బాలుగారి కోసం ఈ పాట ఎన్నివందల సార్లు అయినా వినవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.
చిత్రం : పంతులమ్మ (1977)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రాజన్ - నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా..
తెల్లారనీ రేయిలా...
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే..
ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన
మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత
విధిరాత చేత నా స్వర్ణ సీత
ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా
కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి
ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాట... ఒక చేదు పాట
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట
2 comments:
విధి రాత చేత..
నా స్వర్ణ సీత..
చాలా అద్భుతమైన భావన..అందులోనూ బాలూ గారి లేత గొంతు నించి జాలువారిన ఈ పాట యెప్పుడు విన్న మనసుని చాలా హాంట్ చేస్తుంది.
థాంక్స్ శాంతి గారు.. అవునండీ ఈ పాటలో బాలుగారి గొంతు చాలా బాగుంటుంది నాక్కూడా ఇష్టం..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.