సోమవారం, నవంబర్ 20, 2017

అనుకుంటే కానిది ఏమున్నది...

ఔనన్నా కాదన్నా చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటను ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఔనన్నా కాదన్నా (2005) 
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్

అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది
చలి చీమే ఆదర్శం పని కాదా నీ దైవం
ఆయువే నీ ధనం ఆశయం సాధనం
చేయరా సాహసం నీ జయం నిశ్చయం

అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది


చిలిపి బాలుడనుకుంటే చిటికెనేలు అనుకుంటే
కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం
సీత కానీ లేకుంటే చేతకాదు అనుకుంటే
విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం
మనసుంటే కనపడదా ఏదో మార్గం
కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం
ఓరిమే నీ బలం లోకమే నీ వశం
చేయరా సాహసం....నీ జయం నిశ్చయం
 
రాయి లాగ కూర్చుంటే కాలు కదపలేనంటే
ఎప్పటికి రాదుగా ఊహలకో రూపం
బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే
భయపడక వెలిగించెయ్ నెత్తురుతో దీపం
యే చీకటి ఆపును రా రేపటి ఉదయం
యే ఓటమి ఆపును ర రాగల విజయం
కాలమే నీ పధం కోరికే నీ రధం
చేయరా సాహసం.. నీ జయం నిశ్చయం.

అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది 

 

1 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.