ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా ఒకనాటి మేటి గీతాన్ని తలచుకుందామా. అంటే మహిళాభ్యుదయాన్ని ప్రోత్సహిస్తూ వచ్చే గీతం కాకపోయినా ఆ పాత్ర తీరుతెన్నులు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో కూడిన నాయికని పరిచయం చేస్తూ సాగే ఈ పాట వింటున్నపుడు అసలే రక్షణ అంతంత మాత్రమవుతున్న ఈరోజుల్లో మహిళలంతా ఇదే ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. సంఘం సినిమాలోని పాటలలో "సుందరాంగ మరువగలేనోయ్", "పెళ్ళీ" పాటలు కూడా నాకు ఇష్టమైనప్పటికీ ఈ పాట కొంచెం ఎక్కువ ఇష్టం. ఆడియో ఎంత బాగుంటుందో వైజయంతిమాల గారిపై చిత్రీకరించిన విధానం వలన కూడా మరింత బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
ఈ సినిమాలో వైజయంతిమాల గారిలా మహిళలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి
గానం : పి.సుశీల
ఆఆఆఆఆఆ...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లాలల లాలల లా లల్లల్లా...
భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..
భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..
స్వార్థముతో కులమత భేదముతో..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
కర్షక సౌఖ్యం...
కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం..
కర్షక సౌఖ్యం కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆఆఅ..
కలిగే మార్గం చూపిస్తా...
రాణీ రుద్రమ మల్లమదేవీ రెడ్డినాగమ్మ నేనే
రాణీ రుద్రమ మల్లమదేవీ రెడ్డినాగమ్మ నేనే
రణ తిక్కన భార్యా సతి మాంచాల
తిక్కన భార్యా సతి మాంచాల
శౌర్య ధైర్యములు నావే..
శౌర్య ధైర్యములు నావే..
భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే..
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..
ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆఆఅ...
ఆహో..ఆఆఆఆఆ...
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు... |
3 comments:
థాంక్యూ వేణూజీ. చాలా ఇష్టమైన పాట.
ఈ మూవీ లో సహనానికి, సౌశీల్యానికి ప్రతీక అంజలీదేవి ఐతే..సాహసానికి, స్వాభిమానానికి ప్రతీక వైజయంతిమాల..చాలా ఇన్ స్పైరింగ్ సాంగ్ వేణూజీ..ధాంక్యూ..
థాంక్స్ జయ గారు.
థాంక్స్ శాంతి గారు, అవునండీ ఇద్దరివీ చాలా విభిన్నమైన పాత్రలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.