కె.వి.మహదేవన్ గారి అసిస్టెంట్ గా అందరికీ తెలిసిన పుహళేంది గారు స్వరపరచిన పాట ఇది. పాట చాలా సార్లే విన్నాను కానీ సంగీతం పుహళేంది గారని ఇప్పటివరకూ తెలియదు. మీరూ వినండి. ఈ పాట చిమటాలో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ లింక్ కూడా కేవలం ఆడియో మాత్రమే.
చిత్రం : జడగంటలు (1984)
సంగీతం : పుహళేంది
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
ఆ..ఆ...ఆ...
లలలలలలలల.. లాలాలా... లాలాలా...
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా... పువ్వు పూయాలా... రావేలా?
జడ గంటమ్మా... రతనాలమ్మా... జానకమ్మా...
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
లలల ఆ..
లలలలల లాలలలా..
పాపికొండలా... పండువెన్నెలా... పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా.. ఆఆఆ..
పాపికొండలా... పండువెన్నెలా... పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే... ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా... గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా..
నే కుంగిపోవాలా..
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
లలలల లాలాలా... లలలల లాలాలా
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా..ఆఆఆ..
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా...
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే... గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండు ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా..ఆ..
నే కుంగిపోవాలా..
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా... పువ్వు పూయాలా.. రావేలా?
జడ గంటమ్మా... రతనాలమ్మా... జానకమ్మా...
ఆ... ఆ... ఆ...
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది...
8 comments:
Lyrics chaalaa baagunnaayi..Srikanth gaaru:):)
కదా కార్తీక్ గారూ.. ఈ పాట వేయమని అడిగిన హర్షకి థాంక్స్ చెప్పుకున్నానండీ పోస్ట్ చేసేప్పుడు :-)
థాంక్స్ ఫర్ ద కామెంట్.
థాంక్యు సో మచ్ వేణు గారూ :)
ప్లెజర్ ఈజ్ మైన్ హర్షా..
బాపూ గారి బొమ్మకి రూపమొచ్చినట్టు వుంటుందండీ ఈ పాట (లిరిక్స్ లో)..
థాంక్స్ శాంతి గారు.. అవునండీ కరెక్ట్ గా చెప్పారు.
మీ కృషీ..
అభిరుచి..
అభినందనీయం వేణూ శ్రీకాంత్ గారు
ధన్యవాదాలు Saride nag గారూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.