బుధవారం, ఏప్రిల్ 30, 2014

కన్నె కొమ్మన తుమ్మెద...

ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో వచ్చిన కాలాపాని సినిమాలో దదాపు అన్నిపాటలు బాగున్నా కూడా ఈ పాట నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ప్రత్యేకంగా చిత్రీకరణ పరంగా కూడా ఈ పాట ఆసక్తికరంగా చిత్రీకరించారు ప్రియదర్శన్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : కాలా పాని (1996)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : నారాయణ వర్మ
గానం : బాలు, చిత్ర

కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల ..ఉయ్యాలల.. ఆనవాలా...
విందీయగ.. పూదేనియ.. ఓయిలాలా..


కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగ..
ఈడేరగ.. తారడగ.. అబ్బురాలా..
నాజూకుగ.. నాదానిగ.. అమ్మలాల..

గుండెల్లోన తొలకరింపు పొంగే జల్లుల్లో..
కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో..

కన్నె కొమ్మన తుమ్మెద.. రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల.. ఉయ్యాలల.. ఆనవాలా
విందీయగ.. పూదేనియ.. ఓయిలాలా


మిలమిల కళ్ళల్లో అల పూచే పున్నాగ తేరు.. హొయ్
చెలి చిరు హృదయంలో ఎల సవ్వడి ముచ్చట తీరూ...ఊఊ..
కోరికల కోన ..సంబరమాయే చేరుకోవే మైనా...ఆ..
గొరింక వలచి వచ్చి మారాలా...
ఊసుల్ని ఉసిగొల్పి జాగేలా...

బాలా.. పరువాల సిగ్గు మురిపాల.. ముద్దాడగనేల..
ఎద ఈడేరిన వేళ..

కన్నె కొమ్మన తుమ్మెద.. రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల.. ఉయ్యాలల..ఆనవాలా
విందీయగ.. పూదేనియ..ఓయిలాలా

 
గల గల గోదారి.. సడి సరాగాల హోరూ..ఉయ్..  

అరమరికలు లేక ఎద విహారాల జోరు... హొయ్
పూచినది ప్రాయం తుమ్మెద వాల... మనసు కోరి సాయం... 

 పూదోట మాటు చూసి పోదామా..
సరసాల జాగారం చేద్దామా...
ఈడే విడ్డూరం ఎందుకు మోమాటం...
ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం...


కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగ..
ఈరేడగ.. తారడగ.. అబ్బురాలా..
నాజూకుగ.. నాదానిగ.. అమ్మలాల..

గుండెలోన తొలకరింపు పొంగే జల్లుల్లో 

 కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో

కన్నె కొమ్మన తుమ్మెద.. రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల.. ఉయ్యాలల ..ఆనవాలా
విందీయగ.. పూదేనియ ..ఓయిలాలా 

 

మంగళవారం, ఏప్రిల్ 29, 2014

నాగమల్లివో తీగ మల్లివో...

రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో ఒక మధురమైన పాట. చిన్నపుడు రేడియోలో చాలా ఎక్కువగా విన్నపాట... అలా గుర్తుండిపోయింది. ఈ పాటలో నాగమల్లివో.. తీగమల్లివో.. అని ఒక్కో పదానికి బ్రేక్ వచ్చినపుడు వచ్చే ఒక చిన్న మ్యూజిక్ బిట్ తో సహా పాడేసుకునే వాణ్ణి చిన్నప్పుడు. సున్నితంగా అలా సాగిపోయే ఈ పాట నాకు చాలా ఇష్టం మీరూ విని ఆస్వాదించండి. వీడియో లింక్ దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి.   చిత్రం : నాగమల్లి (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి

వీణల్లే పాడు జాణల్లే ఆడు
రసధునివై నీవు నాలోనా
ఊగాలీ రాగ డోలా
నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవెళా
నువ్వేనా రాసలీల
నేను వేణువై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి

నువ్వే నా ఈడు నవ్వే నా తోడు
కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల
నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వేళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పువ్వున పులకరింతలే
విరిసెను మన చిరు నవ్వులలో

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ... 
 

సోమవారం, ఏప్రిల్ 28, 2014

ఈ చైత్ర వీణా...

