గురువారం, డిసెంబర్ 14, 2017

ఆకాశం తలవంచాలి...

మనసారా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల, అనంత్ శ్రీరాం
గానం : రంజిత్

ఓఒ ఓఒ ఓఒఓఓఓఒ... చలో చలో
ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ

ఓటమి విల్లును విరిచే
ఆ తెగువే నీకే ఉంటే
ఇక రెక్కలు కట్టుకు విజయం
నీ చుట్టు చుట్టూ తిరగదా
నిప్పుల నిచ్చెన మీద
అరె ఒక్కో అడుగుని వేస్తూ
నువు కోరిన శిఖరము ఎక్కెయ్
చల్ పద పద పద పద

చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ

ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ


సుడులుండే సంద్రాన ఎన్నో
మింగేసే సొరచేపలుంటాయ్
ప్రాణంతో చేలాగాటమాడే లోతెంతున్న దూకేయ్
నడిచేటి నీ దారిలోనే
చీరేసే ముళ్ళెన్నోఉంటాయ్
నెత్తురునే చిందింకుంటు గమ్యం చేరాలోయ్
బంతిలో ఉన్న పంతాన్ని చూడలిరా
ఎంత కొడుతుంటె అంతంత లేస్తుందిరా
చుట్టూ కమ్మేసుకొస్తున్న చీకట్లని
చిన్న మిణుగుర్లు ఢీకొట్టి చంపేయ్ వా
నువ్వు... చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ

ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో


గాండ్రించే పులి ఎదురు వస్తే
కళ్ళల్లో కళ్ళెట్టి చూసేయ్
నీ కంట్లో ఎరుపంత చూసి దాని గుండె ఆగిపోదా
చెమటంటే చిందాలికదరా
అనుకుంటే గెలవాలికదరా
భయపడుతూ వెనకడుగు వద్దు
అంతం చూసైరా
అరటిచెట్టంత కత్తెట్టి కోసేసినా
కసిగా మళ్ళి మొలకెత్తి వస్తుందిరా
గాలిపటమేమో గగనాన్ని ఎదిరించదా
దానిలో ఎంత దమ్ముందో చూసావా
నువ్వు... చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ

ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.