అచ్చంగా జీవితం మనకి చూపించే రకరకాల రుచులకు మల్లే తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు, వగరు ఇత్యాది రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చళ్ళు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే నేటి రోజున నా బ్లాగ్ మిత్రులందరికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా కోటి గారి స్వర సారధ్యంలో వనమాలి గారి రచన "కొమ్మలో ఒక కోయిల కూసిందీ" పాట చూసి విని ఆనందిద్దామా. ఆడియో మాత్రమే వినాలనుకున్న వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : కౌసల్య సుప్రజ రామ (2008)
సంగీతం : కోటి
సాహిత్యం : వనమాలి
గానం : మధుబాలకృష్ణన్, సునీత
శ్రీశ్రీశ్రీ సర్వధారి నామ సంవత్సరం సుందరం సుమధురం
పంచుకుందాం ఈ సంబరం అందరం మనమందరం
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది.
కొమ్మలో ఒక కోయిల కూసిందీ
గుండెలో చిరు ఆశలు రేపిందీ
అనురాగమె దానికి పల్లవిగా
అనుబంధమె వీడని చరణంలా
మధుమాసమె అందరి మనసులు మీటెనులే..
ఉగాది ఉగాది ఉగాది ఉగాది
మనసైన మాటొకటె బహుతీపిగా
ఎడబాటు ఎదురైతే అది చేదుగా
ఎదలోని పులకింతె ఆ పులుపుగా
అనలేని భావాలె ఈ వగరుగా
చుర చుర చూపుల మంటలు చల్లితే కారమయే కళ ఇదికాదా
బ్రతుకున కమ్మని రుచులను చేర్చగ లవణమనే సాయం లేదా
అభిరుచులను కలిపిన బ్రతుకే పండుగలే..
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది.
కొమ్మలో ఒక కోయిల కూసిందీ
గుండెలో చిరు ఆశలు రేపిందీ..ఈఈఈ..
ధిరన ధిరన ధిరన ధిరన ధిరనన
ధిరన ధిరన ధిరన ధిరన ధిరనన
తతోంత ధిరనన తోం తధిరన
తతోంత ధిరనన తోం
ధిరన ధిరన ధిరన ధిరన ధిరనన
తతోంత ధిరనన తోం తధిరన
తతోంత ధిరనన తోం
పంచాంగ శ్రవణాలు వినిపించనా
ఈ పచ్చడే నీకు తినిపించనా
ఆ రాశి ఫలితాలు అందించనా
ఏం రాసినా మన కథ మారునా
మమతలు నిండిన చల్లని కోవెల మనసులనే జతగా కలిపే
వెనుకటి జన్మల తీరని ఋణమో చివరికిలా మీతో నిలిపే
ఏ సిరులకు దొరకని చెలిమే చాలునులే.. హా..
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
నవ్వులన్ని చల్లవే ఉగాది.
కొత్త కొత్త కోరికేదొ చెంతకొచ్చి వాలుతుంటే
సంబరాలు పంచవే ఉగాది
తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఉగాది ప్రాసస్త్యాన్ని వివరిస్తూ చక్కని వ్యాఖ్యానంతో తెలుగువన్ వారు రూపొందించిన ఈ వీడియోని ఈ సంధర్బంగా మీ ఇంట్లోని పిల్లలకి ఒక సారి చూపించండి.
2 comments:
బిలీటెడ్ వుగాది విషెస్ మీకూ, మీ కుటుంబానికి వేణూజీ..
థాంక్స్ శాంతి గారు. మీరు ఆలశ్యంగా వచ్చినాకూడా ఇలా పాత పోస్టులన్నిటికి కూడా వెతికి మరి కామెంట్ పెడుతూ ప్రోత్సహిస్తున్న తీరుకు ధన్యవాదాలండీ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.