బాణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బాణం (2009)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వనమాలి
గానం : శంకర్ మహదేవన్
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం
ఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశం
ప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగా
నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తియమనదా
చెరగదే జ్ఞాపకమేదైనా
పసితనం దాటిన ప్రాయాన
సమరమే స్వాగతమిచ్చేనా
కలగనే ఆశయమేదైనా
బతుకులో ఆశలు రేపేనా
ఇపుడిలా నీ దరి చేరేనా
ఎదను తాకే గాయాలు
తాగే నేస్తాలు నీలో
ఎదురు చూసే కాలాలు
పూసే చైత్రాలు నీ దారిలో
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
వెలుగయే వేకువలెన్నైనా
వెతికితే లేవా నీలోనా
జగతికే దారిని చూపేనా
గగనమే నీ తొలి మజిలీనా
గమనమే ఓ క్షణమాగేనా
విజయమే నీడగ సాగేనా
అలలు రేపే సంద్రాలు
దూకే సైన్యాలు నీలో
చెలిమి కోరే లోకాలు
చేసే స్నేహాలు ఈ వేళలో
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.