గురువారం, మార్చి 13, 2014

పున్నమి పున్నమి వెన్నెల

ఇటీవల వచ్చిన పాటలలో ఓ మంచి మెలొడి ఇది, చిత్రీకరణ కూడా చిత్రంగా ఉంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : లవ్ జర్నీ(2012)
సంగీతం : సతీష్ చక్రవర్తి
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : విజయ్ ఏసుదాస్, శ్వేత
 
పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
ఎందరొ ఎందరొ ప్రేమికులున్నా
ఎన్నో ఎన్నో కలలను కన్నా
ప్రాణం ఇచ్చే ప్రేమే నాదీ ఓఓఓఓ

వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
కన్నులు కన్నులు నేడే కలిసెను
కలలివి కలలివి అలలై ఎగసెను
ఆశల గువ్వలు నింగిని తాకెను

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

కావ్యాల్లాంటీ కథలను ఎన్నో భూమే చూసినది
నా ఎద కోరే మన కథ కూడా చరితై ఉండమనీ..
నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను
ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

ఏవో కలలే అలలై వచ్చీ తీరం చేరినవీ..
ఏవో కథలే ఎదనే గిచ్చీ విరహం పెంచినవీ
నింగిని వీడి నేలకు వచ్చి వెన్నెల నిన్నే చేరింది చేరింది
ఆశలు తీరే ఆమని లాగా బతుకే నేడు మారింది మారింది

పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
పువ్వులు పూచిన నవ్వే నా చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
కన్నులు కన్నులు నేడే కలిసెను
కలలివి కలలివి అలలై ఎగసెను
ఆశల గువ్వలు నింగిని తాకెను

పున్నమి పున్నమి వెన్నెల నీ చెలి
పువ్వులు పూచిన నవ్వే నీ చెలి
చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..

4 comments:

మరి మూడో రిక్వెస్ట్ చేయనా వేణు గారు?

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లె వచ్చి పొమ్మని గోదారడిగింది.... అనే పాట 'జడగంటలు' సినిమా నుంచి :)

చల్లని రేయి..వెన్నెల నదిలో, మనసైన వాడితో తేలి ఆడుతూ..పాడుతూ..ఓహ్..నచ్చనిదెవరికండీ..ఆ పడవలో నేనునంటే..అనుకోని అమ్మాయిలెవరుంటారు ఫ్రెండ్..

థాంక్స్ హర్షా.. ఈ పాటకూడా త్వరలో పోస్ట్ చేస్తాను.

థాంక్స్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.