సతీ సావిత్రి కథ తెలియని తెలుగువారు ఉండరేమో అనడం ఎంత నిజమో అందులో చాలా మందికి ఈ నాటకం ద్వారానే తెలిసి ఉండచ్చు అనేది కూడా అంతే నిజం. ఎన్టీఆర్ సావిత్రి నటించిన ఈ నాటకం తెలుగునాట అంతగా ఫేమస్ అయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకం
ఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్
గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడే
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకం
ఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్
గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడే
ఓహోహోహో.. ఏమి ఆశ్చర్యమూ
భహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క
అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు
ఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగా
భహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క
అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు
ఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగా
సావిత్రీ ! మానినీ ఆహ్హ్హహ్హహ్హహ్హహ్హహ్హ
నిర్నిమిత్త సందేహడోలాయ మానసవై
ఏల అట్లు దిగాలున చూచుచుంటివి
సామాన్య మనీషాగోచరంబైన
మద్రూప విశేషంబు గాంచియే
నేనెవ్వరో యూహించి ఉండజాలుదువు
ఐనను వచించెద
క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు
ఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాక
వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు
నాలుగు మూడైన అగునుగాక
పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు
తాళము తప్పిన తప్పుగాక !
చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ
పలికినా అపశృతుల్ పలుకుగాక
సకల లోకాల ధర్మశాసనము నమలు
చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానె
వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి
మోసికొని పోవుచుండు యముండ - అబలా !
సావిత్రీ ! ఇదిగో నీ పతి ప్రాణంబుల్ గొనిపోవుచున్నాడ
అయ్యో ! అయ్యో ! ఆ!
నాథా ! నాథా !
హ్హహ్హహ్హ మహిషరాజమా మరలుము
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !
సుంతయేని కరుణ మాని
సుంతయేని కరుణ మాని
కాంతుని ప్రాణములను గొని
పోవుచున్నావా !
ఆహా ! ఏమీ ఈ సాధ్వీలలామ సాహసము
దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతముశైవించి
నన్ననుసరించు ఈమె స్థైర్యము సంస్తవనీయమైననూ..
అహో.. నిష్ప్రయోజనమే... కనుక.. చెప్పి చూచెదను గాక
కాలు మోపిన చాలు కస్సని అరికాలు
కోసుకుపోయెడి కూసురాళ్ళు
అలికిడైనను చాలు అదరి బుస్సున లేచి
పడగెత్తి పైబడు పాపరేళ్ళు
అడుగుపెట్టిన చాలు ఒడలు జిల్లున లాగి
నరములు కుదియించు నదుల నీళ్ళు
గాలి దోలిన చాలు కదలి ఘీ..యని కర్ణ
పుటములు ప్రేల్చెడి ముది వెదుళ్ళు
పులులు సింహాలు శరభాలు పోవ పోవ
కటిక చీకటి కనరాదు కాలిదోవ
మరలిపొమ్మిక విడువుము మగని ఆశ
మాట వినవేల ఓ బేల మరలవేలా..ఆఆ...
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
నా వెంట రా తగదు రావలదు రా తగదు రావలదు
పోపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
చీమలు దూరని చిట్టడవులలో
కాకులు దూరని కారడవులలో
లబోదిబోమని అఘోరించినా
లబోదిబోమని అఘోరించినా
ఫలితము సున్న మరలుము మెదలక
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !
పోవుచున్నావా !
ఆహా ! ఏమి ఈ బాల అచంచల మనఃస్థైర్యమూ
దుర్గమ కీకారణ్య సీమలనధిగమించుటయే గాక
మహోన్నత పర్వత శిఖరాగ్రమ్ముసైతమధిరోహించి
నన్ననుసరించుచున్నదే హొహ్హో మరియునూ
మరికొంచెము బెదరించి చూచెదను గాక
చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
చెప్పిన వినవు చెముడా గిముడా
పట్టిన పంతము విడువవుగా
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
ఏమనుకొంటివి ఎవడను కొంటివి
సముండను పాశధరుండను
కాల యముండను ఆహ్హహ్హహ్హహ్హ...
పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ ఫో..