వంశీ ఇళయరాజా వేటూరి ఈ ముగ్గురు కలిస్తే ఇక మనకు మాటలకు అవకాశమెక్కడ ఉంటుంది చెప్పండి తనివితీరా కమ్మని పాటను ఆస్వాదించడమే తప్పించి. ప్రేమించు పెళ్ళాడు సినిమాకోసం ఈ ముగ్గురు సిద్దం చేసిన ఈ అద్భుతమైన పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..
రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో
ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమే వలపే పుడుతుంటే..
తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...
పూలే గంధం పూస్తుంటే ..ఏ..
తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా... 
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..
నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...
గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...
సంధ్యారాగం అవుతుంటే...
లయలే ప్రియమై పోతుంటే....హోయ్..
వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ...నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. 
 

ఆదివారం, ఏప్రిల్ 27, 2014

జూలై మాసం వస్తే...

పద్మవ్యూహం  సినిమాలో చలాకీ అయిన ఒకపాట ఇది.. సరదాగా ఉంటుంది.. మీరూ చూసీ విని ఎలా ఉందో చెప్పండి. ఎంబెడ్ చేసిన వీడియో తమిళ్ పాటది. తెలుగు ఆడియో ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా ఇక్కడ విని డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : పద్మవ్యూహం (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : మనో, అనుపమ

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

నింగినెగిరిపోదామా రాచిలకల రెక్కను అడగాలి
అర్ధరాత్రి విడిదికని జాబిల్లిని చోటే అడగాలి
గాలి దేవుని తోడడిగీ చూద్దామా దేశాలే
అడవి తల్లిని మాటడిగీ కడదామా గూడొకటి
అడగగానే చెయ్యదే గాలి మనకి సాయం
ప్రేమ అన్నది సర్వదా సర్వతేజా సత్యం

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు

కొత్త కాదే ముద్దంటే ఇక భూటక వేషం వేయొద్దే
మనసు సర్వం నా సొంతం అది ఊసులతోనూ దాచొద్దే
కథలు పలికే పానుపిది కన్నీరే ఒద్దంట
ఆదమరచి ఐ లవ్ యూ చెప్పాలి నువ్వంట
అంతులేని ప్రేమిది నీకు నాకు యోగం
కోటి బాసల సాటులో పంచుకుందాం భాగం

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట 
 

శనివారం, ఏప్రిల్ 26, 2014

ఓ నేనే ఓ నువ్వని...

కలవరమాయే మదిలో సినిమాలో నాకు నచ్చిన ఒక మాంచి రొమాంటిక్ మెలొడీ... మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : కలవరమాయే మదిలో (2009)
సంగీతం : శరత్ వసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : హరిహరన్, కల్పన

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ
నేనంటూ ఇక లేనని.. నీ వెంటే వున్నానని.. చాటనీ
చేశానే నీ స్నేహాన్ని.. పోల్చానే నా లోకాన్ని.. నీ వాణ్ణి ..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ

మారాము చేసే మా రాణి ఊసే నాలోన దాచానులే...
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకేనే..
నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడాను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ

ఆఆఆఆఆఅ...ఆఆఆఆ....
నీ నీడలాగ నీతోనే వున్నా.. నీ జంట నేనవ్వనా...
వేరేవ్వరున్న నీ గుండెలోన.. నా కంట నీరాగునా...

ఆ తలపు నా ఊహ కే తోచునా ...నా శ్వాస నిను వీడి జీవించున...
నీ కంటి పాపల్లె నే లేనా ..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ
నేనంటూ ఇక లేనని.. నీ వెంటే వున్నానని.. చాటనీ
చేశానే నీ స్నేహాన్ని.. పోల్చానే నా లోకాన్ని.. నీ వాణ్ణి ..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ 

 

శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

జాబిలమ్మ నీకు అంత కోపమా

ఒకప్పుడు మంచి మెలోడీలు అందించిన ఎస్.ఎ.రాజ్కుమార్ గారి సంగీత సారధ్యంలో సిరివెన్నెల గారు రాసిన ఈ పాట చాలారోజుల పాటు ప్రేమికులకు ప్రేయసి అలక తీర్చడానికి ఉపయోగపడి ఉంటుందేమో ఆరోజుల్లో... మీరూ చూసీ వినీ ఎలా ఉందో చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : పెళ్ళి (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు  

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 
అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..
 

చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా
చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కలలుకన్న తీరమా
 
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..

మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 
అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. 
 

గురువారం, ఏప్రిల్ 24, 2014

పాప ఈడు గోల..

