గోదావరి సినిమాలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గోదావరి (2006)
రచన : వేటూరి
సంగీతం : కే. ఎం. రాధాకృష్ణన్
గానం : శంకర్ మహాదేవన్, చిత్ర
విధి లేదు తిధి లేదు ప్రతి రోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇక
గురి లేనిదే నీ బాణమింక చేరుకోదు ఎరా
ప్రతి రోజు నీకొక పాఠమే చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైనా రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
2 comments:
నచ్చిన పాటల్లో ఇదీ ఉంది.
థాంక్స్ ఫర్ ద కామెంట్ నందిని గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.