శ్రీ ఆంజనేయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి
రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కలా మనిషీ
తై దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ….
తై దిదితై దిదితై దిదితై
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసీ
అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా
ఆ రామగాథ నువు రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ….
తై దిది తరికిటతోం- తరికిటతోం తరికిటతోం తత్తోం
తికామక తిక తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
1 comments:
తికమక మకతిక పరుగులు
చకచక నడవర నటునుటు చపలత వలదోయ్ !
తకిటధిమి, ధిమితకిట తధి
మి కిట తధిమి రమణునిట నమితముగ గనుమా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.