గమ్యం చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : గమ్యం (2008)
సంగీతం : ఈ. యస్. మూర్తి
సాహిత్యం : ఈ. యస్. మూర్తి
గానం : నోయల్, రంజిత్
Getup baby getup getup getup get up
baby getup getup getup getup getup
Go go go go Gamyam Go go go go Gamyam
U never know how to love the game
U never know how to worship the game
Until you know to love yourself
Love your soul you'll love yourself common
One way One way జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదేమరి
సాగిపొయే ప్రయాణం
runway లాంటిది కాదుగా ఇది
ఎన్నో ఎన్నో మలుపులున్నది
ఎగుడు దిగుడు చూసుకోదిది
పరుగు తీసే ప్రవాహం
నీ దారిలోన నవ్వు
చిలకరించే మల్లెపువ్వులెన్నో
తీయతీయగానే నిన్ను
గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృష్టి లో రహస్యం
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
It's a wonderful world you got to feel the joy
అంతుతేలని సృష్టి లో రహస్యం
Don't be a fool don't be money's toy
One way One way జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదేమరి
సాగిపొయే ప్రయాణం
Freak it..
జగమే ఒక మాయ బ్రతుకే ఒక మాయ
అని అన్నది ఎవరో అది విన్నది ఎవరో
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా
ఒక్క చూపుకై బ్రతికే ఆ మాయలో హాయి లేదా
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి
బదులు ఎవ్వరు చెప్పలేరుగా
అందుకే నేటి రోజే నీది
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నది యవ్వనం
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నది యవ్వనం
తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు
తను వెళ్ళే చొటే తెలుసా మరి తనకు
నిన్న అన్నదిక రాదు
గతమంటె ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు
కలలాంటిదే కదా మనకు
ఎన్ని వేల చిరు వేషాలో
కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచేలోగా
మారిపోతుంది నాటకరంగం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం
One way One way జీవితానికి
ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదేమరి
సాగిపొయే ప్రయాణం
నీ దారిలోన నవ్వు చిలకరించే
మల్లెపువ్వులెన్నో
తీయతీయగానే నిన్ను
గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృష్టి లో రహస్యం
ఎంత వింతని తెలుసుకో ప్రపంచం
అంతుతేలని సృష్టి లో రహస్యం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.