చైతన్య సినిమాలోనిదే మరో మధురమైన పాట నాకు చాలా ఇష్టమైనది, ఇళయరాజా సంగీతం ఓలలాడిస్తే వేటూరి వారి సాహిత్యం అందమైన ప్రాసలతో చిత్రంగా మనసుకు హత్తుకుపోతుంది. నాగార్జునా గౌతమిల గురించి చెప్పేదేముంది. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : చైతన్య (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కోరస్

పాప ఈడు గోలా.. పాట పేరు జోలా..
ఊగుతోంది బాల... యవ్వనాల డోలా...
నీవు వేణువైతే.. నేను ఊపిరౌతా...
మోగాలి ఎదలో ఈల.. మోహాల సరి రాగాలా...
 
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
 
Be happy... happy all the time... 

ఏదో సాగింది చిలిపి కథా.. ఓటమి గెలుపైన వలపు కథా...
కునుకే రాకున్న కనుల కథా.. ఉడికే పరువాల పడుచు కథా..
పూసేటి వేసంగి పూరేకులో... రాస్తాను నీ పేరు తేనెలతో...
తెన్నేటి ఇసుకమ్మ తీరాలలో... వేస్తాను పాదాలు నీ జతలో...
పాషాణమై పోకు వైఢూర్యమా....

పాప ఈడు గోలా..పాట పేరు జోలా..
ఊగుతోంది బాల...యవ్వనాల డోలా...

ఆటే కారాదు బ్రతుకు సుమా... అతికే మనసంటు లేదు సుమా..
చేతులు కలిపింది చెలిమి సుమా... ఎగిరే నా ప్రేమ పావురమా..
ఆనాటి స్నేహాల వాకిళ్ళలో.. ఈనాడు వేచేను దోసిలి తో...
కాలాలు దాటాను కౌగిళ్ళలో... స్వర్గాలు చూడాలి నీ ఒడిలో..
శిల నీవు కాబోకు శృంగారమా...

పాప ఈడు గోలా.. పాట పేరు జోలా..
ఊగుతోంది బాల... యవ్వనాల డోలా...
నీవు వేణువైతే.. నేను ఊపిరౌతా...
మోగాలి ఎదలో ఈల.. మోహాల సరి రాగాలా...
 
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time... 
Be happy... happy all the time...  
 
 

బుధవారం, ఏప్రిల్ 23, 2014

చక్కిలిగింతల రాగం...

ఈ సినిమా విడుదలైన రోజుల్లో ఈ పాటమొదట్లో వచ్చే ఈల తెగ ప్రాక్టీస్ చేసేసి నేర్చేసుకున్న జ్ఞాపకం నేటికీ ఓ అపురూపం. పాటంతా సింపుల్ గా చాలా చలాకీగా అదే సమయంలో మెలోడీ ఎక్కడా మిస్ అవకుండా అలవోకగా స్టైల్ గా సాగిపోతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. బాలు చిత్ర గార్లు ఇద్దరూ చాలా బాగా పాడారు. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఈ క్రింది ఎంబెడెడ్ వీడియోలో (మూడవ పాట) కానీ లేదా ఇక్కడ కానీ వినవచ్చు.చిత్రం : కొదమ సింహం (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చెక్కిలిగుంటల గీతం...
 
ఓ ప్రియ యా యా యా యా....
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
 
ఓ ప్రియ యా యా యా ....
సాయంత్ర వేళ.. సంపంగి బాల
శృంగార మాల... మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య యాయా...

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా....

కౌగిట్లో ఆకళ్ళు.. కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు...
పాలల్లో మీగడ్లు.. పరువాల ఎంగిళ్ళు ...
మెత్తంగ దోచాడమ్మ లౌజు....

వచ్చాక వయసు.. వద్దంటే ఓ యెస్సు..
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ.. అంటే తంట.. ఊపందుకుంటా...
నీ ఎండ కన్నేసి.. నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు...

యా యా యా....
 
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే

చెక్కిలిగుంటల గీతం...
ఓ ప్రియ యా యా యా యా....

చూపుల్లో బాణాలు.. సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు...

నీ ప్రేమ గానాలు.. లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు..
గిలిగింత గిచ్చుళ్ళు.. పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే.. నాకు మనసు

సయ్యంటేజంట.. చెయ్యందుకుంట...
బుడమేటి పొంగంటి.. బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు
య యాయ....

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చెక్కిలిగుంటల గీతం...

