మంగళవారం, మార్చి 11, 2014

కనులే కలిపే కథలే తెలిపే

మళయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ సంగీత సారధ్యంలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా "కలవరమాయే మదిలో". సంగీత ప్రధానమైనాకూడా ప్రేమకథతో ఫ్యూజన్ ఫీల్ తెప్పిస్తుంది స్వాతికి బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చేమో. నాకు చాలా నచ్చిన సినిమా ఇది, పాటలు కూడా దదాపు అన్నీ బాగుంటాయ్. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా సినిమాలోని అన్ని పాటల యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ  కూడా వినవచ్చు.



చిత్రం : కలవరమాయే మదిలో (2009)
సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : చిత్ర

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో
కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే

మనసునే తొలి మధురిమలే వరి౦చెనా
బతుకులో ఇలా సరిగమలే రచి౦చెనా
స్వరములేని గాన౦ మరపు రాని వైన౦
మౌనవీణ మీటుతు౦టే
కలవరమాయే మదిలో

ఎదగని కలే ఎదలయలో వరాలుగా
తెలుపని అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీర౦ మధురమైన భార౦
గు౦డెనూయలూపుతు౦టె
కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో
కలవరమాయే మదిలో

6 comments:

Very soothing song and beautifully sung by the great Chitra garu. I like it too. Nothing much to say about the picturization though.

$id

థాంక్స్ సిద్ గారు. ఈ సినిమాలో దదాపు అన్నిపాటలు బాగుంటాయండి.

ఇంతకు ముందు ఈ పాట విన్లేదు వేణూజీ..బావుంది..

థాంక్స్ శాంతి గారు.. ఈ సినిమాలో అన్నిపాటలు బాగానే ఉంటాయండీ.. వినండి మీకు నచ్చుతాయి.

థాంక్స్ saride nag గారు.. ఎస్ చిత్ర గారు చాలా బాగా పాడారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.