శనివారం, జూన్ 30, 2018

అడిగిందానికి చెప్పి...

ఇల్లరికం చిత్రంలోని ఒక సరదా నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  ఇల్లరికం (1959)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

అడిగిందానికి చెప్పి... ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా... ఓహో చిన్నదానా

అడిగిందానికి చెబుతా... ఎంతైనా పందెం గడతా
నిల్చెదనోయి గెల్చెదనోయి... ఓహో చిన్నవాడా


ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
ఒంటికాలిపై నుండి హఠయోగ ముద్రలోనుండి
గుట్టుగ తన పని సాధించునది... వివరిస్తావా ఏదది?

అడిగిందానికి చెప్పి... ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా... ఓహో చిన్నదానా

ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
ముక్కు మూరెడే యౌను అది కొక్కొకొమని గొణిగేను
కొంగ జపమని ప్రసిద్ధియేను.. ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్‌ గెల్చెదమోయ్‌ ఓహో చిన్నవాడా

 
వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
వాయు వేగమున మించి లోకాలన్నీ గాలించి
గడియలోననే ఉన్న చోటకే వడిగా చేరేదేదది
అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

రాకెట్టని అనుకోను అది స్పూత్నిక్కని అనలేను
రాకెట్టని అనుకోను అది స్పూత్నిక్కని అనలేను
ముమ్మాటికి అది మనసేను ఇక.. ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెబుతాం ఎంతైనా పందెం గడతాం
నిల్చెదమోయ్‌ గెల్చెదమోయ్‌ ఓహో చిన్నవాడా


దానమిచ్చి చెడె నెవ్వడు

కర్ణుడు... కర్ణుడు

తప్పు తప్పు బలి చక్రవర్తి

హేయ్‌ బలిచక్రవర్తి

జూదానికి నిపుణుండెవ్వడు

ధర్మజుడు... ధర్మజుడు

తప్పు తప్పు శకుని.. హేయ్‌ శకుని

అన్నదమ్ముల పోరాటంలో
సందు చూచుకుని కూల్చిందెవడు

భీముడు... భీముడు

తప్పు తప్పు రాముడు

హేయ్‌ రాముడు..
శ్రీరాముడు.. శ్రీ రాముడు 


శుక్రవారం, జూన్ 29, 2018

సెలయేటి జాలులాగా...

శాంతి నివాసం చిత్రంలోని ఒక చక్కని నృత్యరూపకాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శాంతి నివాసం (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల జూనియర్    
గానం : పి.లీల

సెలయేటి జాలులాగా చిందేసే లేడిలాగా
సరదాగా గాలిలోన తేలిపోదామా
మనమూ సోలిపోదామా


నిన్ను జూసి నింగిలోన మబ్బునౌతానే
నేను మబ్బునౌతానే
నిన్ను జూచి నాట్యమాడే నెమలినౌతానే
నేను నెమలినౌతానే
సనసన్నా జల్లై అలా నీపై రాలనా
సనసన్నా జల్లై అలా నీపై రాలనా
చినుకుల్లో సంబరాన నేనాడనా

సెలయేటి జాలులాగా చిందేసే లేడిలాగా
సరదాగా గాలిలోన తేలిపోదామా
మనమూ సోలిపోదామా


ఆమని దాసినీ
తొలి ఆమని దాసినీ

మనమున వనమున
మధురిమ విరియ
ఆమని దాసినీ
తొలి ఆమనీ దాసినీ

కలికీ వాలుకనుల
కులికే వయసు కలలా
కలికీ వాలుకనుల
కులికే వయసు కలలా
లలిత రీతుల పలికే కోయిలా
ఆలపించే మధుగీతి

ఆమని దాసినీ
తొలి ఆమని దాసినీ


సొగసూ వలకబోసే
వగల సిరులు జూసీ
సొగసూ వలకబోసే
వగల సిరులు జూసీ
వలపు పాటలా తేనె మాటలా
వలలు వేసే యలతేటి

ఆమని దాసినీ
తొలి ఆమని దాసినీ 

 

గురువారం, జూన్ 28, 2018

మధురా నగరిలో...

అభిమానం చిత్రంలో సావిత్రమ్మ అభినయించిన ఒక చక్కని నృత్య రూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభిమానం (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల జూనియర్    
గానం : సుశీల

కొంగు లాగెదవేలరా కొంటె కృష్ణ
కొంగు చాటున కలరులే దొంగవారు
దోస మొనరించు వారిని త్రోసిపుచ్చి
ఏమి నేరని వారిని ఏచ తగునే

మధురా నగరిలో చల్ల నమ్మ బోదు
దారి విడుము కృష్ణా.. కృష్ణా..
మధురా నగరిలో చల్ల నమ్మ బోదు
చల్లనమ్మా బోదు..
దారి విడుము కృష్ణా.. కృష్ణా..

మధురా నగరిలో చల్ల నమ్మ బోదు
దారి విడుము కృష్ణా.. కృష్ణా..