ఓ ప్రియ యా యా యా యా....
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం

ఓ ప్రియ యా యా యా ....
సాయంత్ర వేళ.. సంపంగి బాల
శృంగార మాల... మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య..యా..య... 

 

మంగళవారం, ఏప్రిల్ 22, 2014

ఎంతో రసికుడు దేవుడు...

బాలు గారి ప్రైమ్ టైమ్ లో పాడిన సింపుల్ అండ్ స్వీట్ సాంగ్.. నాకు చాలా ఇష్టమైన పాట మీరూ విని ఆస్వాదించండి. ఎంబెడ్ చేసినది ఫోటోలతో చేసిన ప్రజంటేషన్.. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : రాజా రమేష్ (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో..ఓ.. రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు
ఎంతో రసికుడు దేవుడు...ఊ...

పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
ఆ ఘుమఘుమలు గుమ్మరించి శ్వాస నింపినాడు
నీ శ్వాస నింపినాడూ...
నీ పెదవులలో పూదేనియ పొదిగి తీర్చినాడూ...ఊ..

ఎంతో రసికుడు దేవుడూ...

నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు
నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు
ముద్దులొలుకు మోముకు ముద్దబంతి పొందికా...ఆ...
మొత్తంగా ఏ పువ్వు నీకు సాటిరాదుగా...ఆ...

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు
ఎంతో రసికుడు దేవుడు... 
 

సోమవారం, ఏప్రిల్ 21, 2014

ఒకే ఒక మాట...

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ పాటకి సంబంధించి ఒక్కటే లోటేమిటంటే ఇది చక్రి పాడటం.. మరెవరైనా గాయకుడు పాడుంటే ఈ పాట మరింత బాగుండేదేమో అనిపిస్తుంటుంది అపుడపుడు. మీరూ ఆస్వాదించండి ఈ సిరివెన్నెల ప్రేమ గీతాన్ని. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : చక్రం (2005)
సంగీతం : చక్రి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చక్రి

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలనీ..

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా 

ఆఆఆఅ...ఓఓఓఓఓఓ...
ఆఆఆఅ...ఓఓఓఓఓఓ...


నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మననీ నవ్వుకొని చాల్లే పోమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటిమైమరుపులో నను పొల్చుకుంటాననీ
తల ఆన్చి నీగుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా  

ఒహ్హో..ఓఓ... ఒహ్హ్హోఓఓఓఓ
ఒహ్హో..ఓఓ... ఒహ్హ్హోఓఓఓఓ
 
 నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆక్షణం నను వొదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నేదేననీ నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా  

నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలనీ..

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా 

 

ఆదివారం, ఏప్రిల్ 20, 2014

ఈనాడే ఏదో అయ్యిందీ...

ఇళయరాజా గారి మీద అభిమానం పదింతలు పెరగడానికి దోహదం చేసిన పాటలలో ఇదీ ఒకటి...రెండవ చరణానికి ముందు వచ్చే మ్యూజిక్ బిట్ ఎన్ని లక్షల సార్లు విన్నా బోరు కొట్టకపోగా అదే పులకింత కలుగుతుంది. ఈ సినిమాలో రేవతి కూడా చాలా బాగుంటుంది. మీరూ ఈ పాట విని చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఈనాడే ఏదో అయ్యిందీ...ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ... ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ...

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
నింగీ నేలా ఏకం కాగా...  ఈ క్షణమిలాగె ఆగిందీ
నింగీ నేలా ఏకం కాగా...  ఈ క్షణమిలాగె ఆగిందీ
ఒకటే మాటన్నదీ... ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ...  అదినా సొమ్మన్నదీ
పరువాలు మీటి... న న న న న
సెలయేటీ తోటి... న న న న న
పాడాలీ నేడు... న న న న న
కావాలీ తోడు... న న న న న న న న ....
 
ఈనాడే ఏదో అయ్యిందీ ... ఏనాడూ నాలో జరగందీ

సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ

పగలూ రేయన్నదీ.... అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ.... నిజమే కమ్మన్నదీ
ఎదలోనీ ఆశ... న న న న న
ఎదగాలి బాసై... న న న న న
కలవాలీ నీవు... న న న న న
కరగాలీ నేను... న న న న న న న న ....

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ... అందాలా లోకం రమ్మందీ

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ 

 


శనివారం, ఏప్రిల్ 19, 2014

ఆకాశ గంగా...

