సోమవారం, డిసెంబర్ 11, 2017

ఖేలో ఖేలో ఖేలోరే.. డోంట్ స్టాప్...

నాన్నకు ప్రేమతో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాన్నకు ప్రేమతో (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : రఘుదీక్షిత్

ఖేలో ఖేలో ఖేలోరే.. ఖేలో ఖేలో ఖేలోరే..
ఖేల్ ఖతమ్ అయ్యేదాకా డోంట్ స్టాప్ రే..
ఖేల్ ఖతమ్ అయ్యేదాకా డోంట్ స్టాప్ రే..

జీలో జీలో జీలోరే.. జీలో జీలో జీలోరే..
జిందగీని ఈదే దాకా డోంట్ స్టాప్ రే..
జిందగీని ఈదే దాకా డోంట్ స్టాప్ రే..
లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని
వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్
షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని
స్విమ్మింగ్ చేయడం యూ డోంట్ స్టాప్

డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..

వాళ్ళు నిన్ను విసిరేశామని అనుకోని, అనుకోని
వాళ్ళకు తెలియదు నువ్వు ఒక బంతివని, బంతివని
వాళ్ళు నిన్ను నరికేశామని అనుకోని అనుకోనీ
వాళ్ళకు తెలియదు నువ్వు ఒక నీటి ధారవని, ధారవని
వాళ్ళు నిన్ను పాతేశామని అనుకోని అనుకోని
వాళ్ళకు తెలియదు నువ్వు ఒక విత్తనమని, విత్తనమని
విత్తనమై మొలకెత్తు 
విత్తనమై మొలకెత్తు
వరదలాగ నువ్వు ఉప్పొంగు  
వరదలాగ నువ్వు ఉప్పొంగు
హెయ్ బంతిలాగ పైపైకెగురు

డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..

జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు.
మరి ఆ వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు
నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు
గలగల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండే వస్తే విండోస్ అన్నీ మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటూనే 
లైఫ్ అంటే ఇష్టం అంటూనే
కష్టానికి కన్నీరవుతావా 
కష్టానికి కన్నీరవుతావా
ఎదురీతకు వెనకడుగేస్తావా

డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..
డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.