మాపటి వేళకు తప్పక వచ్చెద
మాపటి వేళకు తప్పక వచ్చెద
పట్టకురా కొంగు గట్టిగాను కృష్ణా

మధురా నగరిలో చల్ల నమ్మ బోదు
దారి విడుము కృష్ణా.. కృష్ణా..


కొసరి కొసరి నాతో సరసము లాడకు
కొసరి కొసరి నాతో సరసము లాడకు
కొసరి కొసరి నాతో సరసము లాడకు
రాజమార్గమిది కృష్ణా
వ్రజ వనితలు నను చేరగ వత్తురు
విడు విడు నా చెయ్యి కృష్ణా

మధురా నగరిలో చల్ల నమ్మ బోదు
దారి విడుము కృష్ణా.. కృష్ణా..


చెక్కిలిపై నొక్కులేమె చెల్లలా
చెదెరెనేమో ముంగురులు చెల్లెలా


పయ్యెద పైనా కమ్మ కస్తూరీ తిలకమేమె చెల్లెల
జారుసిగలో జాజి పువ్వులూ వాడినవేమే ఛెల్లెలా
అల్లన చేరె నల్లని వాని తొలి వలపూ చిన్నెలటే చెల్లెలా

చెక్కిలిపై నొక్కులేమె చెల్లలా
చెదెరెనేమో ముంగురులు చెల్లెలా  


బుధవారం, జూన్ 27, 2018

పరుల మేలు కోరి...

పెళ్ళికాని పిల్లలు చిత్రంలోని ఒక చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళి కాని పిల్లలు (1961)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆరుద్ర      
గానం : ఈశ్వరి, లత

పరుల మేలు కోరి గరళమ్ము భుజియింప
ప్రాణనాధు బాధ కానజాల
సత్వరమ్ము పతికి చలువ గూర్చెడు రీతి
తెల్పరేల కోటి వేల్పులార

ఎవరివే నీ వెవరివే
శివుని తలపై చెంగలించే
యువతిరో నీ వెవరివే

గంగనే శివగంగనే
సురలు పంపగ గరళ కంఠుని
శిరసుపై నెలకొంటినే

ఘనత గలదాననే ఎనలేని
ఘనత గలదాననే
కలికీ మహిమలు కావించ గలనే
కయ్యాన వయ్యారి కలహించ వలదే

నీతో పోటీకి నే రాలేదే
నెలతా నావిధిని వారించవలదే
ఘనత గల దాననే ఎనలేని
ఘనత గల దాననే


మంగళవారం, జూన్ 26, 2018

ఒకడు కావాలి...

మనుషులు మమతలు సినిమాలో ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనుషులు మమతలు (1965)
సంగీతం : టి.చలపతిరావు  
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి      
గానం : జానకి

ఒకడు కావాలి
అతడు రావాలి
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
ఒకడు కావాలి

అందము చిందెడు ఆనందమైనవాడు
నవ్వులు పువ్వులుగా తవ్వి పోయువాడు
వెచ్చని కౌగిలిలో విందు చేయువాడు
బలే మొనగాడు జతగాడు నా వాడూ

ఒకడు కావాలి
అతడు రావాలి
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
ఒకడు కావాలి

తీయని ఊహలతో తేలిపోవువాడు
తీరని కూరిమితో చేరదీయువాడు
చల్లని చూపులతో మనసు లాగువాడు
బలే మొనగాడు సరిజోడు నావాడూ

ఒకడు కావాలి
అతడు రావాలి
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
ఒకడు కావాలి 

సోమవారం, జూన్ 25, 2018

సతీ సావిత్రి...

సతీ సావిత్రి కథ తెలియని తెలుగువారు ఉండరేమో అనడం ఎంత నిజమో అందులో చాలా మందికి ఈ నాటకం ద్వారానే తెలిసి ఉండచ్చు అనేది కూడా అంతే నిజం. ఎన్టీఆర్ సావిత్రి నటించిన ఈ నాటకం తెలుగునాట అంతగా ఫేమస్ అయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్    
గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకం

ఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్
గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడే
 

  
ఓహోహోహో.. ఏమి ఆశ్చర్యమూ
భహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క
అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు
ఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగా

సావిత్రీ ! మానినీ ఆహ్హ్హహ్హహ్హహ్హహ్హహ్హ
నిర్నిమిత్త సందేహడోలాయ మానసవై
ఏల అట్లు దిగాలున చూచుచుంటివి
సామాన్య మనీషాగోచరంబైన
మద్రూప విశేషంబు గాంచియే
నేనెవ్వరో యూహించి ఉండజాలుదువు
ఐనను వచించెద

క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు
ఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాక
వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు
నాలుగు మూడైన అగునుగాక
పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు
తాళము తప్పిన తప్పుగాక !
చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ
పలికినా అపశృతుల్ పలుకుగాక

సకల లోకాల ధర్మశాసనము నమలు
చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానె
వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి
మోసికొని పోవుచుండు యముండ - అబలా !

సావిత్రీ ! ఇదిగో నీ పతి ప్రాణంబుల్ గొనిపోవుచున్నాడ

అయ్యో ! అయ్యో ! ఆ!
నాథా ! నాథా ! 

