శుక్రవారం, నవంబర్ 17, 2017

సాహసం నా పథం...

మహర్షి చిత్రంలోని ఒక పవర్ఫుల్ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాసనం దాటటం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా

 
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా


నిశ్చయం నిశ్చలం హహ
నిర్బయం న హయం

కానిదేముంది నే కోరుకుంటే
పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే
కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా 
జారిపోదా ఊహవెంట
నే మనసు పడితే ఏ కలలనైనా
ఈ చిటికే కొడుతూ నే పిలువనా

సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా


అధరని బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమీ మహర్షి

వేడితే లేడి ఒడి చేరుతుందా
వేట సాగాలి కాదా హహ
ఓడితే జాలి చూపేనా కాలం
కాల రాసేసిపోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా
నాకెదురు పడునా ఏ అపజయం

సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాసనం దాటటం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
తకిటజం తరితజం తనతజం జంతజం
తకిటజం తరితజం జంతజం


6 comments:

ఈ సినిమా లో ఆత్రేయ గారు అసలు రాయలేదు. ఈ పాట సీతారామశాస్త్రి గారు వ్రాశారు

థాంక్స్ ఎ లాట్ విద్యాసాగర్ గారు పోస్ట్ లో సరిచేశాను. నాకు వెరిఫై చేయడానికి కాసెట్ కవర్స్ లాంటి సరైన సోర్స్ దొరకక నెట్ లో ఉన్నదే పెట్టేశానండీ. ఈ బ్లాగ్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇటువంటి పొరపాట్లు సరిదిద్దుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

భీరువల్లే పారిపోను...?meaning enti sir..

భీరువు అంటే పిఱికి వాడు లేదా ధైర్యములేనివాడు అని అర్ధమండీ... సో ఆ లైన్ కి పిఱికివాడిలా పారిపోను అని అర్ధము.

ధీరత్వం కి వ్యతిరేక పదం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.