వాన సినిమా కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఈ పాటలు విడుదలైన కొత్తలో ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు. కార్తీక్ చాలా బాగా పాడాడు. ఈ అందమైన పాట మీరూ విని ఆస్వాదించండి. ఎంబెడ్ చేసిన వీడియో వాటర్ ఫాల్స్ తో చేసిన అద్భుతమైన ప్రజంటేషన్. ఈ పాట సినిమాలోని వీడియో చూడాలంటే ఇక్కడ చూడండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వాన (2007)
సంగీతం : కమలాకర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
ఆకాశ గంగా..

ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా..
ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
ఆకాశ గంగా..
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
ఆకాశ గంగా.. 
 

శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

క్షణం క్షణం నా మౌనం...

హిందీలో సూపర్ హిట్ అయిన "కహానీ" చిత్రానికి తెలుగు సేత "అనామిక" శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తయారవుతున్నదని అందరికి తెలిసిన విషయమే. ఆ చిత్రం కోసం సిరివెన్నెల గారు రాయగా కీరవాణి గారు స్వరపరచిన ఈ పాట నాకు నచ్చింది. సినిమాలోని పాటనే యథాతథంగా ఉపయోగిస్తూ గాయని సునీతతో సినిమాలోని సీన్స్ మిక్స్ చేసి చేసిన ప్రమోషనల్ మ్యూజిక్ వీడియో ఇది, మీరూ ఆస్వాదించండి.  చిత్రం : అనామిక (2014)
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కీరవాణి
గానం : సునీత

ఎవ్వరితో చెప్పనూ.. ఎక్కడనీ వెతకనూ..
మనసు ఏదనీ... నిను చేరె ఆశతో..
ఎదురీదే శ్వాసతో.. గాలిలో తిరుగుతూ..
ఉండనీ.... ఎవరితో.. చెప్పనూ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
 
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నిను మరువదే తలపు
వెను దిరగదే చూపు
కనపడనిదే రేపు
నమ్మడమెలా.. నువ్వు కలవేననీ
కంటపడవా.. ఉన్నాననీ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నను తరుముతూ సమయం
నిను తడుముతూ హృదయం
ఎటు నడపనూ పయనం
ఎంతవరకూ.. ఇలా కొనసాగనూ..
ఏ మలుపులో.. నిను చూడనూ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది 
 

గురువారం, ఏప్రిల్ 17, 2014

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే...

సిరివెన్నెల గారు రాసిన పాట గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి. ఈ చక్కని పాటను మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు ఐతే ఇది కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ప్లే అవుతుంది ఇతరులు కింది ఎంబెడ్ వీడియో చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నువ్వేకావాలి(2000)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీరామ్, గోపికా పూర్ణిమ

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోందీ 
చెలీ! ఇదేం అల్లరి
నానీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఓఓఓఓ... దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన

లాలాలలల లాలాలలలల 
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోంది... 
చెలీ! ఇదేం అల్లరి
లాలాలలల ఏహే.. లాలాలలలల 

నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నెలకన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువులేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నన్ను పిలిచినట్టనుకున్నా
 
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా 
ఏమిటౌతుందో ఇలా నా ఎదమాటునా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావనా

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోంది.. 
చెలీ! ఇదేం అల్లరి
లాలాలలల.. లాలాలలలల
లాలలాల లాలాలాల లాలలాల లాలాలాలా

కొండలనుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అందీ
నువ్వూ అలా వస్తూ ఉంటావని
గుండెలనుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ నీకై చూస్తూ వుంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావనా  

నానీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఓఓఓఓ.. దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన

లాలలాల లాలాలాల 
 

బుధవారం, ఏప్రిల్ 16, 2014

భద్రుని చరితము...

హరికథా ప్రక్రియపై నాకున్న ప్రత్యేకాసక్తి మీకు తెలిసినదే కదా రామకథలతో వచ్చిన రెండు ముఖ్య హరికథలు (స్వాతిముత్యం, వాగ్దానం నుండి) ఇదివరకే ఈ బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది. అందుకే ఈ ఏడాది అందాల రాముడు సినిమాకోసం అక్కినేని గారు కథకునిగా నటించిన ఈ భద్రుని చరితము హరికథని మీకోసమ్ అందిస్తున్నాను. ఈ హరికథ వినడంకన్నా వీడియో చూడడం నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే చక్కగా బాపు గారి బొమ్మలతో భద్రుని కథని మనం చూడవచ్చు. నాగేశ్వరరావు గారు కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు ఇందులో. ఈ హరికథను ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేస్కోండి.
చిత్రం : అందాల రాముడు (1973)
సాహిత్యం : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : రామకృష్ణ, రాఘవులు, ట్టాభి భాతార్(నం)

మా తల్లి గోదారి చూపంగ దారి
పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా
భద్రగిరి మహిమలే విందామా
భద్రగిరి మహిమలే విందామా ఓఓహో..ఓహో

ఏవిటోయ్ ఆ మహిమలు ?