 
హ్హహ్హహ్హ మహిషరాజమా మరలుము
  
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !
సుంతయేని కరుణ మాని
సుంతయేని కరుణ మాని
కాంతుని ప్రాణములను గొని
పోవుచున్నావా !


ఆహా ! ఏమీ ఈ సాధ్వీలలామ సాహసము
దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతముశైవించి
నన్ననుసరించు ఈమె స్థైర్యము సంస్తవనీయమైననూ..
అహో.. నిష్ప్రయోజనమే... కనుక.. చెప్పి చూచెదను గాక

కాలు మోపిన చాలు కస్సని అరికాలు
కోసుకుపోయెడి కూసురాళ్ళు
అలికిడైనను చాలు అదరి బుస్సున లేచి
పడగెత్తి పైబడు పాపరేళ్ళు
అడుగుపెట్టిన చాలు ఒడలు జిల్లున లాగి
నరములు కుదియించు నదుల నీళ్ళు
గాలి దోలిన చాలు కదలి ఘీ..యని కర్ణ
పుటములు ప్రేల్చెడి ముది వెదుళ్ళు

పులులు సింహాలు శరభాలు పోవ పోవ
కటిక చీకటి కనరాదు కాలిదోవ
మరలిపొమ్మిక విడువుము మగని ఆశ
మాట వినవేల ఓ బేల మరలవేలా..ఆఆ...

పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
నా వెంట రా తగదు రావలదు రా తగదు రావలదు
పోపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
లబోదిబోమని అఘోరించినా
లబోదిబోమని అఘోరించినా
ఫలితము సున్న మరలుము మెదలక
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ 

 
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !


ఆహా ! ఏమి ఈ బాల అచంచల మనఃస్థైర్యమూ
దుర్గమ కీకారణ్య సీమలనధిగమించుటయే గాక
మహోన్నత పర్వత శిఖరాగ్రమ్ముసైతమధిరోహించి
నన్ననుసరించుచున్నదే హొహ్హో మరియునూ
మరికొంచెము బెదరించి చూచెదను గాక

చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
సముండను పాశధరుండను
కాల యముండను ఆహ్హహ్హహ్హహ్హ...
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ ఫో..


ఆహో.. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా
బేలా సావిత్రీ ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిది
గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు
అరంఘనీయమైన వైతరణి అల్లది 

అన్నియునూ తెలిసిన ధర్మ వేదులుమీరు
ఇంత దూరమేతెంచి రిక్త హస్తములతో తిరిగి పొమ్మందురా
 
 
మరి ఏమందును... హ్మహుహు ఇదియునూ నిక్కంబు
కనికరించి ఏదైనా ఒక్క వరంబునొసంగి పంపెద
సాధ్వీ నీ కార్యదీక్షతకు కడుంగడు సంతసించితి
నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా
మరొక్క వరంబు కోరుకొనుము ఇచ్చెద

ఈ యముని కర్కశ హృదయంబు
కూడా కరుగుచున్నట్లున్నది
ఇచ్చిన అవకాశమేల జారనీయవలె
స్త్రీలకు పుట్టినింటికన్నను మెట్టినిల్లే
ప్రధానమని కదా ఆర్యోక్తి

యమధర్మరాజా ఆ! రాజ్య భ్రష్టులై అంధులై
కారడవులందు కటకటంబడు మా అత్తమామలకు 
  సరియ సరియ రాజ్య ప్రాప్తియూ నేత్ర దృష్టియూ
రెండునూ ఒసంగితిని పొమ్ము

ఆ ! వదలక వచ్చుచున్నదే
ఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను
మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా
కనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించి
ఊరడించి మరలించెద
సావిత్రీ అబలవన్న ఆదరంబున
ఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభున
మరొక్క వరంబీయ ఇచ్చగించితీ
అదియును నీ పతి ప్రాణంబు దక్క

ఆ ! ఇప్పుడు దారిన పడినాడు
ఈ అవకాశమును మాత్రమేల పోనీయవలె
కన్నవారి ఋణము తీర్చెద

సమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అని
అలమటించు నా జనకునకు
 

ఆ! ఇక చాలు బాబోయ్ అను అటుల
సుతశతంబనుగ్రహించితి
సంతుష్టవై మరలిపొమ్ము 

ఒకటి నే కోరితి రెండు నీవిచ్చితి
ముచ్చటగా మూడవ కోర్కె
చెల్లించకుండుట పాడియే ధర్మమూర్తీ 

 
ఊ ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే
ఐనను ఆఖరి కోరికని వాపోవుచున్నది ఇచ్చి పంపెద
సావిత్రీ స్వామీ అడుగుము
అదియును నీ పతి ప్రాణంబు దక్క

సంతానమును చూసియైనను
సంతసించు భాగ్యమును ప్రసాదింపుము

ప్రసాదించితిని పొమ్ము.. ఊ !
ఇంకెక్కడికి పోయెదవు
ఏమీ ! నా పతి ప్రాణంబులీయక
అడుగు వేయలేవు 
 
ఏమీ అడుగువేయలేనా 
మహిషరాజమా.. ఊ !..

ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష 

యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననూ.. 
విలయ రుద్రుని ప్రళయ తాండావ ఘోష విన్ననూ 
నెమరాపక అడుగు తప్పక తలతిప్పక ముందుకు సాగిపోవు 
నా మహిషరాజము నేడేలనో తత్తరపాటున బిత్తరపోవుచున్నదే...

హహహహహహహ..

ఊ... నీవు సాధ్వీయే అనుకొంటిని ఇంద్రజాలవు కూడానా
 

ఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే  

 ధర్మబద్ధమా... నాకు తెలియని ధర్మమా
యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా ఎటుల  

అమరులెటులైన సంతాన మందవచ్చు
మనుజ లోకాన సాధ్వులు మగడు లేక
పుత్రసంతాన మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !
 


ఆహా ! పతివ్రతా శిరోమణి యన్న వాత్సల్యంబున వచ్చియుంటిని 

కాని ఇంతటి తెలివి గలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుండెడి 
వాడను కదా గతంబునకు వగచి ప్రయోజనంబేమి కనుక
 

సాధ్వీ సావిత్రీ నీ పతి భక్తికి సమయస్ఫూర్తికీ
కడుంగడు సంతసించితి ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము హహహ


యముడంతవానినే తికమక బెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్ధము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించి తదనంతరంబున నా లోకంబున అహ్హ! కాదు కాదు స్వర్గ లోకంబున జేరి 
తరింతురు గాక తరింతురు గాక తరింతురు గాక



ఆదివారం, జూన్ 24, 2018

శ్రీ గౌరి శ్రీ గౌరియే...

గంగమ్మ ఆ శివయ్య శిరమెక్కి నాట్యమాడినా కూడా శ్రీ గౌరి శ్రీ గౌరియే అని కీర్తించే ఈ చక్కని నృత్యరూపకం విచిత్ర దాంపత్యం చిత్రం లోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం : అశ్వథ్ధామ   
సాహిత్యం : సి.నారాయణరెడ్డి     
గానం : సుశీల 

శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే

సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి
సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి

పరమేశునికై తపియించి

పరమేశునికై తపియించి
ఆ హరు మేన సగమై పరవశించిన

శ్రీ గౌరి శ్రీ గౌరియే 
 
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి


సురలోకమున తాను ప్రభవించినా
తరళాత్మయైనది మందాకిని

ఒదిగి ఒదిగి పతి పదములందు
నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతి సిగను దూకి
నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి
చలిత జీవన తరంగ రంగ గంగ
ధవళాంశు కీర్తి గౌరి
నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన
భువనాంతమైన
క్షతి యెరుగని
మృతి యెరుగని నిజమిది
శ్రీ గౌరి శ్రీ గౌరియే.. 


శనివారం, జూన్ 23, 2018

నలుగురు నవ్వేరురా...

కన్నయ్య చిలిపి అల్లర్లని వద్దని అనలేకా కావాలని నలుగురిలో అల్లరిపాలు కాలేక ఆ నల్లనయ్యకి ఈ గోపెమ్మ విన్నపాలేమిటో ఈ చక్కని నృత్యరూపకం ద్వారా మనమూ విందామా. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర కుటుంబం (1969)
సంగీతం : టి.వి.రాజు   
సాహిత్యం : సి.నారాయణరెడ్డి    
గానం : సుశీల

నలుగురు నవ్వేరురా స్వామీ
నలుగురు నవ్వేరురా గోపాల
నడివీధిలో నా కడకొంగు లాగిన
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా.. అవ్వ..
నలుగురు నవ్వేరురా..

చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్ళూ మూసి
చల్లచిలికే వేళ... చల్లచిలికే వేళ..
చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్ళూ మూసి
ఒంటిగ యేమన్నా... ఆఆఅ...ఆఆఅ..
ఒంటిగ యేమన్న ఊరకుంటిని గాని
రచ్చపట్టున నన్ను రవ్వచేయ పాడికాదులే

నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆఆఅ...
నలుగురు నవ్వేరురా...

పొన్నచెట్టున చేరి పొంచినట్టుల కాదు
చీరెలను కాజేసి కేరినట్టుల కాదు
పొన్నచెట్టున చేరి పొంచినట్టుల కాదు
చీరెలను కాజేసి కేరినట్టుల కాదు
కన్నెమనసే వెన్న గమనించరా కన్న
అన్ని తెలిసిన నీవె ఆగడాలు సేయనేల ఔరా

నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆఅ..ఆఅ.
నలుగురు నవ్వేరురా.. అవ్వ
నలుగురు నవ్వేరురా...ఆఆఅ..




శుక్రవారం, జూన్ 22, 2018

తెలుగు జాతి మనది...

