బుధవారం, నవంబర్ 22, 2017

నీ దారి పూలదారి...

మగమహారాజు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మగమహారాజు (1983) 
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ

నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

ఆశయాలు గుడిగా సాహసాలు సిరిగా
సాగాలి చైత్రరథం వడివడిగా
మలుపులెన్ని వున్నా గెలుపు నీదిరన్నా
సాధించు మనోరధం మనిషిగా
నరుడివై హరుడువై నారాయణుడే నీవై
నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి
నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి


నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి


అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప

కాళరాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే
నీ మండిన గుండెల నిట్టూర్పులలో
చల్లగాలి విసిరే తల్లి చేయి తగిలే
నీకొసం నిండిన ఓదార్పులతో

విజమో విలయమో విధి విలాసమేదైనా
నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి
నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి

నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి


అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా స్వామియే శరణమయ్యప్ప

దిక్కులన్ని కలిసే ఆ ఆ ఆ
దైవమొకటి వెలసే ఆ ఆ ఆ
నీ రక్తం అభిషేకం చేస్తుంటే

మతములన్ని కరిగే మమత దివ్వె వెలిగే
నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే
వీరుడివై ధీరుడువై విక్రమార్కుడు నీవై
నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవశక్తి
నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవశక్తి

నీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.