గురువారం, నవంబర్ 23, 2017

నా పయనం అలుపు తెలియక...

జ్ఞాపకం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జ్ఞాపకం (2007)
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : వరికుప్పల యాదగిరి
గానం : కార్తీక్

నా పయనం అలుపు తెలియక
సాగునులే అడుగు తొణకక
చిమ్మని చీకటి కమ్మేసి దారి దాచేస్తున్నా
గాలీ వానా చుట్టేసి దాడి చేసేస్తున్నా
ఆ గమ్యం నా చేరువగా చేరనిదే
నాలో రగిలే రాగం ఆగేనా
పొగిలే గానం మారేనా
ఎదలో దాహం తీరనిదే

నా పయనం అలుపు తెలియక
సాగునులే అడుగు తొణకక

నాకోసం నేనున్నానన్నది నాలో ధైర్యం
నను నడిపించే నేస్తం ఉప్పొంగే ఆనందం
నాతోనే నీడగ నడిచొస్తున్నది నా ఆరాటం
నను గెలిపించే వరకూ విడిపోనన్నది పంతం
తలచినదేది ఐనా గానీ కష్టాలే ఎదురైరానీ
కాదు పొమ్మని అనని వెనుతిరిగొస్తానా 
దూరం ఎంతగ ఉన్నా...

నా పయనం అలుపు తెలియక
సాగునులే అడుగు తొణకక

నేనంటే నాకెంతో ఇష్టం ఈ లోకంలో
దేవుడికైనా గానీ నా తర్వాతే స్థానం
నా చుట్టూ ఎవరేమనుకున్నా వెరవని తత్వం
నా ఆలోచన ఒకటే ఆ సమయంలో వేదం
వదలను ఆట మొదలెడితే
గెలవాలని అనుకుంటే
నను ఆపే శక్తి ఉన్నాగానీ ఆగిపోనులే..
లక్ష్యం చేరే వరకూ...

నా పయనం అలుపు తెలియక
సాగునులే అడుగు తొణకక
చిమ్మని చీకటి కమ్మేసి దారి దాచేస్తున్నా
గాలీ వానా చుట్టేసి దాడి చేసేస్తున్నా
ఆ గమ్యం నా చేరువగా చేరనిదే
నాలో రగిలే రాగం ఆగేనా
పొగిలే గానం మారేనా
ఎదలో దాహం తీరనిదే


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.