మనుషులు మమతలు సినిమాలో ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మనుషులు మమతలు (1965)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం : జానకి
ఒకడు కావాలి
అతడు రావాలి
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
ఒకడు కావాలి
అందము చిందెడు ఆనందమైనవాడు
నవ్వులు పువ్వులుగా తవ్వి పోయువాడు
వెచ్చని కౌగిలిలో విందు చేయువాడు
బలే మొనగాడు జతగాడు నా వాడూ
ఒకడు కావాలి
అతడు రావాలి
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
ఒకడు కావాలి
తీయని ఊహలతో తేలిపోవువాడు
తీరని కూరిమితో చేరదీయువాడు
చల్లని చూపులతో మనసు లాగువాడు
బలే మొనగాడు సరిజోడు నావాడూ
ఒకడు కావాలి
అతడు రావాలి
నాకు నచ్చినవాడు
నన్ను మెచ్చిన వాడు
ఒకడు కావాలి
2 comments:
ఆన్ యే లైటర్ నోట్..ఒక్క మగాడు సిమ్రాన్ పాటకి ఇది ఇన్స్పిరేషనేమో..
హహహ అయుండచ్చు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.