతివల్లోనా కోపమే రూపమా
కోపతాపాల మగువల్లోనా తప్పనీ తాళమా
చాల్లేబాల నీ ఛాఛఛీలా సంధ్యారాగాలాపనా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా.. హ..

జపించినా మంత్రం నీవే తపించిన స్నేహంలో
ప్రపంచమూ స్వర్గం నీవే స్మరించినా ప్రేమల్లో
చెలీ సఖీ అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో
ఇదీ కథా అన్నీ తెలిసీ క్షమించవే ప్రాయంతో
కాళ్ళ బేరాలకొచ్చాకైనా కాకలే తీరవా
గేరు మార్చేసి పాహీ అన్నా కేకలే ఆపవా
పోవే బాల చాలించు గోల ప్రేమిస్తున్నా ఘాటుగా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ

ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
ఒరె..మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుసల తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళా..ళా.ళ్ళా..ళ..ళ..

మంగళవారం, మార్చి 18, 2014

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు...

సిరివెన్నెల గారి మరో అందమైన పాట ఓ అల్లరి అమ్మాయి గురించి... నాకు చాలా ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి చిత్రీకరణ సైతం చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : జోష్(2009)
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు 
చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు 
నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నువ్వేం చూస్తున్నాఎంతో వింతల్లే అన్నీ 
గమనించే ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఎదో ఘనకార్యం లాగే 
గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
 
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


సోమవారం, మార్చి 17, 2014

హోలీ శుభాకాంక్షలు..

ఇళయరాజా గారి అద్భుతమైన మ్యూజికల్ హిట్ "అభినందన" సినిమాలోని ఈ కలర్ ఫుల్ పాట హోలీ సందర్బంగా మీకోసం. హోలీ అనగానే ఉన్న నాలుగైదు పండగకి సంబంధించిన పాటలనే రొటీన్ గా షేర్ చేసుకునే బదులు రంగులమయమైన ఈ పాట షేర్ చేద్దామనిపించింది చూసి ఆనందించండి.

మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు.. 
 సహజసిద్దమైన రంగులు వాడడానికి ప్రయత్నించండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

ఆఆఆఅ..ఆఆఆ.ఆఅ 
మ్.హుహు..ఊహూహూహు..
మ్.హుహు..ఊహూహూహు..
ఊహు..మ్ఊఊ.. ఊహు.. ఊహూహూ..
ఆఆఅ.ఆఅ..ఆ.. లాలలాలలాల.. 

రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో.. 
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో.. ఆఆ
ఆమని పూచే యామినివో..ఆఅ
మరుని బాణమో.. ఆహా మదుమాస గానమో ఆహ్హా..
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై.. యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై 
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై...


ముంతాజు అందాల అద్దానివో.. 
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో.. ఆఅ
లైలా కన్నుల ప్రేయసివో.. ఆఅ
ప్రణయ దీపమో.. ఆహా నా విరహ తాపమో.. ఆహా
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో

రంగులలో కలనై లలలా లలలా 
యద పొంగులలో కళనై లలలా లలలా
నవశిల్పాంగినై రతిరూపాంగినై 
నీ ఊహల ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

హోలీ ఎంతైనా నార్త్ ఇండియాలో ఎక్కువ జరుపుకునే పండగ కదా కనీసం ఇపుడైనా ఒక హిందీ పాట పంచుకోకపోతే ఎలా అందుకే హోలీ పాటలలో ఆకట్టుకునే ఈ శాంతారామ్ గారి పాట చూడండి 'నవరంగ్' సినిమాలోనిది ఎంత బాగుందో.. ఈ పాట వినాలంటే ఇక్కడ వినవచ్చు.Movie/Album: नवरंग (1959)
Music By: सी.रामचंद्र
Lyrics By: भरत व्यास
Performed By: चितलकर, महेंद्र कपूर, आशा भोंसले

अटक-अटक झटपट पनघट परचटक मटक इक नार नवेली
गोरी-गोरी ग्वालन की छोरी चली
चोरी चोरी मुख मोरी मोरी मुसकाये अलबेली
कँकरी गले में मारी कंकरी कन्हैये ने
पकरी बाँह और की अटखेली
भरी पिचकारी मारी
भोली पनिहारी बोली

अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे
 
अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे

 मुझे समझो न तुम भोली भाली रे

आया होली का त्योहारउड़े रंग की बौछार
तू है नार नखरेदार मतवाली रे
आज मीठी लगे है तेरी गाली रे

