శుక్రవారం, మార్చి 28, 2014

ఒంపుల వైఖరీ...

ఒక హాస్య ప్రధానమైన సినిమాకి రాసే అల్లరి పాటకి ఇంత చక్కని సొగసైన సాహిత్యం ఒక్క సిరివెన్నెల గారు మాత్రమే రాయగలరేమో... వంశీ, ఇళయరాజా, సిరివెన్నెల ల కలయికలో జనించిన ఒక మేలి ముత్యమిది, నాకు ఎంతో ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991) 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు, చిత్ర
 
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ

మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా 
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం

లాలిలాలిలాలి ...
లాలిలాలిలాలి 
లాలీ లాలీ ... లాలీ లాలీ

కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా 

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ

నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
 
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
హాఆఆఅ...

2 comments:

క్లాస్, మాస్ సమానం గా ఇష్టపడే డైరెక్టర్ వంశీ గారు అనిపిస్తుంది నాకు. ముఖ్యం గా గోదావరి + ఆ జిల్లాల పై ఆయనకు గల మక్కువ తన ప్రతీ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..వంశీగారి లోని భావుకుడిని అర్ధం చేసుకుంటే ఆయన ప్రతి పాటా ఓ ఐ ఫీస్ట్..లేకుంటే ఓ ఏబ్ స్ట్రాక్ట్ (abstract)..

>వంశీగారి లోని భావుకుడిని అర్ధం చేసుకుంటే ఆయన ప్రతి పాటా ఓ ఐ ఫీస్ట్..లేకుంటే ఓ ఏబ్ స్ట్రాక్ట్ (abstract)..<
చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.