విశాలాంధ్రను అభిలషిస్తూ రూపొందించిన ఓ చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తల్లా పెళ్ళామా (1970)
సంగీతం : టి.వి.రాజు    
సాహిత్యం : సి.నారాయణరెడ్డి     
గానం : ఘంటసాల

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చాడన్న
వచ్చిండన్న వచ్చాడన్న
వరాల తెలుగు ఒకటేనన్న

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమెవరిది
పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమెవరిది
 మూడు కొండ్రలూ కలిపి దున్నిన
ముక్కారు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలూ
ఐదుకోట్ల తెలుగువారిది.

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ
నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపులందుకొని
సత్యాగ్రహాలు చేశాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట
స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి
ధీటే లేదనిపించాము

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు వుంటె
ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటె
కనుగ్రుడ్డు పెరికి వేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను
పగలగొట్టవద్దు
పాలు పొంగు మన తెలుగు గడ్డను
పగలగొట్టవద్దు

నలుగురిలో మన జాతి పేరును
నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది 

గురువారం, జూన్ 21, 2018

వెన్నెలరేయి చందమామ...

వెన్నెల రాత్రి ఈ యువ జంట ఆడుకునే కబుర్లేమిటో మనమూ విందామా, రంగులరాట్నం చిత్రంలోని ఈ చక్కని పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగులరాట్నం (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు   
సాహిత్యం : కొసరాజు    
గానం : బి.గోపాలం, జానకి   

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది

తీరిచి వెన్నెల కాయువేళ
దోరవయసులో పిల్లా
నీకాలాగే వుంటది
మనసాలాగే వుంటది.

చల్లని గాలి తోడురాగా
సైగలతో నువు చూడగా
కనుసైగలతో వలవేయగా
గుండెలదరగా నీతో చాటుగా
గుసగుసలాడగ సిగ్గౌతున్నది

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది

నడకలతోటి వియ్యమంది
నవ్వులతో నను పిల్వగా
చిరునవ్వులతో పక్క నిల్వగా
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు
చిన్నబుచ్చుకొని చిత్తైపోవటే

తీరిచి వెన్నెల కాయువేళ
దోరవయసులో పిల్లా
నీకాలాగే వుంటది
మనసాలాగే వుంటది.

తీయ తీయగా సరసమాడి
చేయి చేయి కల్పుతూ
మన చేయి చేయి కల్పుతూ
మాటలతో నువు మత్తెక్కించితే
మనసే నాతో రాలేనన్నదోయ్

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది


బుధవారం, జూన్ 20, 2018

చిరునవ్వుల కులికేరాజా...

అమాయకురాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు   
సాహిత్యం : కొసరాజు    
గానం : సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి  

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

కనకానికి లొంగనివాణ్ణీ
కాంతంటే పొంగనివాణ్ణీ
కనకానికి లొంగనివాణ్ణీ
కాంతంటే పొంగనివాణ్ణీ
ముచ్చటైన ముద్దుల గుమ్మ
మోజుదీర వలచిందయ్యా
చేతిలోన చెయి వేయమంది
చెప్పినట్టు వినుకోమంది 
బుద్ధి కలిగి ఉండకపోతే
బుగ్గపోట్లు తింటావంది

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

అంతస్థులు చూడకుండా
ఐశ్వర్యం ఎంచకుండా
అంతస్థులు చూడకుండా
ఐశ్వర్యం ఎంచకుండా
చక్కనైన నడవడి చూచీ
చల్లని మనసిచ్చాడమ్మా
హజంతోటి నడిచావంటే
చులకనగా చూశావంటే
మడత చపాతీలు వేసి
బడితె పూజ చేస్తాడమ్మా

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

మా కష్టం తెలిసిన బాబు
నీ జతగాడయినాడమ్మా
చిలకా గోరింకల్లాగ
కిలకిలమని కులకండమ్మా
సరసాల్లో గుమ్మయిపోయి
జలసాల్లో చిత్తయిపోయి
మమ్ముకాస్త మరిచారంటే
దుమ్ము దులిపి వేస్తామయ్యో

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

మంగళవారం, జూన్ 19, 2018

ఔనంటారా మీరు కాదంటారా...

లోకం పోకడలను యువతరం తీరును ఎండగట్టి, స్వతంత్ర భారతంలో ప్రజలెలా మెలగాలో తెలియజేసే ఈ చక్కని నృత్యరూపకం మాంగళ్యబలం చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాంగళ్యబలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు  
సాహిత్యం : కొసరాజు   
గానం : పి.లీల, సుశీల

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా
ఏమంటారు వట్టి వాదంటారా
పేరుకు మాత్రం మీరు పెద్దమనుషులంటారు
ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

ముత్తాతల అర్జనతోటి మొనగాళ్ళుగ పోజులు వేసి
ముత్తాతల అర్జనతోటి మొనగాళ్ళుగ పోజులు వేసి
సూటు బూటు నీటుగ తొడిగి సొత్తంతా క్షవరంచేసి
కష్టం తెలియక గాలికి తిరిగే కబుర్ల రాయుళ్ళున్నారంటే


ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

ఎంతెంతో ఆశ్రయించి నయమ్ముగ జనులను మురిపించి
ఎంతెంతో ఆశ్రయించి నయమ్ముగ జనులను మురిపించి
బలే బలే పదవుల సాధించి హుషారుగ పైసా గడియించి
ప్రజలంటే మరచి తమ స్వార్థంచూచే 
ప్రజావంచకులు వున్నారంటే

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

ఎన్నెన్నో ఆశలతోటి ఉన్న ఆస్థి బేరంపెట్టి
ఎన్నెన్నో ఆశలతోటి ఉన్న ఆస్థి బేరంపెట్టి
తలిదండ్రులు పంపబట్టి సరదాగా సిగరెట్ పట్టి
కాఫీ హోటల్ ఖాతాబెడుతూ 
చదువుకు సున్నా చుడతారంటే

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

డాబైన వేషమేసి పసందుగ టీపార్టీల్ చేసి
డాబైన వేషమేసి పసందుగ టీపార్టీల్ చేసి
పైవాళ్ళను జేబులోన వేసి ప్రజాధనమంతా భోంచేసి
మోసాలు చేసి జగమంత రోసి 
పెనుముద్రపడ్డ ఘనులున్నారంటే

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

త్యాగం చేసి సంపాదించిన
స్వతంత్ర ఫలితం పొందాలంటే
జనసామాన్యం సమానమ్ముగ
సౌఖ్యంతో తులతూగాలంటే
స్వలాభాన్ని విడనాలండి
జాతికి ప్రాణం పోయాలండి
దీక్షబట్టి పని చెయ్యాలండి
దేశ గౌరవం పెంచాలండి


ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా  


సోమవారం, జూన్ 18, 2018

భారతవీరా ఓ భారతవీరా...

భారత యువతకు చక్కని సందేశమిచ్చే ఈ నృత్యరూపకం భలే రాముడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలేరాముడు (1956)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  
సాహిత్యం : సదాశివ బ్రహ్మం  
గానం : పి.లీల, బృందం

భారతవీరా ఓ భారతవీరా
భారతవీరా ఓ భారతవీరా
లేరా మేల్కొనవేరా సోదరా భారతదేశం నీదేరా
భారతదేశం నీదేరా ఈ భారతదేశం నీదేరా

ఓ భారతవీరా
ఓ భారతవీరా ఓ భారతవీరా

స్వతంత్ర భానుడు ఉదయించె స్వతంత్ర వాయువు ప్రసరించె
స్వతంత్ర భానుడు ఉదయించె స్వతంత్ర వాయువు ప్రసరించె
ప్రపంచమంతా అఱ్ఱులెత్తి నిను పరికిస్తోందీ ఆశ్చర్యముగా
ప్రపంచమంతా అఱ్ఱులెత్తి నిను పరికిస్తోందీ ఆశ్చర్యముగా

ఓ భారతవీరా
ఓ భారతవీరా ఓ భారతవీరా
 

నడుము కట్టి మున్ముందుకు నడిచి నడిపించాలి దేశాన్ని
నడిపించాలీ దేశాన్నీ నడిపించాలీదేశాన్ని
వడివడిగా సిరి వర్ధిలజేసి సడలించాలి దరిద్రాన్ని  
 సడలించాలి దరిద్రాన్ని సడలించాలి దరిద్రాన్ని
గంగ యమున గోదావరికృష్ణా మహానదులు మరలించాలి 
మహానదులు మరలించాలి మహానదులు మరలించాలి
పొంగి సస్యశ్యామలమై భువి బంగారమె పండించాలి 
భువి బంగారమే పండించాలి భువి బంగారమే పండించాలి

ఓ భారతవీరా
ఓ భారతవీరా ఓ భారతవీరా

యంత్రాగారపు పొగగొట్టాలు అంతరిక్షమున కందాలి
యంత్రాగారపు పొగగొట్టాలు అంతరిక్షమున కందాలి
అంతులేని వృత్తి వుద్యోగాలందరికీ కల్పించాలి
అంతులేని వృత్తి వుద్యోగాలందరికీ కల్పించాలి
శాంతి సత్యముల శరణ్యములని యీ జగమంతా చాటాలి
యీ జగమంతా చాటించాలి యీ జగమంతా చాటించాలి
భారతమాతా ప్రపంచమునకే తలమానికమనిపించాలి
భారతమాతా ప్రపంచమునకే తలమానికమనిపించాలి
భారతమాతా ప్రపంచమునకే తలమానికమనిపించాలి


భారతవీరా ఓ భారతవీరా ఓ భారతవీరా 

 

ఆదివారం, జూన్ 17, 2018

మొక్కజొన్న తోటలో...

