గుడుంబా శంకర్ చిత్రంలోని ఒక మంచి స్పూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.
చిత్రం : గుడుంబా శంకర్ (2004)
రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ
గానం : కె.కె.
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టేయాలి లేలే
గొడుగల్లే పనిచెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పనిపట్టాలి లేలే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచెయ్యాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలే చూపాలే...
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది
చెడ్డోళ్లకి చెడు చేయడమే మంచి
చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడివుంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంది కుడివుంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైనా గమ్యం ఒకటేలే
బ్రతుకుంది చావుంది
చచ్చేదాకా బ్రతుకుంది
చచ్చాకా బ్రతికేలాగ బ్రతకాలే
లే లే లేలే ఇవ్వాళే లేలే
లే లే లేలే ఈరోజల్లే లేలే
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.