శనివారం, మార్చి 01, 2014

ఊఁ అన్నా.. ఆఁ అన్నా..

మొన్న విజయభాస్కర్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు తలచుకుంటుంటే ఈ పాట గుర్తొచ్చింది. వేటూరి, ఏసుదాసు గారు తోడవటంతో ఈ పాట కొత్త అందాన్ని సంతరించుకుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. కింద పోస్టర్ చూసి కూడా వీడియో చూసే ధైర్యమున్న వాళ్ళు ఎంబెడ్ చేసిన వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు :-)చిత్రం : దారి తప్పిన మనిషి (1981)
సంగీతం : విజయభాస్కర్
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్, సుశీల

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న తలపు వలపైనప్పుడు ..కన్నె మనసు ఏమంటుంది
చిలిపి చిలిపి కులుకుల కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది
కోరికలన్నీ కోయిలలైతే.. కొత్త ఋతువు ఏమంటుంది
వయసంతా వసంతమై వలపు వీణ ఝుమ్మంటుంది
పిలుపో.. తొలి వలపో.. మరుపో.. మైమరుపో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న కనులు రెండే అయినా.. కన్నకలలకు అంతే లేదు
కన్న కలలు ఎన్నైనా.. ఉన్న నిజము మారిపోదు
కోరిన వారు కొంగు ముడేస్తే.. కలలు పండి నిజమౌతాయి
కల అయినా.. నిజమైనా.. కలదు కదా కథ తరువాయి
కలయో.. ఇది నిజమో.. కథయో.. వైష్ణవమాయో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

నిదురించిన తూరుపులో నీవేలే పొద్దుపొడుపు
నిను కోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు
అన్నా.. నేవిన్నా.. ఔనన్నా.. కాదన్నా
అవునంటే నీతో ఉన్నా... కాదన్నా నీలో ఉన్నా

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు

ఆహాహాహహా...  ఆహాహాహహా

4 comments:

ఈ మధ్య కాలం లో నేను మర్చిపోయిన, నాకు చాలా ఇష్టమైన పాట వేణు గారు, మళ్ళా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. వీడియో చూస్తుంటే మాత్రం భలే నవ్వొచింది, ఈ పాట అనే కాదు కానీ ఆపాత మధురాలన్నిటికీ కూడా దాదాపు ఇదే దుర్దశ. వీడియో చూడకుండా కళ్ళు మూసుకుని పాట వింటుంటే ఏదేదో లోకాల్లో విహరింప చేసే పాటలన్నిటికీ దాదాపు ఇలాంటి భీభత్సమైన picturization ఉంటుంది. ఆ హింస తట్టుకోలేకే నేను పాత పాటల వీడియో లు చూడటం సాంతం మానేసాను. తొలి వలపు తొందరలు అనే పాట, చినుకు చినుకు పడుతూ ఉంటే అనే పాట ఇలాంటి భీభత్సమైన choreography కి మంచి సాక్ష్యాలు

-Lakshmi

హహహ కరెక్ట్ గా చెప్పారు లక్ష్మిగారు :-) ముఖ్యంగా డెబ్బై ఎనభైలలో వచ్చిన కొన్ని మంచి మెలోడీస్ చిత్రీకరణ చూడాలంటే బోలెడు ధైర్యంకావాల్సిందే :-) నేనూ సాధారణంగా చూడనండీ కానీ వీడియో దొరికేసరికి ఇవ్వకుండా ఉండలేకపోయా :-)) థాంక్స్.

ఏసుదాసు గారు యెప్పటికీ యెవ్వర్ గ్రీన్ ఐనా, ఈ టైం లో వచ్చిన పాటలు అమృతపు జలపాతాలే వేణూజీ..

కరెక్ట్ శాంతి గారు, థాంక్స్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.