మనసైన బంగరి మావను వద్దకు రారమ్మని కబురు పెడుతూ వాడికి ఈ చిన్నది ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో మనమూ విందామా. అదృష్టవంతులు చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అదృష్టవంతులు (1969)
సంగీతం : కె.వి.మహదేవన్  
సాహిత్యం : కొనకళ్ళ వెంకటరత్నం  
గానం : సుశీల

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకునే వేళ
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకునే వేళ
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ
పొద్దు వాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దు వాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగిపోతివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా 

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

మొన్నరేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగతోట మలుపు కాడ కొంగు లాగినపుడు
ఆ... ఓ... ఊఁ...
మొన్నరేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగతోట మలుపు కాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని ఇసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని ఇసిరి కొట్టినానని
నలుగురిలో చిన్నబోయి నవ్వులపాలైతివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా 

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెఱువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెఱువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా
అయిన వాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను
అయిన వాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను
గుట్టు బయట బెడితివా గోలగాని జేస్తివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా 


శనివారం, జూన్ 16, 2018

ఉషాపరిణయం(యక్షగానం)...

మల్లీశ్వరి చిత్రంలోని ఉషాపరిణయం యక్ష గానాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : కమలాదేవి, భానుమతి, బృందం

శ్రీ సతితో సరసీజనయనువలె
చెలువున దేవేరితో.. ఆఆఆఅ..
శ్రీ సతితో సరసీజనయనువలె
చెలువున దేవేరితో కొలువున
చెలువున దేవేరితో....
చెలువున దేవేరితో వెలయగ
చెలువున దేవేరితో....

రాజాధిరాజ, వీరప్రతాప, శ్రీకృష్ణరాయభూపా
సకలాంధ్ర నిఖిల కర్ణాట విపుల సామ్రజ్య రత్నదీపా
సామంత మకుట మాణిక్య కిరణ సందీప్త భవ్య చరణా
సాహిత్య నృత్య సంగీత శిల్పసల్లాప సరస భవనా
కళలకు నెలవగు మా దేవి సెలవైన పూని తలపైన
కరుణింపగ తిలకింపగ కడుయింపుగ నటియింపగ
కవిపండిత శ్రితకల్పభూజ నవభోజా.. నవభోజా..
సరసమధురముషా పరిణయమును
సరసమధురముషా పరిణయమును
దేవర సన్నిధి, కారుణ్య శేవధి,
దేవర సన్నిధి, కారుణ్య శేవధి,
చెలువున దేవేరితో కొలువున
చెలువున దేవేరితో వెలయగా...
చెలువున దేవేరితో


మగువాఅ...ఆఆఆఆఅ....
మగువా నీ జనకునకును
పగవాడు గదమ్మ కృష్ణు పౌత్రుడు.. వానిన్..
తగునా వలవగ, వానికి..
అగునా ఈ యంతిపురమునందడుగిడగా
అడుగిడిన నీ ప్రియు
డయ్యో మనగలడా
అడుగిడిన నీ ప్రియు
డయ్యో మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా

నా ప్రాణేశ్వర నవమదనా స్మేర సుందరానన
నా ప్రాణేశ్వర నవమదనా స్మేర సుందరానన
నా ప్రాణేశ్వర నవమదనా
ఎన్ని నాళ్ళు నిన్ను కోరి వేచితి
ఎన్ని నాళ్ళు నిన్ను కోరి వేచితి
మనసులో వలపులు దాచుకుని
నా ప్రాణేశ్వర నవమదనా స్మేర సుందరానన
నా ప్రాణేశ్వర నవమదనా
నా ప్రాణేశ్వర నవమదనా 
ప్రాణేశ్వర నవమదనా 
ప్రాణేశ్వర నవమదనా 
ప్రాణేశ్వర నవమదనా  
ఆఆఆఆఆ.....ఆఆఆఆఆ....

 

శుక్రవారం, జూన్ 15, 2018

నీకో తోడు కావాలి...

చదువు, సంస్కారం, గుణగణాలే ఎన్నటికీ చెదరని ఆస్తులని చాటి చెప్పే ఓ సరదా ఐన నృత్య రూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర 
గానం : ఘంటసాల, సుశీల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
నన్నే నీదాన్ని చేసుకోవాలి

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
నన్నే నీదాన్ని చేసుకోవాలి

నవనాగరీక జీవితాన తేలుదాం
నైటుక్లబ్బులందు నాట్యమాడి సోలుదాం
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

వగలాడి నీకు తాళి బరువు ఎందుకు
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను
ఏదొ హారుమని వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప
నేను చదువులేనిదాననని అలుసు నీకేల
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

నీతో వియ్యం దినదినగండం
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

సిరులూ నగలూ మాకు లేవోయి
తళుకూ బెళుకుల మోజు లేదోయి
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

ధనరాశి కన్న నీ గుణమే మిన్న
నీలో సంస్కారకాంతులున్నాయి  

నీకో బ్రూటు దొరికింది 
మెడలో జోలి కడుతుంది
ఈమె కాలిగోటి ధూళి పాటి చేయరు 
ఓ త్వరగా దయచేస్తే కోటి దండాలు 

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి

ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ
హాయ్‌ నిన్నే నాదాన్ని చేసుకుంటాను


గురువారం, జూన్ 14, 2018

ముందటి వలె నాపై...

