గురువారం, మార్చి 27, 2014

నీ జతే నేననీ నా జతే నీవనీ..

దేవా సంగీత సారధ్యంలో వెన్నెలకంటి గారి ఈ పాట వినడానికి బాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : భామనే సత్యభామనే (1996) 
సంగీతం : దేవ
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం : బాలు, చిత్ర 

నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ.. 
నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ.. 

నాలోని తాళం పాడింది నీకై ఆవేదనా స్వరం..
ఆలాపనాయే నాలోని ఆశే ఆ జ్ఞాపకం వరం 
చెంత చేరరాక చింత తీరనీక  
జంటలేని చినుకా కంటి మంట వెనుక
దాగలేదు ప్రాణ బంధమే.. 

నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 

గుండెల్లొ తాపం ఓ తేనె దాహం కోరింది నీ స్నేహం.. 
ఓ నాటి రాగం ఈ నాటి పాటే పాలించె నా ప్రాణం 
జరిగినదంతా కల ఆయెనంటా 
వలపును మనసే మరిచినదంట 
జన్మ బంధం వీడిపోవునో.. 
 
నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..
నీజతే నేననీ.. నాజతే నీవనీ.. 
తీయనీ ప్రేమే తలుపే తీయనీ..

3 comments:

ఓ భలే ఇష్టం నాకీ పాట! ఇంకా గుర్తుచేద్దాం అనుకుంటున్నానండి :)

ఓహ్ అవునా థాంక్స్ తృష్ణ గారు :-)
థాంక్స్ కార్తీక్ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.