ఆదివారం, డిసెంబర్ 03, 2017

నవ్వేవాళ్ళు నవ్వని / నీతోనే ఉంది ఈ ప్రపంచం

చెన్నకేశవరెడ్డి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care


పూలే నీపై చల్లనీ
రాళ్ళే నీపై రువ్వనీ
ఎత్తుకు నిన్నేగరెయ్యనీ
గోతులు నీకై తీయనీ
don't care... నవ్వే వాళ్ళు

అనుకొన్నది నీవ్వే చెయ్‌
అనుమానం మాని చెయ్‌
నీ మనసే గట్టి చెయ్‌
నీదే రా పై చెయ్‌

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care


ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో
క్రమశిక్షణ తో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో
చిరునవ్వుతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
ఓర్పు సహనం వుండాలన్నది పుడమిని చూసి నేర్చుకో
ఎంత తొక్కినా .. నిన్నెంత తొక్కినా ..
అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో
నేర్చుకొన్నది పాటించేయి, ఓర్చుకొంటూ పనులే చేయి
నీదే రా పై చెయ్‌

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care


ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో
పరులకి సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో
సోమరితనాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసి నేర్చుకో
ఎంత చెప్పినా... నేనంత చెప్పినా
ఇంకెంతో మిగులున్నది అది నీకు నీవు తెలుసుకో
నేర్చుకొన్నది పాఠం చేయి నలుగురికీ అది నేర్పించేయి
నీదే రా పై చెయ్‌

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~అలాగే రాజా చెయ్యి వేస్తే చిత్రంలోని ఒక చక్కని పాటను కూడా తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజా చెయ్యి వేస్తే (2016)
సంగీతం : సాయికార్తీక్
సాహిత్యం : డా.వెనిగళ్ళ రాంబాబు
గానం : శ్రీ చరణ్, సాయికార్తీక్

నీతోనే ఉంది ఈ ప్రపంచం
నీ తీరు నేడు మార్చుకొంచెం
అంతా నీ వారే ఇదంతా నీ ఊరే
చూడు భూగోళం చిన్ని పల్లెటూరే
ముళ్ళే పరిచుంటే నీ కళ్ళే తెరిచుంటే
వెళ్ళే నీ దారికూడ పూలదారే

కష్టాలైనా నష్టాలైనా ఇష్టం అనుకో ఇకనుంచైనా
కన్నీరు కళ్ళను కడిగే పన్నీరన్నా
చచ్చే వరుకు నీవనుకుంది
సాధించే అవకాశం ఉంది
ఆ ధైర్యం నీగుండెల్లో ఉండాలన్నా..

నీతోనే ఉంది ఈ ప్రపంచం
నీ తీరు నేడు మార్చుకొంచెం

నీనోరుమంచిదైతే ప్రతి ఊరు మంచిదేలే
నీ చూపే గునపం ఐతే ప్రతి బీడూ పంటచేలే
నీ కుంటే ఓర్పు నేర్పు ఇక ఉంటుందన్నా మార్పు
మరి ఉదయిస్తేనే తూర్పు ఇది కాలం చెప్పే తీర్పు
ఉరుములు వద్దనుకుంటే వానచినుకేలేదయ్యో
దుక్కి దున్నొద్దంటే మొక్క పైకి రాదయ్యో
తీపి రోజూ తింటే నాలుకంతా చేదయ్యో
ఒత్తిడికూడా వరమనుకుంటే
పుత్తడికాదా జీవితమంతా

హృదయం లేని మాటలకన్నా
మాటల్లేని హృదయం మిన్నా
హృదయం లేని మాటలకన్నా
మాటల్లేని హృదయం మిన్నా
ఎదురీది ఏటిని దాటెయ్ ఎవరేమన్నా

నీతోనే ఉంది ఈ ప్రపంచం
నీ తీరు నేడు మార్చు కొంచెం

పోరుతప్పదంటే నువ్వు నీరుగారిపోకు
ఇక ఏరుదాటమంటే నువ్వు ధీరుడల్లే దూకు
సొమ్మొకటేనా గొప్ప తీసెయ్ తాళం కప్పా
పైసానీతో రాదు నీ పాపం పుణ్యం తప్పా
నిన్నా మొన్నా ఏమైనా నేటినుండే జీవించు
చావునె నువ్ చంపేస్తూ జీవితాన్నే ప్రేమించు
కన్నవాళ్ళ కళ్ళల్లో కలువపూలే పూయించు
జీవితశిల్పం చెక్కేదెవరూ
బాధలనే ఉలిదెబ్బలు నేస్తం

కొన్నాళ్ళయినా కొన్నేళ్ళయినా
గుండెల్లో సెగ రగిలించాలి
కొన్నాళ్ళయినా కొన్నేళ్ళయినా
గుండెల్లో సెగ రగిలించాలి
ముందుండి నీవే శంఖం మోగించాలి 

నీలోనే ఉంది చూడు స్వర్గం
నీ మనసే దాని రాజ మార్గం
ఓ సారి భగవద్గీత సుమతీశతకం
చదవాలోయ్ చిన్నా...


3 comments:

Thanks sir..
అడిగిన వెంటనే నాకు కావలసిన లిరిక్స్ ను పోస్ట్ చేశారు..
రెండు పాటలలో సాహిత్యం 👌👌👌

My Pleasure శ్రీనివాసరెడ్డి గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్..

అద్భుతమైన సాహిత్యం ...
thanks for sharing ...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.