శనివారం, మార్చి 29, 2014

నీవే అమర స్వరమే...

ఇళయరాజా గారి మరో ఆణిముత్యం, ఒకప్పుడు డబ్బింగ్ పాటలకు సైతం రాజశ్రీ గారు ఎంత చక్కని లిరిక్స్ రాసేవారో తెలియాలంటే ఈ పాట ఒక మంచి ఉదాహరణ. అప్పట్లో ఈ పాట చిత్రీకరణ మణిరత్నం చేసిన మరో సాహసం అని చెప్పచ్చేమో. నాకు చాలా ఇష్టమైన పాట తరచుగా వినేపాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఘర్షణ(1988)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర 

నీవే అమరస్వరమే..  సాగే.. శ్రుతిని నేనే..
నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శ్రుతిని నేనే

పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
మల్లె పూల బంధమీవు ఓ చెలి
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే
నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
నీలో సర్వం నా సొంతం 

నీవే అమరస్వరమే..  సాగే.. శ్రుతిని నేనే..

మెరిసే వన్నెల లోకం చిందే చల్లని గానం
తీయనైన ఆశలన్నీ నీ వరం
తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
భావ రాగ భాష్యమే ఈ జీవితం
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలపించెనే
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలాపించెనే
నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోనా నిండాలి నేనే
నీలో సర్వం నా సొంతం

నీవే అమరస్వరమే సాగే శ్రుతిని నేనే
నీ మనసు నీ మమత వేలిసేనే నీకోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శ్రుతిని నేనే

6 comments:

Yes, picturization of this song was a daring experiment during that period. This is my 3rd favorite romantic song after "Paruvam vaanaga" (Roja) and "Om namaha" from (Geetanjali) with respect to music, lyrics and picturization.

$

మనసుని చాలా డెలికేట్ గా డీప్ గా టచ్ చేసే ఫాట ఇది..

అవును శాంతి గారు, థాంక్స్.

సినిమా చూడక ముందు ఈ పాట ఒకసారి విన్నట్లు గుర్తు. ఎప్పుడైతే మొదటిసారి సినిమా చూసానో ఆ తరువాత ఎన్నిసార్లు విన్నానో కూడా లెక్కలేదు. అంతగా మత్తెకించింది ఈ పాట రాజశ్రీ గారు చాలా అద్భుతంగా రాసారు పాటని ఇక ఇళయరాజా గారి సంగీతం ఎవర్గ్రీన్, చివరిగా బాలు గారు 🙏🙏🙏 🙏

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ జాన్సన్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.