ఈ అందమైన క్షేత్రయ్య పదాన్ని ఆత్మగౌరవం చిత్రంలో ఎంత అందంగా అభినయించారో చూద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : క్షేత్రయ్య పదం  
గానం : సుశీల

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలిక నేలరా నా సామి
ముచ్చటలికనేలరా
ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు
ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు
ఏరా మువ్వగోపాల మేరగాదుర నా సామి

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలికనేలరా

చిన్ననాట నుండి చేరినదెంచక
నను చౌక చేసేది న్యాయమా
నను చౌక చేసేది న్యాయమా
వన్నెకాడ నీదు వంచనలెరుగానా
నిన్నన పని లేదు నే చేయు పూజకు

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలికనేలరా

పిలువనంపిన రావు పిలచిన గైకోవు
పలుమారు వేడిన పలుకవు
వలపు నిలుపలేక చెలువుడవని నిన్నే
అఆఆఆ....ఆఆఆఆఆఅ.....
వలపు నిలుపలేక చెలువుడవని నిన్నే
తలచి తలచి చాలా తల్లడిల్లుటేకాని

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలిక నేలరా నా సామి
ముచ్చటలికనేలరా 

బుధవారం, జూన్ 13, 2018

ఓ ఉంగరాల ముంగురుల...

తనపై అలిగిన ప్రేయసి అలక పోగొట్టడానికి మాటల గారడితో అతనెలా బుజ్జగించాడో చెప్పే ఈ హుషారైన నృత్య రూపకం డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరధి 
గానం : మాధవపెద్ది, సుశీల, కోరస్

ఓహోహోహో.. హోయ్...
ఆహాహాహాహా...ఆఆఅ... హాయ్
ఓహోహోహోహో.. హాయ్.. 
ఆహి ఆహి ఆహీ.. ఓ ఆహి ఆహి ఆహీ..
ఆహి ఆహి ఆహీ.. ఓ ఆహి ఆహి ఆహీ..
ఆహి ఆహి ఆహీ.. ఓ ఆహి ఆహి ఆహీ.. 
ఓ భల్లే భల్లే భల్లే..
ఆఆఅ..ఆఆఅ...ఆఅ..
ఆహా ఆహాహ ఆహాహా
ఆఆఅ..ఆఆఅ...ఆఅ..
ఆహా ఆహాహ ఆహాహా

ఆహా.. ఆహా..
ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
హోయ్..
నా సామీరంగా దణ్ణవోయీ హోయి
నా జోలికింక రాకోయీ హాయి ..హాయి ..!
ఓ సిన్నోడ సిన్నోడ ఓ సిన్నోడా

ఓ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా !
ఓ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా !
హోయ్ హోయ్..
నువ్వు కస్సుమంటే తాళలేనే .. ఒ హాయి
నీ పొందుగోరి వచ్చినానే ! హాయ్.. హాయ్
ఓ చెలియా ! ఓ చెలియా ! ఓ చెలియా

ఆహ ఆహ ఆహ ఓహో ఓహో ఓహో
ఆహాహా ఆహాహా ఆహాహా..

నీ కైపు కళ్ళతో నీ కొంటె నవ్వుతో
గారడీ చేశావు భలే భలే
నీ తీపి మాటలు నీళ్ళలో మూటలు
నిన్ని౦క నమ్మనోయి !

నా సిలకా...హొయ్ హొయ్ ..
నీ అలకా.. హాయ్ హాయ్ .
తెచ్చిందిలే అందం.. నా కళ్ళు చూడవే
నీ బొమ్మ ఆడేనే మనసంతా నీవేనే !
పో పోవోయ్...
ఓ పిల్లోయి...
కిల్లాడి చాలులే...

హాయ్ ఓ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా ! హోయ్ హోయ్
నువ్వు కస్సుమంటే తాళలేనే .. ఒహాయి
నీ పొందుకోరి వచ్చినానే! హాయ్ హాయ్
ఓ చెలియా ! ఓ చెలియా ! ఓ చెలియా

హోయ్య..
ముచ్చట్లు గాలితో మురిపాలు పూలతో
నటనలు నాతోనా
సరసాలు సుక్కతో సరదాలు మబ్బుతో
సైయ్యాట నాతోనా !
ఇటు సూడవే... హోయ్ హోయ్
నీ తోడులే.. హాయ్ హాయ్
దాసుడు నీ వాడే...
నువ్వుంటే పక్కన మనసెంతో చల్లన
నా రాణి నీవేనే
ఓ రాజా..
నా రోజా..
ఈ రోజే హాయ్.. హాయ్..

ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
నా సామీరంగా దణ్ణవోయీ హోయి
నా జోలికింక రాకోయీ హాయి ..హాయి ..!
ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా

ఆహా ఆహా ఆఆ హోయ్..
ఓహో ఓహో ఓఓ హాయ్
ఆహా అహ ఓహో ఒహొ హయ్
ఆహా అహ ఓహో ఒహొ హయ్
ఆహా ఆహా ఆహా.. ఓహో ఓహో ఓహో
ఆహా ఆహా ఆహా.. ఓహో ఓహో ఓహో
ఓ భల్లే భల్లే భల్లే
ఓ భల్లే భల్లే భల్లే
హో..య్య్...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.