బుధవారం, నవంబర్ 29, 2017

దిల్ సే కర్నా దిల్ సే చల్నా...

భగీరథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భగీరథ (2005)
సంగీతం : చక్రి
సాహిత్యం : చంద్రబోస్ (??భాస్కరభట్ల, కందికొండ)
గానం : రవివర్మ

దిల్ సే కర్నా దిల్ సే చల్నా
దిల్ దిల్ మిల్కే లడ్నా యారో
నింగిలొ గంగను నేలకు దించీ
నీవే కలియుగ భగీరథవైపో
కనువిప్పితే కాదా జననం
కనుమూస్తే కాదా మరణం
విలువైనది ఆగదు కాలం
గగనానికి వేసేయ్ గాలం
వెయ్ వెయ్ మున్ముందుకు అడుగును
రాసేయ్ సరికొత్తగ చరితను
తీయ్ తీయ్ సమరానికి తెరలను
తీసేయ్ విజయానికి తలుపులు

దిల్ సే కర్నా దిల్ సే చల్నా
దిల్ దిల్ మిల్కే లడ్నా యారో
నింగిలొ గంగను నేలకు దించీ
నీవే కలియుగ భగీరథవైపో 

 
అలుపెరగని అలలాగా
అనునిత్యం తీరం వెతకాలి
వడివడిగా నీ పాదం
నీ లక్ష్యం కోసం నడవాలి
ఓ.. లైఫంటే ఒక ఆశయమేదో ఉండాలి
ఓ.. నీపయనం అటువైపే సాగుతు ఉండాలి
కష్టాలొస్తే రానీ వదిలేయకు గమ్యాన్నీ
కనులే విప్పీ చూడు అరె పడిలేస్తున్నా 
ప్రాణంలేని కడలి తరంగాన్నీ

దిల్ సే కర్నా దిల్ సే చల్నా
దిల్ దిల్ మిల్కే లడ్నా యారో
నింగిలొ గంగను నేలకు దించీ
నీవే కలియుగ భగీరథవైపో 

 
చిరు చినుకే చిత్రంగా ఆ చినుకు చినుకు ఏకంగా
నదివరదై మొత్తంగా ఈ లోకాన్నైనా ముంచేగా
హో.. దమ్ముందీ నీ గుండెల్లోనా మౌనంగా
హో.. మనిషేగా లోకానికి నిలిచే మూలంగా
ఆకాశాన్నే చూడూ ఎదగాలి నువ్వంతా
అనుమానాలే వద్దు ఇక రవ్వంతైనా
దూరాలైనా గమ్యం చేరాలా

దిల్ సే కర్నా దిల్ సే చల్నా
దిల్ దిల్ మిల్కే లడ్నా యారో
నింగిలొ గంగను నేలకు దించీ
నీవే కలియుగ భగీరథవైపో
కనువిప్పుటె కాదా జననం
కనుమూస్తే కాదా మరణం
విలువైనది ఆగదు కాలం
గగనానికి వేసేయ్ గాలం
వెయ్ వెయ్ మున్ముందుకు అడుగును
రాసేయ్ సరికొత్తగ చరితను
తీయ్ తీయ్ సమరానికి తెరలను
తీసేయ్ విజయానికి తలుపులు

దిల్ సే కర్నా దిల్ సే చల్నా
దిల్ దిల్ మిల్కే లడ్నా యారో
నింగిలొ గంగను నేలకు దించీ
నీవే కలియుగ భగీరథవైపో

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.