సోమవారం, మార్చి 24, 2014

వీణ వేణువైన సరిగమ

రాజన్-నాగేంద్ర గారి మరో అద్భుత సృష్టి... వేటురి గారు బాలు, జానకి గార్లతో కలిసి.. మీరూ ఆస్వాదించండి.. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ పాటగురించి బ్లాగ్ మిత్రులు బ్లాగాడిస్తా రవిగారి విశ్లేషణ వేటూరి సైట్ లో ఇక్కడ చదవచ్చు. చిత్రం : ఇంటింటి రామాయణం (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, జానకి

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళా.. నే వంపులు తిరిగిన వేళా
నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళా ఆ చుక్కలు వెలిగిన వేళా
నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

ఎదలో అందం ఎదుటా.. ఎదుటే వలచిన వనితా
నీ రాకతో నా తోటలో.. వెలసే వనదేవతా
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవితా.. అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో నీ పల్లవే.. నవతా నవ్య మమతా

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

4 comments:

I think you have posted this song in this blog some time back. Beautiful song with so many expressions by both Janaki garu and Balu garu.
Thanks,

$iddharth

లేదు సిద్దార్థ్ గారు.. సాధారణంగా నేను పోస్ట్ చేసేముందు బ్లాగ్ లో సెర్చ్ చేసి చూస్తాను ఇదివరకు పోస్ట్ చేశానేమో అని. ఇదివరకు మానసవీణ పాట పోస్ట్ చేశాను కానీ ఈ పాట పోస్ట్ చేయలేదు.

ఈ పాట వింటుంటే మనసు టూ మచ్ గా ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి పోయింది వేణూజీ..థాంక్స్ ఫర్ ద రైడ్..

ఈ కాలంలో వచ్చిన పాటలన్నిటిలోను ఉన్న మహత్యమదేనేమో శాంతి గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.