మనీ చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీ మూర్తి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చక్రవర్తి, చిత్ర
ఆయిలా ఆయిలా ఆయిలాయే...
ఆయిలాయిలాయిలాయిలాయిలాయే...
ఆయిలా ఆయిలా ఆయిలాయే...
ఆయిలాయిలాయిలాయిలాయిలాయే...
లేచిందే లేడికి పరుగు
కూర్చుంటే ఏమిటి జరుగు
తోచిందే వేసెయ్ అడుగు డౌటెందుకూ..
లేడల్లే ఎందుకు ఉరుకు
పడిపోతే పళ్ళు విరుగు
చూడందే వెయ్యకు అడుగు జోరెందుకూ...
మనకన్నా చిన్న వాళ్ళు
మంజ్రేకర్ టెండూల్కర్లు
లేరా మనకెగ్జాంపులూ రా రా రా...
తూటాలా ఫాస్టు బాలు
చూస్తేనే గుండె గుభేలు
మన సత్తా సోసింపులూ సో సిం పులూ...
ఎవరిజాతకం వాడిది సారు
రేఖ లేనిదే నెగ్గరు ఎవరు
రాసి ఉన్నదా చూసుకో గురూ
నేటి స్వీపరే నెక్స్టు స్పీకరు
లక్కుంటే లకీరుతో లక్పతులౌతారు
లైఫంటే నసీబులో స్టారే మాస్టారు
ఆయిలా ఆయిలా ఆయిలాయే...
ఆయిలాయిలాయిలాయిలాయిలాయే...
ఆయిలా ఆయిలా ఆయిలాయే...
ఆయిలాయిలాయిలాయిలాయిలాయే...
తాపీ తాబేలు తీరు ఆపేసే హాల్టు బోరు
టేకాఫే టాపు గేరు నా... నేచరు
కుందేలై గెంతువారు కుదేలయే తీరుతారు
లాకప్ కో హాస్పటల్ కో గెస్టవుదురూ
ట్రైలేద్దాం కొండకొనకు పోయేదేముంది మనకు
ఆఫ్ట్రాలో వెంట్రుక మన స్టేకు హా...హా హా
ఏదో ఒకటుంది తలకు అది కాస్తా తెంచుకోకు
టోటల్ గా సున్నా అయిపోకు గోవిందా గోవిందా
ఇంటలెక్చువల్ లెక్చర్లేల
అడుగు అడుగునా మేధావుల్లా
మైథలాజికల్ పిక్చరులోలా
పొడుగుపొడుగునా పద్యాలేలా
చర్చలతో చెడామడా తర్జన బర్జనలా
జంక్షన్లో ఎడాపెడా అర్జున గర్జనలా
ఆయిలా ఆయిలా ఆయిలాయే...
ఆయిలాయిలాయిలాయిలాయిలాయే...
ఆయిలా ఆయిలా ఆయిలాయే...
ఆయిలాయిలాయిలాయిలాయిలాయే...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.