ఆహో.. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా
బేలా సావిత్రీ ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిది
గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు
అరంఘనీయమైన వైతరణి అల్లది
అన్నియునూ తెలిసిన ధర్మ వేదులుమీరు
ఇంత దూరమేతెంచి రిక్త హస్తములతో తిరిగి పొమ్మందురా
మరి ఏమందును... హ్మహుహు ఇదియునూ నిక్కంబు
కనికరించి ఏదైనా ఒక్క వరంబునొసంగి పంపెద
సాధ్వీ నీ కార్యదీక్షతకు కడుంగడు సంతసించితి
నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా
మరొక్క వరంబు కోరుకొనుము ఇచ్చెద
ఈ యముని కర్కశ హృదయంబు
కూడా కరుగుచున్నట్లున్నది
ఇచ్చిన అవకాశమేల జారనీయవలె
స్త్రీలకు పుట్టినింటికన్నను మెట్టినిల్లే
ప్రధానమని కదా ఆర్యోక్తి
యమధర్మరాజా ఆ! రాజ్య భ్రష్టులై అంధులై
కారడవులందు కటకటంబడు మా అత్తమామలకు
సరియ సరియ రాజ్య ప్రాప్తియూ నేత్ర దృష్టియూ
రెండునూ ఒసంగితిని పొమ్ము
ఆ ! వదలక వచ్చుచున్నదే
ఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను
మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా
కనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించి
ఊరడించి మరలించెద
సావిత్రీ అబలవన్న ఆదరంబున
ఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభున
మరొక్క వరంబీయ ఇచ్చగించితీ
అదియును నీ పతి ప్రాణంబు దక్క
ఆ ! ఇప్పుడు దారిన పడినాడు
ఈ అవకాశమును మాత్రమేల పోనీయవలె
కన్నవారి ఋణము తీర్చెద
సమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అని
అలమటించు నా జనకునకు
రెండునూ ఒసంగితిని పొమ్ము
ఆ ! వదలక వచ్చుచున్నదే
ఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగినను
మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా
కనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించి
ఊరడించి మరలించెద
సావిత్రీ అబలవన్న ఆదరంబున
ఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభున
మరొక్క వరంబీయ ఇచ్చగించితీ
అదియును నీ పతి ప్రాణంబు దక్క
ఆ ! ఇప్పుడు దారిన పడినాడు
ఈ అవకాశమును మాత్రమేల పోనీయవలె
కన్నవారి ఋణము తీర్చెద
సమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అని
అలమటించు నా జనకునకు
ఆ! ఇక చాలు బాబోయ్ అను అటుల
సుతశతంబనుగ్రహించితి
సంతుష్టవై మరలిపొమ్ము
ఒకటి నే కోరితి రెండు నీవిచ్చితి
ముచ్చటగా మూడవ కోర్కె
చెల్లించకుండుట పాడియే ధర్మమూర్తీ
ఊ ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే
ఐనను ఆఖరి కోరికని వాపోవుచున్నది ఇచ్చి పంపెద
సావిత్రీ స్వామీ అడుగుము
అదియును నీ పతి ప్రాణంబు దక్క
సంతానమును చూసియైనను
సంతసించు భాగ్యమును ప్రసాదింపుము
ప్రసాదించితిని పొమ్ము.. ఊ !
ఇంకెక్కడికి పోయెదవు
ఏమీ ! నా పతి ప్రాణంబులీయక
అడుగు వేయలేవు
ఏమీ అడుగువేయలేనా
మహిషరాజమా.. ఊ !..
ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష
యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననూ..
విలయ రుద్రుని ప్రళయ తాండావ ఘోష విన్ననూ
నెమరాపక అడుగు తప్పక తలతిప్పక ముందుకు సాగిపోవు
నా మహిషరాజము నేడేలనో తత్తరపాటున బిత్తరపోవుచున్నదే...
హహహహహహహ..
ఊ... నీవు సాధ్వీయే అనుకొంటిని ఇంద్రజాలవు కూడానా
ఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే
ధర్మబద్ధమా... నాకు తెలియని ధర్మమా
యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా ఎటుల
అమరులెటులైన సంతాన మందవచ్చు
మనుజ లోకాన సాధ్వులు మగడు లేక
పుత్రసంతాన మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !
ఆహా ! పతివ్రతా శిరోమణి యన్న వాత్సల్యంబున వచ్చియుంటిని
కాని ఇంతటి తెలివి గలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుండెడి
వాడను కదా గతంబునకు వగచి ప్రయోజనంబేమి కనుక
సాధ్వీ సావిత్రీ నీ పతి భక్తికి సమయస్ఫూర్తికీ
కడుంగడు సంతసించితి ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము హహహ
యముడంతవానినే తికమక బెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్ధము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించి తదనంతరంబున నా లోకంబున అహ్హ! కాదు కాదు స్వర్గ లోకంబున జేరి
తరింతురు గాక తరింతురు గాక తరింతురు గాక
2 comments:
https://www.youtube.com/watch?v=6RTq_TYTlSM
సతీసావిత్రి(1957) ఒరిజినల్ వెర్షన్..ఇంకా ముందు మరేదైనా ఉన్నదేమో తెలీదు..
ఇంట్రెస్టింగ్.. నేను చూడలేదు శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద లింక్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.