శ్రీ మద్రమారమణ గోవిందో హారి
భక్తులారా.. సుజనులారా
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున..
పావన గోదావరీ తీరంబున ఒకానొక గిరిని
పరికించి, దానిపై సుంత
విశ్రమించినంత, ఆ కంధరమ్మొక సుందర
పురుషాకృతి దాల్చి.. ఏమనినాడనగా..

ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
మేరు గిరీంద్రుని పుత్రుడను
నీ రాకకు చూచే భధ్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు
నా శిరమున నెలకొన వేడెదనూ..
కారుణ్యాలయ కామితమీడేర్చ
కలకాలము నిను కొలచెదనూ
ధన్యుడ.. ధన్యుడ...
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా

అని భద్రుడు ప్రార్ధించిన స్వామివారేమన్నారనగా..
వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు
మా తండ్రిమాట చెల్లించవలయును గదా
ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను..
అని వెడలిపోయిరి.. అంతట...

వెడలిన రాముడు వెలదిని బాసి
ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి
కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి
కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరచాడు
రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు
శ్రీమద్రమారమణ గోవిందో... హారి..

కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా
ఎదురుచూస్తూ ఏవిధముగా శోకించినాడనగా

వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శలవిచ్చిన పిమ్మట
మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా
అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున
నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా

అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు
సంక్షోభమ్ము నొందిరి... అపుడు..

కదలెను శ్రీ మహా విష్ణువు
కదలెను భక్త సహిష్టువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక
శుభ శంఖ చక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు
సుపర్ణుని భుజమైన ఎక్కకా
వడివడి కదలెను శ్రీ మహా విష్ణువు
ఆహా కదలెను భక్త సహిష్టువు

శ్రీమద్రమారమణ గోవిందో... హారి..

గజేంద్ర మోక్ష సన్నివేశంబుకై వడి 
స్వామి వారు ఆ విధమ్ముగా కదలగా..

తన వెంటన్ సిరి 
లచ్చి వెంట నవరోధవ్రాతమున్
దాని వెన్కను పక్షీంద్రుడు
వాని పొంతను ధనుఃకౌమోదకీ
శంఖ చక్ర నికాయంబునూ

హుటాహుటిని రాగా తొందరయందు
అపసవ్యంబుగా ఆయుధములు ధరించి
స్వామివారు దర్శనంబీయ ఆ భక్తశిఖామణి ఏమన్నాడు..

ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్ను బ్రోచు నారాముడవు గావు
నాటి రూపు చూప నమ్మగలను 

అని భద్రుడు కోరగా – శ్రీ మహావిష్ణువు
తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు, ఆతీరుగనే చేతుల నిల్చెను..
భద్రుడు మహదానంద భరితుడై

ఈ తీరుగనె ఇచ్చట వెలయుము
ఇనకుల సోమా రామా
భూతలమున ఇది సీతారాముల
పుణ్య క్షేత్ర లలామా

శభాష్..

అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలసిరి.
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను. భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై..
ఒక నాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్క
అను భక్తురాలి స్వప్నమ్మున సాక్షాత్కరించి
ఆ వైనమ్ము తెలుపగా ఆయమ భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను.

కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడి కట్టలేని ఈ బడుగు పేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా
విధి వక్రించి నీకే వాసమ్ము కరువా

తాటాకు పందిరే తాటకాంతక
నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార
విందులయ్యా నీకు విందులయ్యా

అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను.
తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన
కంచెర్ల గోపన్న ఏవిధముగా ఆలయ నిర్మాణము గావించెననగా..
ఏవిధముగానా ! అప్పుజేసి..
తప్పునాయనా! గోపన్న చరితములోక విఖ్యాతము..
తదీయ సంస్మరణము మంగళదాయకము

రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం
జై.. శ్రీమద్రమారమణ గోవిందో... హారి !

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.