గీతాంజలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పం పం
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం
ఆడేదే వలపు నర్తనం
పాడేదే చిలిపి కీర్తనం
సయ్యంటే సయ్యాటలో హే హే
మా వెనకే ఉంది ఈ తరం
మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీ ఆటలో
నేడేరా నీకు నేస్తమూ రేపే లేదూ
నిన్నంటే నిండు సున్నరా రానే రాదూ
ఏడేడు లోకాలతోనే
బంతాటలాడాలి ఈనాడే
తక తకధిమి తకఝం
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం
పడనీరా విరిగి ఆకసం
విడిపోనీ భూమి ఈక్షణం
మాపాట సాగేనులే హో హో
నడిరేయే సూర్య దర్శనం
రగిలింది వయసు ఇంధనం
మావేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణమూ మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణమూ మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం
మా జోరు చూశాక ఈనాడే
తక తకధిమి తకఝణు
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పం పం
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
తకిట తకిట తకిట తకధిమితక
తకిట తకిట తకిట తకధిమితక
తకిట తకిట తకిట తకధిమితక తాం తాం తాం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.