तक तक ना मार पिचकारी की धार
..
तक तक ना मार पिचकारी की धार
कोमल बदन सह सके ना ये मार
तू है अनाड़ी, बड़ा ही गँवार
कजरे में तूने अबीर दिया डार
तेरी झकझोरी से, बाज़ आयी होरी से
चोर तेरी चोरी निराली रे
मुझे समझो ना तुम भोली भाली रे
 
अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे
मुझे समझो न तुम भोली भाली रे

धरती है लाल आज, अम्बर है लाल  
धरती है लाल आज, अम्बर है लाल 
उड़ने दे गोरी गालों का गुलाल
मत लाज का आज घूँघट निकाल
दे दिल की धड़कन पे, धिनक धिनक ताल
झाँझ बजे शँख बजे, संग में मृदंग बजे
अंग में उमंग खुशियाली रे
आज मीठी लगे है तेरी गाली रे
 

अरे जा रे हट नटखटना छू रे मेरा घूँघट
पलट के दूँगी आज तुझे गाली रे 

मुझे समझो न तुम भोली भाली रे

హోలీ శుభాకాంక్షలు
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే చివరిగా ఈ వీడియో ఒకటి చూడండి ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటూ అమెరికాలో జరుపుకుంటున్న హోలీని చాలా చక్కగా ప్రజంట్ చేశారు. ఒక్కసారిగా రంగులు గాలిలోకి ఎగరడం చిత్రీకరించిన విధానం నాకు చాలా నచ్చింది అంతేకాక ఈ ఫెస్టివల్ లో ఉపయోగించేవి అన్నీ సహజ సిద్దమైన రంగులట. ఆదివారం, మార్చి 16, 2014

అందాలొలికే సుందరి...

ఈ సినిమా విడుదలైనపుడు ఈ పాటలు ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో మాటలలో చెప్పడం కష్టమేనేమో... మొత్తం స్టేట్ అంతటినీ ఒక ఊపు ఊపేసిన పాటలు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించిన టి.రాజేందర్ ఒక ముఖ్యపాత్ర కూడా పోషించారు. ఎవరా రాజేందర్ అంటారా ధైర్యమున్నవాళ్ళు ఈ ఫైట్ సీన్ చూసి తెలుసుకోండి. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ పాటతో పాటు ఈ సినిమాలోని మరికొన్ని పాటలు కూడా బాగుంటాయి. రేపు హోలీ సెలెబ్రేషన్స్ మొదలెట్టే ముందు ఈ కలర్ ఫుల్ పాట చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలనుకున్న వాళ్ళు ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు. చిత్రం :  ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, శైలజ

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు 
చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల 
దోర పెదవులే పలికే..ఏ..ఏ...
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేనూ

అప్సరా ఆడెనే... అందలే మ్రోగెనే
మరులు విరిసి పలకరించె మనసు
కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను
పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ..

మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి 
చెలి స్నేహం ఆ..ఆ..
పలవరింతలు రేపెను కోటీ ...ఆమె కెవరు లేరిక సాటీ
పలవరింతలు రేపెను కోటి ..ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను

ఆఆఆ..రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ.. 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అన్నట్లు రేపు హోలీ కదా రంగులు సిద్దం చేసుకున్నారా.. లేకుంటే సహజ సిద్దమైన రంగులు (నాచురల్ కలర్స్) ఎలా తయారుచేస్కోవాలో ఈ వీడియోలో చూడండి. బీట్ రూట్, కాఫీ/టీ పొడి, ఆకు కూరలు, పసుపు + సెనగపిండి, కుంకుమ పువ్వు, బట్టలకు పెట్టే నీలిరంగు + సెనగపిండి లతో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. 


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ వీడియోలో నాచురల్ కలర్ పౌడర్స్ ఎలా తయారుచేస్కోవచ్చో చూపించారు, ఫుడ్ కలర్స్ ని వైట్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ తో కలిపి చేయచ్చట. మీకు ఇంకేవైనా తెలిసినా ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. 

శనివారం, మార్చి 15, 2014

శశివదనే శశివదనే...

కొన్ని పాటల గురించి ఎక్కువ మాట్లాడకూడదు జస్ట్ విని ఆస్వాదించాలంతే... ఇదీ అలాంటి పాటే మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఇద్దరు (1997)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీమది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహినీ చూపులోన మాండురాగమేలా
మదన మోహినీ చూపులోన మాండురాగమేలా
పడుచువాడినీ కన్న వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
చందనం కలిసినా ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా 
ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె
ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె
అమృతం కురిసిన రాతిరి ఓ జాబిలి హృదయం జతచేరే

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
ఆ... ఆ... నీదా...ఆ... ఆ... నీదా... ఆ... ఆ... నీదా...

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.